విజయవాడ, , జూలై 9: రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని నిబంధనలతో సాగితేనే వ్యాపారాభివృద్ధి జరుగుతుందని అప్పుడే మన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడగలమని జయభేరిగ్రూప్ అధినేత, సినీనటుడు మురళీమోహన్ అన్నారు. ఎపి ఛాంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధమ వార్షికోత్సవం మంగళవారం సాయంత్రం తుమ్మలపల్లి వారిక్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు అనధికారిక లేఅవుట్లతో ఇబ్బందులు ఎదురవుతాయని, లేఅవుట్ చేస్తేనే వ్యాపారానికి, వినియోగదారునికీ కూడా శ్రేయస్సు అని అన్నారు. సంబంధిత అన్ని కాగితాలు సమర్పించగలిగితే 15 రోజుల్లో లేఅవుట్ చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్తశుద్ధితో వ్యాపారం చేసేవారికి ప్రనుత్వం ఎప్పుడూ అండగా వుంటుందని అన్నారు. వేదికపై అతిథులుగా మాజీ ఎమ్మెల్యే నాసర్‌వలి, కోగంటి సత్యనారాయణ, బొండా ఉమామహేశ్వరరావు, కేశినేని నాని, గౌతంరెడ్డి, సిహెచ్ బాబూరావు తదితరులు మాట్లాడుతూ కలసికట్టుగా కృషి చేస్తే ఈ రంగానికి మహర్దశ కలుగుతుందని అన్నారు. సభాధ్యక్షులుగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సారేపల్లి శ్రీనివాసరావు వ్యవహరించగా వేదికపై నిర్వహణ ఇఎస్‌ఎస్‌వి ప్రసాదరావు, కార్యదర్శి వజ్జే మహేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్రా నారాయణరావు, కైలాసపతి, సంయుక్త కార్యదర్శి కాజ మురళీమోహన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి అసోసియేషన్ల సభ్యులు హాజరయ్యారు. ప్రారంభంలో సినీసంగీత విభావరి, సిల్వస్టర్ మిమిక్రి అందరినీ అలరించింది.
రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్థులు ఎన్నో సమస్యలను
english title:
business development
Date:
Wednesday, July 10, 2013