ఒంగోలు, జూలై 5: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. జిల్లాలో ఎన్నికలప్రవర్తన నియమావళి అమలులో ఉందన్నారు. జిల్లాలో ఈనెల 9న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. 9నుంచి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నామినేషన్ ప్రక్రియప్రారంభవౌతుందన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పకడ్బంధీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అర్హత కలిగిన వారి నామినేషన్లు తిరస్కరణకు గురికాకుండా అభ్యర్థులకు అవగాహన కల్పించాలని రాజకీయపార్టీల ప్రతినిధులను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో 21గుర్తింపుకార్డుల్లో ఏదోఒకదానితో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చునని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు 10వేలకు పైబడి జనాభాకు 80వేలు, పదివేలకంటే తక్కువజనాభా ఉంటే 40వేలు, అదేవార్డు మెంబర్లకు పదివేలకు పైబడిన జనాభా ఉంటే పదివేల రూపాయలు, పదివేలు జనాభా తక్కువుగాఉంటే ఆరువేల రూపాయలు ఎన్నికల వ్యయం చేయాలన్నారు. నామినేషన్‌ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండి అభ్యర్థుల ఎన్నికల వ్యయం లెక్కించటం జరుగుతుందన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం సంబంధిత సబ్‌డివిజన్ పోలీసు అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో వాహనాలు వినియోగించేందుకు కూడా పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
ఈసమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి, జిల్లా పరిషత్ సిఇఒ ఎం గంగాధర్‌గౌడ్, డిఆర్‌డిఎ పిడి ఎ పద్మజ, రాజకీయపార్టీలప్రతినిధులు సిరిగిరి రంగారావు, యర్రాకుల శ్రీనివాసరావు, జివి కొండారెడ్డి, ఒంగోలు చిట్టిబాబు, వి ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా
english title:
free and fair elections
Date:
Saturday, July 6, 2013