Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నామినేషన్ దాఖలు గడువు పూర్తి

$
0
0

మర్రిపూడి, జూలై 13: మర్రిపూడి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు 92 మంది సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లకు 377 మంది అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, ఎంపిడివో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం దాఖలైన నామినేషన్ల వివరాలు గుండ్లసముద్రం సర్పంచ్ అభ్యర్థికి 3, వార్డు మెంబర్లు 8, కెల్లంపల్లి సర్పంచ్‌కు 1, వార్డుకు 9, పొన్నూరు సర్పంచ్‌కు 2, కాకర్ల వార్డులకు 8, చిలంకూరు సర్పంచ్ 2, వార్డులకు 24, చీమట వార్డులకు 1, రేగలగడ్డ సర్పంచ్ 2, వార్డులకు 8, మర్రిపూడి సర్పంచ్ 6, వార్డులకు 28, అంకేపల్లి సర్పంచ్ 4, వార్డుకు 15, వల్లాయిపాలెం సర్పంచ్‌కు 3, వార్డుకు 9, గార్లపేట సర్పంచ్‌కు 3, వార్డులకు 29, కూచిపూడి సర్పంచ్ 1, వార్డులకు 4, వేమవరం సర్పంచ్ 4, వార్డులకు 28, జువ్విగుంట సర్పంచ్ 3, వార్డులకు 5, రావెళ్ళ వారిపాలెం సర్పంచ్ 1, వార్డు 10, తంగెళ్ళ సర్పంచ్ 6, వార్డులకు 18, నర్సరాజుపాలెం సర్పంచ్ 3, వార్డు 16, అయ్యపరాజుపాలెం సర్పంచ్ 6, వార్డులకు 14 మొత్తం మండలంలో చివరి రోజు శనివారం నాటికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా 92 మంది, వార్డు మెంబర్ల అభ్యర్థులుగా 377 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎంపిడివో శ్రీనివాసరావు తెలిపారు.
దర్శిలో..
దర్శి: పంచాయతీ నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. మండలంలోని మొత్తం సర్పంచ్ పదవికి 125 మంది, వార్డు మెంబర్ పదవులకు 527 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దర్శి పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థికి 10 మంది, 20 వార్డులకు 111 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలో త్రిపుర సుందరీపురం పంచాయతీకి కావూరి లక్ష్మమ్మ ఒక్కతే పంచాయతీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలో మరో వ్యక్తి లేకపోవడంతో ఈమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బొట్లపాలెం సర్పంచ్‌కు 4, వార్డులకు 45 మంది, పొతకమూరు సర్పంచ్ 7, వార్డులకు 16 మంది, పాపిరెడ్డిపాలెం సర్పంచ్‌కు 5, వార్డులకు 16 మంది, తూర్పు వీరాయిపాలెం సర్పంచ్‌కు 5, వార్డులకు 18, పోతవరం సర్పంచ్‌కు 9, వార్డులకు 11, దేవవరం సర్పంచ్‌కు 5, వార్డులకు 11, తానం చింతల సర్పంచ్‌కు 5, వార్డులకు 12, వెంకటాచలంపల్లి సర్పంచ్‌కు 5, వార్డులకు 12 , మారెడ్డిపల్లి సర్పంచ్‌కు 2, వార్డులకు 8, చందలూరు సర్పంచ్‌కు 3, వార్డులకు 10, తుమ్మెదలపాడు సర్పంచ్‌కు 5, వార్డులకు 9, బసిరెడ్డిపాలెం సర్పంచులకు 2, వార్డులకు 8, బండి వెలిగండ్ల సర్పంచ్‌కు 7, వార్డుకు 16, ఎర్ర ఓబన పల్లి సర్పంచ్‌కు 2, వార్డులకు 10, రామచంద్రాపురం సర్పంచులకు 4, వార్డులకు 11, రాజంపల్లి సర్పంచులకు 8, వార్డులకు 48, జముకుల దినె్న సర్పంచులకు 6, వార్డులకు 13, కొత్తపల్లిసర్పంచులకు 5, వార్డులకు 11, కొర్లమడుగు సర్పంచులకు 5, వార్డులకు 10, పెద ఉయ్యాలవాడ సర్పంచులు 3, వార్డులకు 10, లంకోజనపల్లి సర్పంచులకు 6, వార్డులకు 29, తూర్పు వెంకటాపురం సర్పంచులకు 4, వార్డులకు 16, తూర్పు చవటపాలెం సర్పంచులకు 2, వార్డులకు 30, శామంతపూడి సర్పంచులకు 5, వార్డులకు 25 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్లు ఉప సంహరణ తరువాత ఎంత మంది బరిలో నిలుస్తారో తేలనుంది.
సంతనూతలపాడులో..
సంతనూతలపాడు : మండలంలో ఈ నెల 23న జరుగనున్న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నామినేషన్లు చివరి రోజు కావడంతోప్రధాన రాజకీయ పార్టీలు సర్పంచ్ అభ్యర్థులను వేయించారు. మండలంలో 17 పంచాయతీ సర్పంచ్ పదవులకు గానూ 95 నామినేషన్లు దాఖలు అయ్యాయి. పి గుడిపాడు 4, కొనగానివారిపాలెం 4, చిలకపాడు 4, పి తక్కెళ్ళపాడు 4, ఎం వేములపాడు 4, మద్దులూరు 5, కామేపల్లి వారిపాలెం 3, సంతనూతలపాడు 5, గురువారెడ్డిపాలెం 9, లక్ష్మీ పురం 6, రుద్రవరం 5,మైనంపాడు 6, ఎండ్లూరు 5, గుమ్మనంపాడు 5, ఎనికపాడు 5, చండ్రపాలెం 4, బొడ్డువానిపాలెం 8 చొప్పున పంచాయతీ సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.
యర్రగొండపాలెంరూరల్‌లో..
యర్రగొండపాలెంరూరల్: చివరి రోజైన శనివారం పలుపార్టీల అభ్యర్థులు భారీఎత్తున జనసమీకరణతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైపాలెంలో మురారిపల్లి, గోళ్ళవిడిపి, యర్రగొండపాలెం గ్రామపంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, వార్డులకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున వైపాలెం మాజీఎంపిపి ఎంసిహెచ్ మంత్రునాయక్ సతీమణి శాంతాభాయి తన నామినేషన్‌ను వివిధ నాయకుల ఆధ్వర్యంలో దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, మాజీఎంపిపి ఎంసిహెచ్ మంత్రునాయక్, మాజీసర్పంచ్‌లు ఒంగోలు మూర్తిరెడ్డి, షేక్ సయ్యద్‌కాశీం, సీనియర్ నాయకులు ఇమ్మడిశెట్టి సుబ్బారావు, సూరె రమేష్, వివిధ సామాజకవర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా టిడిపి తరుపున సొరకాయల మంగమ్మ తన నామినేషన్‌ను మండలంలోని టిడిపికి చెందిన వివిధ నాయకుల ఆధ్వర్యంలో దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి త్రిసభ్య కమిటీ సభ్యులు చేకూరి ఆంజనేయులు, జిల్లా టిడిపి మైనార్టీసెల్ నాయకులు షేక్ జిలానీ, గోళ్ళ సుబ్బారావు, సూరె శ్రీనివాస్, తోట మహేష్, అడుసుమల్లి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. గోళ్ళవిడికి చెందిన పాశం ఆవులయ్య సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మిల్లంపల్లి పంచాయతీకి సర్పంచ్ పదవికి మురారిపల్లి గ్రామానికి చెందిన గురవయ్య నామినేషన్ దాఖలు చేశారు. వైపాలెం సెంటర్‌లో మురారిపల్లి, గోళ్ళవిడిపి, వైపాలెం పంచాయతీలకు చెందిన వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
జోరుగా చేరికలు
జరుగుమల్లి, జూలై 13: మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలో పీరాపురం గ్రామంలోని 100కుటుంబాలు కాంగ్రెస్‌పార్టీ నుంచి వైఎస్‌ఆర్ సిపిలో మండల కన్వీనర్ గాలి శ్రీను ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు సమక్షంలో చేరారు. ఈసందర్భంగా జూపూడి ప్రభాకరరావు పార్టీలో చేరిన వారికి కుండువాతో ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో స్వర్ణ రవీంద్రబాబు, కొండపి మండల వైఎస్‌ఆర్ సిపి కన్వీనర్ ఉపేంద్ర, ఎ పోలయ్య, మాల్యాద్రి, గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉలవపాడులో...
ఉలవపాడు : శనివారం ఉలవపాడులో పలువురు టిడిపి నుండి వైఎస్‌ఆర్ సిపి తీర్థం పుచ్చుకున్నారు. 6వ వార్డు మాజీ సభ్యుడితోపాటు జాలరి సంఘం నాయకులు పసుపులేటి వేణు, యాదవ సంఘం నాయకుడు బుర్రా శ్రీనివాస్‌యాదవ్ తదితరుల ఆధ్వర్యంలో 50మంది వైఎస్‌ఆర్ సిపి తీర్థం పుచ్చుకున్నారు. మండల వైఎస్‌ఆర్ సిపి నాయకుడు రామల సింగారెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్‌ఆర్ సిపిలో చేరినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ దార్ల కోటేశ్వరరావు, నాయకులు జిలానీబాషా, ఎస్‌కె ముజీబ్ తదితరులు పాల్గొన్నారు
34మందిపై బైండోవర్ కేసులు నమోదు
సిఎస్‌పురం, జూలై 13: మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 34మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌కె లాల్‌అహ్మద్ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపిలకు చెందిన ఎ కొత్తపల్లిలో 11మంది, ఆనికాళ్లపల్లిలో 11మంది, నల్లమడుగులలో 12మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు.

కె ఉప్పలపాడులో చెక్‌పోస్టు ఏర్పాటు
కొండపి, జూలై 13: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అనథరైజ్డ్‌గా మండలంలోకి మద్యం, ధనం ట్రాన్స్‌ఫోర్టు కాకుండా నిరోధించేందుకు కె ఉప్పలపాడు గ్రామంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు శింగరాయకొండ సిఐ అశోకవర్ధన్ తెలిపారు. శనివారం ఆయన కొండపి మండలంలోని సమస్యాత్మక గ్రామాలను సందర్శించారు. ఈసందర్భంగా గ్రామాలలో మద్యం, ధనం పంపిణీ చేయడం జరుగుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈసందర్భంగా కె ఉప్పలపాడు, పెట్లూరు తదితర గ్రామాలను సందర్శించారు. సిఐతోపాటు కొండపి ఎస్సై జి సోమశేఖర్ తదితరులు ఉన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
కనిగిరి రూరల్, జూలై 13: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నగర పంచాయతీ కనిషనర్ లక్ష్మిరాజ్యం అన్నారు. శనివారం స్థానిక ఎంఆర్‌సి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా కాలుష్యాన్ని నివారించుకోవచ్చునని ఆమె అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కాలుష్య నివారణకు సహకరించాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో ఎంఇఓ జి సుబ్బత్తమ్మ, నగర పంచాయతీ సిబ్బంది ఖాజామొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

హైడ్రామా ఉద్రిక్తల నడుమ వైఎస్‌ఆర్‌సిపి నామినేషన్
కందుకూరు: మండల పరిధిలోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి స్వగ్రామమైన మాచవరంలో ఉద్రిక్తల నడుమ వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి తరపున వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నం వీరాస్వామి, తుమాటి మాధవరావు, మండల కన్వీనర్ పువ్వాడి రమణయ్య, నాయకులు గంగిరెడ్డి, చిరంజీవిరెడ్డి ఆధ్వర్యంలో దాసరి పోతులూరయ్య నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి శనివారం అందజేశారు. ఈసందర్భంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత పదిరోజులుగా గ్రామంలో పోటీ లేకుండా ఏకగ్రీవం చేసేందుకు మంత్రి మహీధర్‌రెడ్డి గ్రామంలోని అన్ని సమాజిక వర్గాల పెద్దలతో చర్చించి ఏకగ్రీవం ఆమోదానికి ఒప్పించినట్లు సమాచారం. గ్రామంలోని ఒప్పందాన్ని తెలుసుకున్న వైఎస్‌ఆర్ సిపి సర్పంచ్ అభ్యర్థి పోతులూరయ్య రెండు రోజులుగా అదృశ్యమయ్యాడు. పోటీ లేదని భావిస్తున్న తరుణంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా నాయకులు కలుగజేసుకుని అభ్యర్థి తరపున ప్రతిపాదించిన వ్యక్తులతో నామినేషన్ దాఖలు చేయించడం నియోజకవర్గంలో ఆసక్తికర అంశంగా మారింది. రిటర్నింగ్ అధికారి ఆదివారం ఉదయం 11గంటలకు తనముందు హాజరు పరచాలని నాయకులకు సూచించారు. ఏది ఏమైనా నామినేషన్ల ఉపసంహరణకు గడువు మరో నాలుగు రోజులు ఉండడంతో గ్రామస్థులను కాదని అభ్యర్థి నిలబడతాడా అనే చర్చలు జరుగుతున్నాయి. వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా మంత్రి సూచన మేరకు పాలేటి బాలయ్య నామినేషన్ దాఖలు చేయడంతో నాలుగు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న సర్పంచ్ పదవికి ఈసారి రసవత్తర పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినీహీరో కమలాకర్ మృతికి పలువురు సంతాపం

చీమకుర్తి, జూలై 13: చీమకుర్తికి చెందిన వర్తమాన సినీనటుడు బూచేపల్లి కమలాకర్‌రెడ్డి అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. కమలాకర్ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పెద్ద కుమారుడు. ఈ వార్త తెలియగానే ప్రకాశం జిల్లా అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలివచ్చారు. వైఎస్ ఆర్ సిపి గౌరవాధ్యక్షులు విజయమ్మ, వైవి సుబ్బారెడ్డి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. మృత దేహాన్ని చైనె్న నుండి శనివారం ఉదయం 11 గంటలకుచీమకుర్తి స్వగృహానికి తీసుకొని వచ్చారు. చీమకుర్తి మండల ప్రజలు, దర్శి నియోజక వర్గ ప్రజలు వేలాదిగా తరలి వచ్చి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కమలాకర్‌రెడ్డి అభి, హాసిని, సంచలనం, బ్యాండ్‌బాలు చిత్రాల్లో హీరోగా నటించారు. కమలాకర్‌రెడ్డి మృతి చెందడంతో యూనిట్ సభ్యులందరూ చీమకుర్తికి వచ్చి బోరున విలపించారు. కమలాకర్‌రెడ్డి చిన్న వయస్సులోనే మృతి చెందడాన్ని తల్లిదండ్రులు బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే , కమలాకర్‌రెడ్డి సోదరుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి దంపతులు ఆవేదన వర్ణనాతీతం. సోదరి ధనలక్ష్మి, బావ రూపేష్‌లు అన్నయ్య ఇక లేడంటూ బోరున విలపించడంతో చూపరులను కలిచి వేసింది. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి , తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్, పలు గ్రానైట్ గెలాక్సీ క్వారీల యజమానులు, మేనేజర్లు , సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్‌కుమార్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా డైయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, మాజీ జడ్పి చైర్మన్ కాటం అరుణమ్మ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, వ్యాపార వేత్తలు శిద్దా హనుమంతరావు, శిద్దా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి, స్థానిక తహసీల్ధార్ పేరయ్య, డాక్టర్ అమృతపాణి, ఎ ఎంసి చైర్మన్ మారం వెంకారెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తదుపరి కమలాకర్‌రెడ్డి మృత దేహాన్ని ఊరేగింపుగా స్మశానికి తీసుకొని వెళ్లి భారీ ఎత్తున అంత్యక్రియలు నిర్వహించారు.
దర్శిలో..
దర్శి: సినీహీరో, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి సోదరుడు కమలాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త మునగా నరసింహారావు, బిజెపి మండల నాయకులు పిల్లి నారాయణరెడ్డి, మాజీ ఎంపిపి ఇత్తడి దేవదానం, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురువారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి మండల కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి, ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ సోము దుర్గారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె అంజిరెడ్డి, ఆ పార్టీ నాయకులు వెన్నపూస బాపిరెడ్డి, కొడవటి జాన్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయి :అన్నా
కొమరోలు, జూలై 13: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ బలపరచిన అభ్యర్థుల విజయానికి దోహదపడుతాయని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. శనివారం కొమరోలు గ్రామపంచాయతీ పదవికి కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి గుర్రం అల్లూరయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ, నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు అన్నా రాంబాబు హాజరయ్యారు. గజ్జలకొండ సుబ్బయ్య రైస్‌మిల్లు నుంచి బయలుదేరిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సర్పంచ్, వార్డుపదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో స్టేజీ-1 ఎన్నికల అధికారి ఎం లక్ష్మీనాయక్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అల్లూయ్య నామినేషన్ దాఖలు చేయగా కొమరోలు పంచాయతీలోని 16వార్డులకు కాంగ్రెస్‌పార్టీ బలపరచిన అభ్యర్థులు నామినేషన్లు అందచేశారు. ఎమ్మెల్యే రాంబాబు విలేఖరులతో మాట్లాడుతూ 2009కి ముందు జరిగిన అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కొమరోలు మండలంలో జరిగిన అభివృద్ధిని ఓటర్లు గుర్తుచేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు ఎన్ సుబ్బరాయుడు, మాజీజడ్పిటిసి సభ్యులు ఎస్ వెంకటనాయుడు, నేతలు ఎన్ వెంగయ్యచౌదరి, ఎ సుబ్రహ్మణ్యం, ఎస్ జనార్ధన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు

చీకటి రాజకీయాలు చేసేవారికి
ఓటు అడిగే హక్కులేదు
మార్కాపురం, జూలై 13: చీకటి ఒప్పందాలతో రాజకీయాలు చేసేవారికి ప్రజలను ఓటుఅడిగే హక్కులేదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయనను కలిసిన భూమితో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌కు ఓటు వేయాలని అనుకునే కాంగ్రెస్ నాయకులు అధికార కాంగ్రెస్‌పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదించిన సొమ్మును అనాధశరణాలయానికి అప్పగించి వైఎస్‌ఆర్‌సిపికి ఓటు వేయాలని కందుల హితవు చెప్పారు. నిన్నమొన్నటి వరకు వైఎస్‌ఆర్‌సిపి తమకు బద్దవైరమని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు నేడు పదవుల కోసం ఒకటిగా మారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వీరి కుట్రలను సామాన్యప్రజలు గుర్తించి బుద్ధి చెబుతారని అన్నారు. రెండు పార్టీలు వేరువేరుగా పోటీచేస్తే టిడిపిని ఎదుర్కోలేమనే భయంతో కలిసి పోటీచేసి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని కందుల ఆరోపించారు. మార్కాపురం నియోజకవర్గంలో అధికశాతం కాంగ్రెస్‌పొత్తుతో వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ రెండుపార్టీల రాజకీయకుట్రను ప్రజలు గ్రహించారని, అసహించుకునే సమయం ఆసన్నమైందని కందుల అన్నారు. కాలంగడుపుకునే రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే రాజకీయాలు ఉండాలని హితవు పలికారు. ఎవరెన్ని కుటిల రాజకీయాలు చేసినా విజయం టిడిపిదేనని కందుల ధీమా వ్యక్తం చేశారు.

అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్య ఎస్‌ఎస్‌ఎన్‌కే సాధ్యం

సంతనూతలపాడు, జూలై 13: విలువైన విద్యకు, నాణ్యమైన బోధనకు విద్యార్థుల నమ్మకమే ఎస్‌ఎస్‌ఎన్ విద్యా సంస్థలు అని, ఆ విద్యా సంస్థల చైర్మన్ యల్లటూరి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ విద్యార్థులు లెటరన్ ఎంట్రీ ద్వారా ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కాలేజీని ఆప్షన్స్ ద్వారా ఎంచుకున్నారని ఆయన తెలిపారు. ఈ విద్యా సంస్థను పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యధికంగా 96మంది ఇంజనీరింగ్ ఆయా బ్రాంచ్‌లకు చెందిన ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు మక్కువ చూపడంతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఎస్‌ఎస్‌ఎన్ ను నిలబెట్టారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎస్‌ఎస్‌ఎన్ విద్యా సంస్థల పట్ల ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత చూరగొనే విధంగా వారికి విలువైన, నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు ఎస్‌ఎస్‌ఎన్ విద్యా సంస్థలు కృతనిశ్చయంతో ముందుకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విద్యా సంస్థల అభివృద్దికి సహకరిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఎస్‌ఎస్‌ఎన్ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య కోసం మైక్రోసాఫ్ట్‌తో ఈ సంవత్సరం నుండి ఒప్పందం చేసుకున్నామని, గతంలో కూడా హెచ్‌జి, ఐబియం, జోకాంపస్‌తో కూడా ఒప్పందం చేసుకొని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించేందుకు ఎస్‌ఎస్‌ఎన్ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మర్రిపూడి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>