Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పంచాయతీ ఎన్నికల్లో స్థానిక వ్యూహాలు

$
0
0

కడప, జూలై 14 : సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జరుగుతున్న పంచాయతీ పోరుకు సంబంధించి ప్రధాన పార్టీల అగ్రనేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో తలదూర్చి స్థానిక నేతల మనోభావాలను దెబ్బతిస్తే సాధారణ ఎన్నికల్లో వారివల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండదని భావిస్తున్న నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల బాధ్యతలను స్థానిక నేతలకే వదిలేస్తున్నారు. అయితే తమ తమ సొంత గ్రామాలను, అధిపత్యంలో ఉన్న గ్రామాలను చేయిదాటిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, మాజీలు దాదాపు అంతా తమ గ్రామాల విషయంలో అనుకున్నది సాధించుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 785 పంచాయతీలు ఉండగా ఇందులో దాదాపు 40 చోట్ల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అగ్రనేతలకు సంబంధించిన పంచాయతీలే ఎక్కువ ఉన్నాయి. దీనికి సహకరించడంలో చోటామోటా నేతల వ్యూహాలు కూడా ఉన్నాయి. అగ్రనేతలకు అనుకూలంగా వ్యవహరించి మెప్పు పొందితే సాధారణ ఎన్నికలు వచ్చే లోగా ప్రభుత్వంలో
తమ పనులన్నీ సునాయాసంగా చేయించుకోవడానికి ఈ మచ్చిక దోహపడుతుందని స్థానిక నేతలు సహకరిస్తున్నారు. తమ గ్రామ పంచాయతీల విషయంలో జాగ్రత్తలు తీసుకున్న అగ్రనేతలు మిగిలిన వాటిని స్థానిక నేతలకు వదిలేశారు. దీనితో స్థానిక రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు వ్యూహాలు రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా అవసరమైన చోట్ల పార్టీలతో సంబంధం లేకుండా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వీలైనంతలో ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీలుకాని పక్షంలో రాజీకి ప్రయత్నిస్తున్నారు. తమకు పట్టున్న గ్రామాలను ఎవరికి వారు దక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కువ చోట్ల టిడిపి, అధికార కాంగ్రెస్ పార్టీల నేతలు కుమ్మక్కయినట్లు తెలుస్తోంది. వైకాపాతో కూడా అక్కడక్కడ కాంగ్రెస్ నేతలు కలిసి పని చేసుకుంటున్నారు. వైకాపా రెబల్స్ కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయిపోయారు. దీనితో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పరస్పర అవగాహనతో పంచాయతీలను పంచుకుంటున్నారు. అయితే పాచికలు పారని పంచాయతీల్లో మాత్రం నేతలు అడ్డదారులు వెతుక్కున్నారు. సాంకేతికపరమైన అంశాల విషయంలో తమకు అనుకూలంగా ఉన్న అధికారులతో ప్రత్యర్థులకు సమస్యలు సృష్టించి ప్రత్యర్థులు, చోటామోటా అభ్యర్థులను బరిలో నుండి తప్పించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా సాగిపోతుండడంతో అధికారులు కూడా జోక్యం చేసుకోవడం లేదు.

వేర్పాటు ఉద్యమాలు కాంగ్రెస్ సృష్టే
* సమైక్యాంధ్ర నినాదం చెప్పిన ఏకైక పార్టీ సిపిఎం
* కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్
కడప (అర్బన్),జూలై 14 : వేర్పాటు వాద ఉద్యమాలతో సమస్యలు సృష్టిస్తోందని కాంగ్రెస్ పార్టీనే అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ విమర్శించారు. ఆదివారం నగరంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వేర్పాటు వాద ఉద్యమాలు సృష్టించింది కాం గ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. రాష్ట్ర ంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి ‘సమైక్యా ంధ్రే మా నినాదం’ అని చెప్పగలిగిన ఏకైక దమ్మున్న పార్టీ సిపియం అని అన్నారు. కేంద్రంలో యూపిఎ ప్రభు త్వం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందవన్నారు. పేదలకు సబ్సిడీలు కుదించి, పారిశ్రామిక వేత్తలను అందలం ఎక్కించే విధంగా పాలకవర్గాలు పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపన్నుల పల్లకీలు మోసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పేదలపై భారాలు వేస్తున్నాయన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకం, ఆహార బదిలీలు కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతిని దేవర దున్నపోతుల్లా కాంగ్రెస్ సర్కార్ పెంచి పోషిస్తోందన్నారు. అసమర్థత ప్రభుత్వం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లక్షా, 50 వేల కోట్ల బడ్జెట్‌లో వెనుకబడిన ప్రాంతా ల్లో 50 వేల కోట్లు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

గెలవలేమనే విమర్శలు
* ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు
రైల్వేకోడూరు, జూలై 14 : త్వరలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై గెలవలేమనే దురుద్ధేశ్యంతోనే కొందరు నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు ఖండించారు. ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో జరిగిన అభివృద్ధి కారణంగా ప్రజల్లో పార్టీపై మంచి విశ్వాసం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మొదలుకుని నేటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ హాయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల మేరకు అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత తమదేనన్నారు. జరుగుతున్న ఈ ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం మీద ఇతర పార్టీల కన్నా అత్యధిక సర్పంచ్ పదవులను తామే గెలుచుకుంటామని ఎమ్మెల్సీ తెలిపారు. ఏయే పార్టీల నేతలు ప్రజలకు ఏమి అభివృద్ధి చేశారో ఓటర్లకు బాగా తెలుసన్నారు. ఇతర పార్టీలను ఇబ్బందులు పెట్టి గెలవాలనే తమ పార్టీకి లేదని, తాము కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు బత్యాల పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హేమరాజ్, నవీన్, సుధాకర్, శివయ్య పాల్గొన్నారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రాజంపేట/ సిద్దవటం, జూలై 14 : సిద్దవటం రేంజ్‌లోని మద్దూరు బీటులో అటవీ అధికారులు అదివారం 50 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగులు గుర్తు తెలియని స్మగ్లర్లు మద్దూరు బీటులోని బాలాయికుంట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు హుటాహుటిన వెళ్లి బాలాయికుంట ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి 50 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దుంగలను సిద్దవటం అటవీ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
రాజంపేటలో...
రాజంపేట మండలం ఆంజనేయపురం ఎస్టీకాలనీ సమీపంలో ఎర్రచందనం దుంగలు లోడు చేస్తున్న లారీపై ఆదివారం తెల్లవారుజామున పోలీస్, అటవీశాఖ అధికారులు దాడి చేశారు. దీంతో 70 మంది తమిళనాడుకు చెందిన కూలీలు లారీని, దుంగలను వదలి పరారయ్యారు. ఈ సందర్భంగా 72 ఎర్రచందనం దుంగలను, కెఎ 02 8822 అనే నెంబర్ లారీని స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ రేంజర్ కె.విజయకుమార్ తెలిపారు. దుంగల విలువ సుమారు లక్ష రూపాయల మేరకు ఉంటుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందడంతో అటవీశాఖ, పోలీస్‌శాఖ అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా ఈ దాడి చేశామన్నారు. నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టామన్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నవారు ఎంతటి వారైనను పట్టుకుంటామన్నారు. ఈ దాడిలో రాజంపేట రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మధుసూదన్‌రెడ్డి, ఎఫ్‌బిఓ ఎస్.నాగేశ్వరరావు, ఎబిఓ కెవి సుబ్బారెడ్డి, పోలీస్ సిబ్బంది, బేస్‌క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాలి
* మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి
నందలూరు, జూలై 14 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను ప్రలోభ పెట్టే ధనంతో పాటు ఇతరత్రా వాటిని ఎన్నికల అధికారులు అరికట్టే దిశగా కఠినచర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నందలూరులో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాళ్లపాక గ్రామంలో టిడిపి ప్రముఖ నాయకులు కృష్ణయ్య మృతి చెందడంతో ఆయనకు ఘన నివాళి అర్పించి, ఆ కుటుంబ సభ్యులకు ఏ అవసరం మెచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు. టంగుటూరు పంచాయతీ పరిధిలోని పాచికాల్వ, చింతకాయలపల్లె, శేషయ్యగారిపల్లె, మదనమోహనపురం గ్రామాల్లో పర్యటించానన్నారు. కుందానెల్లూరులో ఏకగ్రీవంగా ఎన్నికైన తన వర్గంలోని గోపిరెడ్డి సతీమణి కళావతమ్మను అభినందించానన్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా పంచాయతీల్లో పోటీలో ఉన్న తన వర్గం వారి గెలుపుకోసం తాను తన వర్గీయులు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చింతకాయలపల్లెకు చెందిన లేబాక నరసింహులు టంగుటూరు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నేడు ఎన్నికల్లో ధనం, మందు ప్రభావం ఎక్కువగా ఉందని, ఎన్నికల కేంద్ర, రాష్ట్ర అధికారులు సరియైన రీతిలో చర్యలు చేపట్టడం లేదన్నారు. ఎన్నికల్లో ధనప్రభావం ఎక్కువగా ఉందని, ధనం ఉన్నవారే ఎన్నికల్లో అధికంగా పోటీలో ఉన్నారని వారు గెలిస్తే ధనార్జన ధ్యేయంగా ఉంటారన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందన్నారు. అవినీతికి పాల్పడం, రౌడీయిజం, దందాలు చేసే నాయకులు ప్రజలకు చేరువ కాలేరన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజంపేటలో ఎలక్ట్ఫ్రికేషన్ వందశాతం పనులు చేసి రాష్టస్థ్రాయిలో మంచి గుర్తింపు తెచ్చామన్నారు. తాగునీటి కోసం బోర్లు వేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని తన వర్గీయులంతా ఆయా పంచాయితీల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్‌ఖాన్, యెద్దల వెంకటేశ్వర్లు, మట్టిబాబు, తాటి సుబ్బరాయుడు, వౌలా, ఆల్విన్ రాజు, దుర్గయ్య, కృష్ణారెడ్డి, సంటెయ్య, ఓబయ్య, మగ్భుల్, మహబూబ్‌భాషా, మల్లికార్జునశెట్టి, వెంకటమస్తాన్, మల్లికార్జునరాజు, వేణు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

వెంటాడుతున్న వర్షాభావం..!
* ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలి
* రైతుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి
రాజంపేట, జూలై 14 : రాజంపేట డివిజన్‌లో రెండేళ్లూగా వరుస కరవును దృష్టిలో ఉంచుకొని వర్షాభావ పరిస్థితులపై ఇప్పటి నుండే సమీక్షలు జరిపి తగు విధంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఈ ఏడాది ఎంతైనా అవసరమని పలు గ్రామాల రైతాంగం నుండి విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరవుతో బతుకుభయంతో ఉన్న ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునేందుకు వర్షాభావ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుకు, సబ్సిడీతో విత్తనాలను అందించేందుకు వీలుగా ప్రణాళికలు చేపట్టడం వల్ల వలసలను ఆరికట్టేందుకు వీలవుతుందన్న అభిప్రాయం వ్యవసాయ శాఖలో కూడా వినిపిస్తుంది. గతంలో ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేసినా అమలులో సరైన విధానం అవలంభించని కారణంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో సత్ఫలితాలు సాధించలేదన్న విమర్శలు వ్యవసాయశాఖపై ఉన్నాయి. ఈ ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించి చిరుజల్లులు వరకే పరిమితమవ్వడంతో ఖరీఫ్‌లో అనుకున్నంతగా వర్షాలు పడే పరిస్థితులు కానరానందున ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను కార్యోన్ముఖులను ఇప్పటి నుండే చేయడం ఇందుకోసం సబ్సిడీతో అవసరమైన విత్తనాలను సిద్ధం చేయడం ఎంతైనా అవసరమన్న డిమాండ్‌ను కొట్టిపారేసేందుకు వీలులేదు. ఈ విషయంలో జిల్లా వ్యవసాయశాఖనే కాకుండా, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ముందుచూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వరుస కరవుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో కొంతవరకు ఆదుకుంటున్నట్టు కనిపిస్తున్నా అది పూర్తిస్థాయిలో సత్ఫలితాల దిశగా పయనించడం లేదన్నది మాత్రం వాస్తవం. కనుక తిరిగి ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఇక్కడి రైతులను వ్యవసాయ కూలీలను వలసలు వెళ్ళకుండా ఆపడం చాలా కష్టమైన పనని కూడా పలు వర్గాలు భావిస్తున్నాయి. కనుక ఇప్పటినుండే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా వర్షాలు పడినా పడకపోయినా కొంతవరకు రైతులను ఆదుకునేందుకు వీలవుతుందన్నది వాస్తవం. రెండేళ్లుగా వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరవు రావడం జరిగితే పరిస్థితులపై ప్రత్యేక నివేదికలు రూపోందించుకోవడం వల్ల వర్షాలను బట్టి అధికారులు పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించి తగు విధంగా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకునేందుకు సులభంగా ఉంటుందన్నది వాస్తవమే. అయినా ఈ విషయంలో ఉన్నతాధికారుల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకం. వర్షాలు వస్తే దానికి తగ్గట్టుగా రైతు పంట వేసుకునే అవకాశం కల్పించేందుకు సూచనలు ఇవ్వడం పెద్ద కష్టమైన పని కాదు. కనుక ముందుజాగ్రత్త చర్యలు ఎంతైనా అవసరమన్నది అనుభవజ్ఞులైన రైతులు అంటున్నారు. అలాగే ఇప్పటివరకు రైతులకు అందజేసిన సబ్సిడీ విత్తనాలు అధునాతన పరికరాల వివరాలకై కూడా నివేదికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందంటున్నారు. ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం ఈ పరిస్థితుల్లో రైతులు వరిసాగు చేసుకోలేరని నివేదికలు పంపించడం అప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను సబ్సిడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతూ వస్తుంది. ఇందువల్ల రైతులకు మేలు కన్నా కీడే ఎక్కువవుతుంది.
గత రెండేళ్ల చరిత్రను పక్కనుంచితే పదిహేను సంవత్సరాలుగా వర్షాల పరిస్థితిని డివిజన్‌లో అంచనా కట్టినా ముడూ నాలుగేళ్లు మినహాయించి వర్షాలు పడిన జాడ కనిపించదు. కనుక ముందుజాగ్రత్త చర్యలు రైతును ఆదుకునేందుకు తీసుకోవడం ఎంతైనా అవసరమన్నది ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. రైతుల సంక్షేమంపై ఎన్నో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి వీలుగా ముందుజాగ్రత్త చర్యలపై దృష్టి కేంద్రీకరించడం ఎంతైనా అవసరం.

బాంబు స్వాధీనం
ముద్దనూరు, జూలై 14: స్థానిక ముద్దనూరు -జమ్మలమడుగు రహదారి ప్రక్కన ఉన్న శ్మశానంలో ఆదివారం ఓ సమాధిపై బాంబు ఉండడంతో సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ బాలమద్దిలేటి హుటా హుటిన సంబంధిత స్థలానికి వెళ్ళి బాంబును స్వాదీనం చేసుకున్నారు. అలాగే చుట్టు ప్రక్కల నివాసం ఉంటున్న ప్రజలను విచారించగా ఈ ప్రాంతంలోని సమాధి పైన గత మూడురోజులుగా బాంబు ఉన్నదని అది సంబంధిత బంధువులు పూజా నిమిత్తం ప్రసాదం పెట్టి ఉంటారని భావించామని స్థానికులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలి
* జెవివి రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య
కడప , జూలై 14 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య కోరారు. ఆదివారం స్థానిక సిపి బ్రౌన్ లైబ్రరీ అవరణంలో పాఠశాల విద్య-పర్యవేక్షణపై నిర్వహించిన జిల్లా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3వేల పాఠశాలలు ప్రైవేట్ విద్య ఆకర్షణ కారణంగా వచ్చే విద్యా సంవత్సరంలో మూతపడే అవకాశం ఉన్నా, 7వేల పాఠశాలలను కాపాడేందుకు ఉపాధ్యాయలోకం, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, అధికార యంత్రాంగం ఉమ్మడి పట్టుపట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో జెవివి భాగస్వామ్యం అవుతుందన్నారు. ఉపాధ్యాయులు పూనుకుంటే, తల్లిదండ్రులులకు నమ్మకం కలిగిస్తే ఉత్సాహభరితమై నేర్చుకునే వాతావరణం కల్గిస్తే ప్రస్తుతం ఇంగ్లీష్ చదువుల కొర్కెలను తీర్చగలిగితే సంవత్సరం జిల్లాలో ప్రమాదంలో ఉన్న 406 పాఠశాల అభివృద్ధిచేసుకోవచ్చన్నారు. ఇందులో 12 మండలాలలోని 16 ప్రభుత్వ పాఠశాలల ప్రాథమిక పాఠశాలల బాధ్యత తీసుకోవాలని వర్క్‌షాపులో నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఎంఇవో అసోషియేన్ జిల్లా అధ్యక్షులు వి నాగమునిరెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు వౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయ అవసరమైన విద్యార్హతలు, శిక్షణ, అనుభవం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లను చదివించాల్సిన అవసరం లేదన్నారు.
10వ తరగతి పరీక్షల్లో జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు స్థాపించిన విజయాలు గమనార్హం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జెయుపి నగర సలహాదారుడు రామస్వామి, యుటిఎఫ్ జిల్లా నాయకులు చంద్రశేఖర్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి గుణశేఖర్, వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ బాధ్యులు రజనీకాంత్‌రెడ్డి, వయోజన విద్య మానిటర్ జిల్లా అధికారి ఇ సోమశేఖర్‌రెడ్డి, మున్సిపల్ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కెవి సుబ్బారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులుకట్టా నరసింహులు, రాఘవరెడ్డి, వైద్యులు డాక్టర్ పుత్తాబాలిరెడ్డి, జెవివి విద్యా విభాగం కో కన్వీనర్ ఎడి దేవదత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ రఘునాధ్‌రెడ్డి, జెవివి జిల్లా సభ్యులు అవధానం శ్రీనివాస్, ఇన్నయ్య షామీర్‌బాషా, రామగోపాల్, వెంకటేశ్వర్లు, అనికుమార్, క్రిష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్రామరాజు, మహావీర్, నాయుడు, గోవిందు, రవూఫ్, వెంకట్రామణ, బాబురావు, మస్తానయ్య, దాదాపీర్, కుశకుమార్, వెంకటసుబ్బయ్య, రామచంద్ర పాల్గొన్నారు.

దోషులను అరెస్టు చేయాలని రాస్తారోకో
పోరుమామిళ్ల, జూలై 14: దోషులను అరెస్టు చేయాలంటూ దళిత నేతలు ఆదివారం సాయంత్రం రాస్తారోకో చేపట్టారు. స్థానిక గిరినగర్‌కు చెందిన మనోహర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవనం ఎదుట దళితనేతల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. బి కోడూరు మండలం రాజుపాళెం దళితవాడకు చెందిన మనోహర్ గిరినగర్‌లో కాపురం ఉంటున్నాడని శనివారం తెల్లవారుజామున అతనిని బయటికి పిలుచుకొని వచ్చి అంబేద్కర్ భవనం వద్ద తీవ్రంగా గాయపరిచి అక్కడే పడవేసి వెళ్లిపోయారని దానిపై శనివారం మనోహర్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఓబులేసు, నరసింహులు మరొకరిపై కేసు నమోదు చేశారు. వారందరిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ ముత్యాల ప్రసాద్, దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడురాజు, సిపియం వీరయ్య, శేఖర్ తదితరులు డిమాండ్ చేశారు. సిఐ మురళినాయక్ తమ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు.

విష జీవులతో నిండుతున్న డ్రైనేజీలు
సుండుపల్లె, జూలై 14 : మండలంలోని యర్రమనేనిపాళెం కుప్పగుట్ట ప్రాంతంలో కాలువ లేనందు వల్ల ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మురిగి నీరు గ్రామం చివరి బాగానా నిలయంగా ఉండడంతో విష జీవులకు చాలా నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మురిగి నీరు నిల్వ ఉండడంతో గతంలో ఆ గ్రామంలో మలేరియా, టైపాయిడ్, చికెన్‌గున్యా వ్యాధులతో చిన్నారులతో సహా రోగిగస్తులపై బాధపడ్డ సాగారు. ఆ గ్రామంలో డ్రైనేజి నీరు ఎక్కువగా నిల్వ ఉండడంతో దోమల శాతం అధికంగా పెరుగుతుంది. అయితే సంబంధిత అధికారులు మాత్రం డ్రైనేజిని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. కాని ఇంత వరకు బ్లీచింగ్ కూడా చల్లని పరిస్థితి దాపురించింది. గతంలో జిల్లా అధికారులు డ్రైనేజి కాలువలు కావాలని అనేక మార్లు విన్నవించినా పట్టించుకొన్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

* పట్టించుకోని పెద్దలు * చోటా నేతలదే హవా
english title: 
strategy

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>