లండన్, జూలై 19: ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ చెలరేగిపోతున్నది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా ఆస్ట్రేలియా ఎదు రుదాడికి దిగింది. దీనితో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులు సాధించిన ఈ జట్టు ఆతర్వాత ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూల్చింది. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ 44 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా పతనం అనివార్యమైంది. లార్డ్స్ మైదానంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించడం స్వాన్‌కు ఇది రెండోసారి. మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ఫాలో ఆన్ ఇవ్వకుండా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 31 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది కుక్ (8), జొనథాన్ ట్రాట్ (0), కెవిన్ పీటర్స న్ (5) పెవిలియన్‌కు చేరగా, జో రూట్ (18), నైట్‌వాచ్‌మన్ టిమ్ బ్రెస్నన్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
మ్యాచ్ మొదటిరోజైన గురువారం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ సెంచరీతో రాణించాడు. అతను 109 పరుగులు చేయగా, జొనథాన్ ట్రాట్ 58, జేమ్స్ బెయిర్‌స్టో 67 పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్ ర్యాన్ హారిస్ 72 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించినా, మిగతా బౌలర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. కాగా, శుక్రవారం ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ 289 పరుగుల వద్ద బ్రెస్నన్ (7) వికెట్‌ను కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ 12 పరుగులు చేసి హారిస్ బౌలింగ్‌లో బ్రాడ్ హాడిన్‌కు చిక్కాడు. చివరిలో స్టువర్ట్ బ్రాడ్ (33), స్వాన్ (నాటౌట్ 28) కొంత సేపు ఆసీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించడంతో తొలి ఇన్నింగ్స్‌లో అలిస్టర్ కుక్ సేన సాధించిన 361 పరుగులకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, రోజర్స్ చక్కని ఆరంభాన్నిచ్చేందుకు ప్రయత్నించారు. కానీ స్వాన్ బౌలింగ్‌లో రోజర్స్ (15) క్లీన్ బౌల్డ్ కావడంతో మొదలైన ఆస్ట్రేలియా పతనం చివరి వరకూ కొనసాగింది. వాట్సన్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యాలను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జట్టు 53.3 ఓవర్లలో 128 పరుగులకే ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
128 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా శఉత్కంఠగా సాగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టు
english title:
s
Date:
Saturday, July 20, 2013