గుంటూరు, జూలై 3: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. గుంటూరులో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో త్వరలో గుంటూరులో సీమాంధ్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. జలవనరుల పంపిణీ అంత సులభతరమైన అంశం కాదని అన్నారు. కేవలం తెలంగాణవాదుల హడావిడే తప్ప ఇంతవరకు ఈ విషయమై తమ పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికీ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాను భావిస్తున్నట్లు రాయపాటి పేర్కొన్నారు.
‘విభజన’పై ఇక చర్చలొద్దు
సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి
దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం
విశాఖపట్నం, జూలై 3: రాష్ట్రాన్ని విభజించే అంశంపై ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి డిమాండ్ చేసింది. విభజన, సమైక్య అంశాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఆదేశించడం పట్ల జెఎసి మండిపడింది. దిగ్విజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రావిశ్వవిద్యాలయం వద్ద దిగ్విజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా జెఎసి ప్రతినిధులు లగుడు గోవిందరావు, ఆరేటి మహేష్ మాట్లాడుతూ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్న కాంగ్రెస్ రెండు ప్రాంతాల వారినీ మభ్యపెడుతోందన్నారు. దిగ్విజయ్ సింగ్ తన తీరును మార్చుకుని సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విభజనపై స్పష్టత లేకుండా వెళ్తే కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో పరాభవం తప్పదని పేర్కొన్నారు.
సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో బుధవారం విశాఖలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం
ఎంపి రాయపాటి హెచ్చరిక
english title:
tg
Date:
Thursday, July 4, 2013