Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నల్లమల పులులకు వైరస్ భయం

$
0
0

కర్నూలు, జూలై 7: నల్లమల అడవుల్లోని పులులకు కొత్త వైరస్ భయం పట్టుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇండోనేషియాలోని రాయల్ బెంగాల్ టైగర్లను పట్టి పీడిస్తున్న ఈ వైరస్ నల్లమల పులులకు సోకకుండా తక్షణం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ) నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం అధికారులను ఆదేశించింది. దీనితో ప్రస్తుతం నల్లమల అరణ్యం, సమీప ప్రాంతాల్లోని నీటి నమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పులుల అభయారణ్యం అధికారులు చెబుతున్నారు. ‘కెనైన్ డిస్టెంపర్ వైరస్’ (సిడిఎ) అనే వ్యాధి సోకి బంగ్లాదేశ్, ఇండోనేషియాలోని పులులు తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అటవీ అధికారులకు సమాచారం అందింది. నల్లమల అరణ్యంలోనే కాకుండా ఆదిలాబాద్ జిల్లా కవ్వల్ పులుల అభయారణ్యంలో ఉన్న పులులు కూడా రాయల్ బెంగాల్ జాతికి చెందినవే కావడంతో వీటికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమయింది. వ్యాధి సోకిన పులులు పిచ్చి పట్టినట్లుగా వ్యవహరించి మనషులను సైతం చంపేస్తాయని, వ్యాధి ముదిరి మరణిస్తాయి. వ్యాధి సోకిన తరువాత నివారించడం సాధ్యం కాదని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వైరస్ ప్రధానంగా కుక్కలు, ఆవులు, గేదెలకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిని వేటాడి మాంసాన్ని తినడం ద్వారా పులులకు వైరస్ వ్యాపిస్తుందని ఆ ఆదేశాలు గుర్తించాయి. నీటి ద్వారా కూడా పులులకు వైరస్ సోకుతుందని వర్షాకాలంలో శరవేగంగా విస్తరిస్తుందని పరీక్షల్లో వెల్లడయింది. దాంతో నల్లమల, కవ్వల్ పులుల అభయారణ్యం చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని కుక్కలు, ఆవులు, గేదెలకు తక్షణం వైరస్ నివారణ కోసం టీకాలు వేయాలని ఆదేశించారు. అడవుల్లోనే కాకుండా అడవి చుట్టు పక్కల ఉండే చెరువులు, నీటి గుంటల్లో నీటిని సేకరించి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని జాతీయ స్థాయి అధికారులు రాష్ట్ర అటవీ అధికారులకు సూచించారు. అయితే నీటి పరీక్షల్లో వైరస్ లేదని పరీక్షల్లో నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా అడవి చుట్టుపక్కల ఉండే గ్రామాల్లోని కుక్కలు, గేదెలు, ఆవులకు పశు సంవర్ధక శాఖ సహకారంతో టీకాలు వేయిస్తున్నారు. అడవుల్లో సాధారణంగా చదరపు కిలోమీటరుకు ఎనిమిది అంతకు మించి జంతు సాంద్రత ఉంటే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. నల్లమల అరణ్యంలో జంతు సాంద్రత 2.50 మాత్రమే ఉన్నందు వైరస్ వేగం తగ్గుతుందని జాతీయ అధికారులు అభిప్రాయపడినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించడంతో అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

వైకాపా ఎమ్మెల్యేల రాజీనామాలు కుట్రే
కెటిఆర్, స్వామిగౌడ్ ఆరోపణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 7: తెలంగాణ అంశంపై నిర్ణయం వెల్లడయ్యే తరుణంలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. అన్నదమ్ములు, భార్యభర్తలు కలిసి ఉండలేని ఈ రోజుల్లో కలిసి ఉందామని సీమాంధ్ర నేతలు చెప్పడం హాస్యాస్పదమని టిఆర్‌ఎస్ విమర్శించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఖాజాగూడలో ఆదివారం సాయంత్రం జరిగిన ధూంధాం కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె తారక రామారావు, ఆ పార్టీ ఎమ్మెల్సీ కె స్వామిగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, ప్రజా ఉద్యమానికి ఎంతటి వారైనా లొంగక తప్పదనీ, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏర్పాటు కాకపోతే, వచ్చే సాధారణ ఎన్నికల తర్వాతైనా ఏర్పడక తప్పదన్నారు. తెలంగాణవాదం జంట నగరాలలో కూడా ఎంత బలంగా ఉందో వచ్చే ఎన్నికల్లో నిరూపించి తెలంగాణ వ్యతిరేకుల, సీమాంధ్ర నేతల కళ్లు తెరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో సభ పెట్టించిందీ, సీమాంధ్రలో సభ పెట్టుకోమని కాంగ్రెసు అధిష్ఠానమే చెప్పడంతోనే, ఆ పార్టీకి తెలంగాణపై ఎంత చిత్తశుద్ధి ఉందో బహిర్గతం అయిందని విమర్శించారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ తీసుకురావాలని దిగ్విజయ్ సింగ్ చెప్పడం పట్ల స్వామిగౌడ్ మండిపడ్డారు. రోడ్ మ్యాప్ గురించి ఇంతకాలంగా కాంగ్రెసు నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏదో ఒక సాకుతో తెలంగాణ అంశాన్ని సాగదీసేందుకే రోడ్ మ్యాప్‌ను తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
డోన్, జూలై 7: కర్నూలు జిల్లా డోన్ మండల పరిధిలోని ఓబుళాపురం మిట్ట సమీపంలోని రిలయన్స్ దాబా వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఇనుపగుళ్ల లోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ రిలయన్స్ దాబా వద్ద టైర్ పంక్చరై నిలిచిపోయింది. అదే సమయంలోనే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుండి శ్రీశైలం వెళ్తున్న కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపులేని వేగంతో ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీనితో బస్సు ఎడమ భాగమంతా నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురానికి చెందిన వ్యవసాయాధికారి బాల అశోక్‌కుమార్ (33) తపాలశాఖ ఉద్యోగి శివ శంకర్ (28), కర్నూలు శ్రీనివాసనగర్‌కు చెందిన బాలకృష్ణ (30) అనంతపురం జిల్లా నార్పలకు చెందిన దేవి బాయి (33) అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలు బస్సు సీట్ల మధ్య ఇరుక్కుపోయాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులందరినీ మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

అప్రమత్తం చేసిన జాతీయ అధికారులు
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>