మాస్కో, జూలై 24: రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకున్న రష్యా పోల్‌వాల్ట్ రారాణి యెలెనా ఇసిన్బయేవా త్వరలోనే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించనుంది. వచ్చేనెల మాస్కోలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ తర్వాత తాను కెరీర్‌కు గుడ్‌బై చెప్తాననిని ఆమె తెలిపింది. లుజ్నికీ ఎరెనాలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, ప్రపంచ పోటీల్లో టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపింది. జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడం తనకు ఇదే చివరిసారని, ఇందులో స్వర్ణ పతకాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. 2004, 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించిన ఇసిన్బయేవా మహిళల పోల్‌వాల్ట్ విభాగం 28 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. 5.06 మీటర్లతో ఆమె సృష్టించిన రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. వలెరీ ఆడమ్స్, ఉసేన్ బోల్ట్, విక్టోరియా క్యాంప్‌బెల్ బ్రౌన్, జాక్వెస్ ఫ్రె టాస్, జనా పిట్‌మన్, డానీ శామ్యూల్స్, డేవిడ్ స్టోరీ మాదిరిగా జూనియర్స్, యూత్, సీనియర్స్ విభాగాల్లో ప్రపంచ చాంపియ న్‌షిప్ పోటీల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న అథ్లెట్‌గా ఆమె రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది.
రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకున్న
english title:
r
Date:
Thursday, July 25, 2013