చీరాల, ఫిబ్రవరి 29: కొడుకు లేడని బాధపడకు.. కొడుకుకన్నా ఎక్కువగా చూసుకుంటాను, నీ రుణం తీర్చుకుంటానంటూ ఓ బాలిక తండ్రి చివరి కోరిక తీర్చేందుకు అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన స్థానిక ఎకెపి కళాశాల వెనుక సమాధుల వద్ద బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రసాద్‌నగర్‌కు చెందిన కె కిషోర్ (42) హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో అక్కడే నివసిస్తున్నాడు. రెండు రోజుల క్రితం కంపెనీలో ప్రమాదవశాత్తు గ్రానైట్ రాయిపడి మృతి చెందాడు. తన చివరి కోరిక ప్రకారం కూతురుతో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులతో చెప్పి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలమైన ప్రసాద్‌నగర్‌కు తీసుకొచ్చారు. తండ్రి చివరి కోరిక ప్రకారం పెద్దకూతురు కిరణ్మయితో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. చితి వద్ద చిన్నారి కిరణ్మయి అంత్యక్రియలు నిర్వహించటం పలువురిని కలచివేసింది.
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు
english title:
daughter perfoms obsequies
Date:
Thursday, March 1, 2012