న్యూఢిల్లీ, జూలై 19: ఫరాన్ అక్తర్ నటించిన ‘్భగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని చూసినప్పుడు పునర్జన్మ ఎత్తినట్టు అనిపించిందని భారత మాజీ అథ్లెట్, ‘్ఫ్లయింగ్ శిఖ్’ మిల్కా సింగ్ వ్యాఖ్యానించాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ యవ్వనంలో తను ఎలా ఉండేవాడినో అచ్చుగుద్దినట్టు అదే విధంగా కనిపించేందుకు ఫరాన్ అక్తర్ విశేషంగా కృషి చేశాడని అన్నాడు. మిల్కా సింగ్ జీవితం ఆధారంగా, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తున్నది. చిత్రం గురించి మిల్కా సింగ్ మాట్లాడుతూ తాను స్టేడియంలో పడిన కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రశంసించాడు. తాను పడిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభిస్తున్నదని వ్యాఖ్యానించాడు. ఎంతో మంది తనను ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారని అన్నాడు. చిన్నపిల్లలు సైతం తనను గుర్తుపడుతున్నారని చెప్పాడు. అథ్లెట్‌గా ఎదగడానికి తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని మిల్కా సింగ్ అన్నాడు. చాలాసార్లు తాను ప్రాక్టీస్ చేస్తూ స్పృహతప్పి కింద పడేవాడినని, తోటి అథ్లెట్లు తనను స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లే వారని తెలిపాడు. ఊపిరి ఆడక అల్లాడుతున్నప్పుడు ఎన్నోసార్లు తనకు కృత్రిమ శ్వాస కూడా అందించారని పేర్కొన్నాడు. రోజుకు ఐదారు గంటలు ప్రాక్టీస్ చేసేవాడినని, అప్పటి రోజులను ఈ చిత్రం మళ్లీ కళ్ల ముందు ఆవిష్కరించిందని కొనియాడాడు. తన జీవితగాధ ఆధారంగా తయారైన ఈ చిత్రం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిస్తే తన జన్మ ధన్యమవుతుందని వ్యాఖ్యానించాడు.
ఫరాన్ అక్తర్ చిత్రంపై మిల్కా సింగ్
english title:
p
Date:
Saturday, July 20, 2013