హైదరాబాద్, జూలై 26: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి బి.ఎస్సీ, పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు నిర్వహించిన ఇసెట్ కౌనె్సలింగ్‌లో గోల్‌మాల్ జరగడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు గగ్గోలు పెట్టడంతో సాంకేతిక విద్యాశాఖ అధికారులు తేరుకుని పొరపాట్లను సరిదిద్దారు. తుది దశలో అలాట్ అయిన విద్యార్థులకు సవరించిన జాబితాను శుక్రవారం విడుదల చేశారు. తొలి దశ అడ్మిషన్లు జూన్ 10నే మొదలయ్యాయి. సర్ట్ఫికేట్ల పరిశీలన తర్వాత జూలై 12న వారికి సీట్లను అలాట్ చేశారు. అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 42,478 కాగా అందులో సర్ట్ఫికేట్ల పరిశీలనకు 27,448 మంది మాత్రమే హాజరయ్యారు. కానీ సీట్లు మాత్రం 1,47,753 ఉన్నాయి. అందులో చివరికి 26509 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక తుది దశలో 27,883 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. అందులో 9235 మంది మాత్రమే తమ ఆప్షన్లను ఇచ్చారు. మొత్తం సీట్లు 1,47,768 కాగా, అందులో తొలి దశలో చేరిన వారు 23003 మంది మాత్రమే. దాంతో రెండో దశకు సీట్లు 1,24,765 మిగిలాయి. అందులో 3711 సీట్లు మాత్రమే రెండో దశలో భర్తీ అయ్యాయి. అంటే రెండు దశల్లో కలిపి 26714 మంది మాత్రమే సీట్లు తీసుకోగా, 1,21,054 సీట్లు మిగిలిపోయాయి. ఎక్కువ శాతం సీట్లు మిగిలిపోవడంతో కొన్ని యాజమాన్యాలు రంగంలోకి దిగాయి.
ఇంజనీరింగ్‌లో పదుల సంఖ్యలో మాత్రమే అడ్మిషన్లు పొందిన ఈ కాలేజీల యాజమాన్యాలు ఎఫ్‌డిహెచ్ అభ్యర్థులను సాంకేతికంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థి ఎలాంటి ఆప్షన్ ఇవ్వకున్నా, నచ్చని కాలేజీల్లో కన్వీనర్ అలాట్ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. దీనిపై కన్వీనర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు వందలాది విద్యార్థులు ఇసెట్ అడ్మిషన్ల కార్యాలయానికి చేరుకుని నిరసన తెలపడంతో అధికారులు పొరపాట్లు సరిదిద్దే కార్యక్రమం చేపట్టారు. దాదాపు వంద మందికి రివైజ్డ్ అలాట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చామని అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ రఘునాధ్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.
ఆర్‌జియుకెటిలో 246 సీట్లు మిగులు
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నిర్వహించిన కౌనె్సలింగ్‌లో మొత్తం 246 సీట్లు మిగిలిపోయాయని విసి ప్రొఫెసర్ రాజ్‌కుమార్ చెప్పారు. బాసరలో 917 మంది, నూజివీడులో 923 మంది, ఆర్‌కె వ్యాలీలో 911 మంది చేరారని, బాసరలో 83, నూజివీడులో 76, ఆర్‌కె వ్యాలీలో 87 సీట్లు మిగిలిపోయాయని విసి పేర్కొన్నారు. వెయిట్ లిస్టు అభ్యర్థులకు జూలై 28న కౌనె్సలింగ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కొత్తగా చేరిన విద్యార్ధులకు జూలై 26న తరగతులు ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు.
నేడు ఐసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్
ఐసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను శనివారం జారీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొసర్ పి. జయప్రకాశ్‌రావు తెలిపారు. ఎపిఐసెట్ డాట్ నిక్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో దీనిని ఉంచుతామని ఆయన వెల్లడించారు. సర్ట్ఫికేట్ల పరిశీలన ఆగస్టు 3 నుండి ప్రారంభం అవుతుందని, ఆప్షన్ల ఎంట్రీ ఆగస్టు 6న ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మొత్తం 1,26,000 మంది విద్యార్ధులు ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన వివరించారు.
సరిదిద్దిన అడ్మిషన్ల కన్వీనర్ భర్తీ 26వేలు, మిగులు 1.21 లక్షల సీట్లు
english title:
i
Date:
Saturday, July 27, 2013