రే కర్జ్ వైల్
1948లో జన్మించిన రే కర్జ్‌వైల్ ((Ray Kurzweil)) కంప్యూటర్ రంగంలో కేవలం పరిశోధకుడే కాదు శాస్తవ్రేత్త, వ్యాపారవేత్త కూడా. ఇతడు కంప్యూటర్ల సాయంతో సంగీతాన్ని కంపోజ్ చేయవచ్చని తొలిసారి నిరూపించాడు. అలాగే వివిధ ఆకృతులను గుర్తించడానికి కంప్యూటర్‌ని వాడవచ్చని చూపించాడు. అదే ఆ తర్వాతి కాలంలో ‘ఆప్టికల్ కారెక్టర్ రికగ్నిషన్’ ఆవిర్భావానికి కారణం అయ్యింది. అంధుల కోసం కంప్యూటర్‌పై కారెక్టర్ రికగ్నిషన్ ద్వారా స్వీచ్ సింథసైజర్‌ను రూపొందించాడు. దానికే కర్జ్‌వైల్ రీడింగ్ మిషన్ (KRM) అని పేరు పెట్టాడు. 1976 జనవరిలో తాము టెక్ట్స్ టు స్పీచ్ కంప్యూటర్‌ని రూపొందించినట్లు అధికారికంగా ప్రకటించాడు.
పనికిరాని పరిజ్ఞానం
విండోస్ కాదు లిన్‌స్పైర్
2001 ప్రాంతంలో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం కోర్‌నీ, విండోస్ స్వరూపాన్నీ కల్గి హైబ్రిడ్ ఓఎస్‌గా ‘విండోస్’ అనే ఆపరేటింగ్ సిస్టం వచ్చింది. ఐతే మైక్రోసాఫ్ట్ కోర్టును ఆశ్రయించడంతో ‘విండోస్’ పేరు కాస్త ‘లిన్‌స్టైర్’గా మార్చారు.
సామెత
డిస్కు కంటే పేపరే పదిలం!
ప్రశ్న - జవాబు
Q. మొబైల్ బ్రౌజర్లలో బోల్డ్‌లాటి ఫుల్ సైజు బ్రౌజర్ ఉందా? దయచేసి తెలపండి.
-ఎలిజనాయన్ (ఇమెయిల్‌ద్వారా)
A. మొబైల్ బ్రౌజర్లలో ‘బోల్డ్’ బ్రౌజర్ ఉంది. అది మీ మొబైల్‌లో పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి. బ్రౌజర్‌ను వాడేపుడు మీ బ్రౌజర్‌తోబాటు మీ మొబైల్‌లో ఇంటర్నెట్ యాక్టివ్‌గా ఉండాలి.
పద పారిజాతం
LLL -లో లెవల్ లాంగ్వేజి. అంటే బైనరీ (0, 1) ప్రోగ్రాములను రాసేందుకు వాడే భాష.
Mac -మాక్ లేదా మాకింతోష్ కంప్యూటర్. ఆపిల్ సంస్థ రూపకల్పన
Macro -మాక్రో అంటే కొన్ని సూచనల సముదాయం. వీటిని పదే పదే వాడాల్సి వస్తే కేవలం ఒక కీని నొక్కి పనులు కానివ్వచ్చు.
Mainframe -కంప్యూటర్లు ఆవిర్భవించిన తొలి రోజుల్లో (1950-70) వాడుకలో ఉంచిన కంప్యూటర్లు. ఇవి ఆకారంలో పెద్దవిగా ఉండేవి.
షార్ట్ కట్స్ (వర్డ్ -్ఫర్మాటింగ్)
CRTL + Shift + c
ఫార్మాట్ పెయింటర్ కోసం
CTRL + L లెఫ్ట్ ఎలైనె్మంట్
CTRL + E సెంటర్ ఎలైనె్మంట్
CTRL + R రైట్ ఎలైనె్మంట్
CTRL + J జస్టిఫైడ్