డెహ్రాడూన్, జూలై 3: ఉత్తరాఖండ్‌లో సహాయ సామగ్రి చేరవేతకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరద ఉద్ధృతికి ధ్వంసమైన రహదారులు ప్రతిబంధకంగా మారాయి. దీంతో సాయం కోసం ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్ధాలు అందితే అందినట్టు లేకపోతే ఖాళీ చేతులతో ఎదురు చూస్తున్నారు. కొన్నిచోట్ల పైనుంచి సాయం జారవిడచినా అందుకోలేని దయనీయమైన స్థితిలో కొందరున్నారు. రోడ్లు కొట్టుకుపోయి వందలాది గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల్లో వందలకొద్దీ మెట్రిక్ టన్నుల నిత్యావసరాలు అందజేసినట్టు ఒకపక్క ప్రభుత్వం చెబుతోంది. హెలికాప్టర్ల ద్వారా నిత్యావసరాలు జారవిడుస్తునట్టు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని రుద్రప్రయాగ్, చమోలీ, ఉత్తరకాశీ జిల్లాలు వరదలకు అతలాకుతలమయ్యాయి. ఎందరో నిలువనీడ కోల్పోయారు. ఆకలితో అలమటిస్తున్నారు. సర్కారు సాయం కోసం ఆకాశం వైపు కళ్లుకాయలు కాసేలా చూస్తున్నామని ఖీరోన్ గ్రామస్తులు చెప్పారు. హెలికాప్టర్ల నుంచి నిత్యావసరాలు జారవిడుస్తున్నపట్టకీ వాటిని తెచ్చుకునే పరిస్థితులు లేవని పదమ్‌సింగ్ చౌహాన్ అనే వ్యక్తి వాపోయాడు. కిందపడ్డ సరుకులు తెచ్చుకోడానికి దారి దిక్కులు చూడాల్సి వస్తోందన్నాడు. రెండు వారాలుగా తమకు అందుబాటులో ఉన్న బంగాళాదుంపలను తింటూ బతుకుతున్నామని మధోసింగ్ చెప్పాడు.
పూర్తిగా ధ్వంసమైన కేదార్‌నాథ్‌కు వెళ్లే రహదారి
చిన్నాభిన్నమైన రోడ్లు.. చేరువకాని నిత్యావసరాలు
english title:
s
Date:
Thursday, July 4, 2013