నెల్లూరుసిటీ, జూలై 13: జిల్లా వ్యాప్తంగా శనివారం సర్పంచ్, వార్డు మెంబర్లుకు భారీగా నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ప్రధానంగా పంచాయితీల ఏకగ్రీవాలపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి.జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 9వ తేదీ నుండి జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జిల్లాలోని 46 మండలాలలోని 931 పంచాయతీల సర్పంచ్ పదవులకు 4670 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు సభ్యులకు 22776 నామినేషన్లు దాఖలైనట్టు అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి తెలిపారు. ఆయన తన చాంబర్‌లో శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ ఆదివారం స్క్రూట్నీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పొత్తుతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇదిలావుండగా కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్, తెలుగుదేశ పార్టీలు వార్డు మెంబర్లను సమానంగా పంచుకునేందుకు దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటూ ఒక్కరు కూడా వార్డు మెంబర్లు గెలవకుండా ఈ రెండు పార్టీలు సకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మండలాలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. అధికార పార్టీ కావడంతో మండల నాయకులు అంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే ప్రభావం కన్పిస్తుందన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ పాలన వలన పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, నిత్యావస వస్తువుల ధరలను ప్రజల్లోకి తీసుకుని పోయి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నాని చూస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి ఈ ఎన్నికలు అవసరమని గుర్తించిన అన్ని పార్టీలు గెలుపు గుర్రాలను పంచాయతీ ప్రెసిడెంట్‌లుగా ఎన్నికల బరిలో నిలబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు మెంబగా ---మంది అభ్యర్థులు తమ నామిషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా జిల్లాలోని ఆయా పంచాయతీల్లో నామినేషన్ల పర్వం కోలాహలంగా జరిగింది. ఇదిలావుండగా జిల్లాలోని మండలాల వారిగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల నామినేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 931 పంచాతీయలకు అభ్యర్థులు భారీగానే నామిషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని సైదాపురం, చిల్లకూరు మండలాల్లో మాత్రమే అధికంగా 31 పంచాయతీల్లో, ఆ తరువాత స్థానంలో ఉన్న పొదలకూరు మండలంలో 30 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగిలిన అన్ని మండలాల్లోను ఆ తరువాత సంఖ్య బహుళ్యంలో ఉన్న పంచాయతీలే. గతంలో జిల్లాలోనే అత్యధికంగా 32 పంచాయతీలతో ఉన్న నెల్లూరు రూరల్ మండలం ఆ స్థానం నుండి వెనుకబడింది. రూరల్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం కావడంతో దీంతో కేవలం 17 పంచాయతీలతో మాత్రమే నెల్లూరు రూరల్ మండలం పరిమితమైంది. ఇదిలావుంటే మరో ఆరేడు నెలల్లో రానున్న సాధారణ ఎన్నికల్ని పురస్కరించుకుని బరిలో నిలిచే ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇప్పటి స్థానిక పోరులో కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని గ్రామాలలో ఒకే పార్టీ నుండి ఇద్దరేసి, ముగ్గురేసి అభ్యర్థులు కూడా ఆయా రాజకీయ పక్షాల నుంచి మద్దతుదారులుగా పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా శనివారం సర్పంచ్,
english title:
n
Date:
Sunday, July 14, 2013