విజయనగరం, జూలై 29: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రస్ఫుటించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. సోమవారం తన చాంబర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రస్ఫుటించేలా శకటాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. శకటాల ఏర్పాటు బాధ్యతను డిఆర్‌డిఎ పిడి, స్టాళ్ల ఏర్పాటు బాధ్యతను డ్వామా పిడి పర్యవేక్షించాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో ప్రథమ చికిత్స కేంద్రంతోపాటు చిన్న వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఒను ఆదేశించారు. ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాల ఎంపికకు ఎజెసి చైర్మన్‌గా సిపిఒ, డిఆర్వో, ఐటిడిఎ పివో డిఆర్‌డిఎ పిడిలతో కూడిన కమిటీని కలెక్టర్ నియామకం చేశార. మండల, డివిజన్ స్థాయిల్లో కాకుండా జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలందించిన వారికే ప్రశంసా పత్రాలకు ఎంపిక చేయాలన్నారు. 8లోగా జాబితాను సమర్పించాలన్నారు. వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్ఛేయనున్న మంత్రి సందేశాన్ని 7లోగా పూర్తి చేసి జిల్లా కలెక్టర్ ఆమోదంతో 8న మంత్రికి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు ఆయా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికలను 3లోగా సిపిఒకు, ఐదో తేదీలోగా డిపిఆర్వోకు అందజేయాలన్నారు. సిపిఒ ధ్రువీకరించిన అంకెలను మాత్రమే అధికారికంగా మంత్రివర్యుల సందేశంలో పొందుపరచాలని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు బ్యారెక్స్‌లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను డిఇఒకు, రాజీవ్ విద్యా మిషన్ పిఒ, బీసీ సంక్షేమాధికారి, సాంఘీక సంక్షేమ శాఖ డిడి సహకారం అందించాలన్నారు. అదే విధంగా సాయంత్రం ఆనందగజపతి ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా డిపిఆర్వోను ఆదేశించారు. పోలీసు, కోరుకొండ మార్చ్ఫాస్ట్ నిర్వహించాలన్నారు. కవాతు మైదానంతోపాటు ఆనందగజపతి ఆడిటోరియటంలో పరిసరాలను శుభ్రపరచి మంచినీటి సౌకర్యం కల్పించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎజెసి యుసిజి నాగేశ్వరరావు, డిఆర్వో వెంకటరావు, ఆర్డీవో రాజకుమారి, డిఆర్‌డిఎ పిడి జ్యోతి, డ్వామా పిడి శ్రీరాములనాయుడు, ఐసిడిఎస్ పిడి శ్రీనివాస్, డిఇఒ కృష్ణారావు, ఆర్వీఎం పిఒ వెంకటరమణలు పాల్గొన్నారు.
‘అటవీ భూముల అభివృద్ధికి
ప్రణాళికలు’
పాచిపెంట, జూలై 29: అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అటవీశాఖ చీఫ్ కన్సల్వేటర్ ఎ భరత్‌కుమార్ (విశాఖ) చెప్పారు. పెద్దగెడ్డ జలాశయ పరిసర ప్రాంతాల్లోని అటవీ భూములను సోమవారం ఆయన పరిశీలించారు. జలాశయ సమీపాన మడివలస, ఎగువ కుమ్మరివలస వద్ద గల 38 హెక్టార్ల అటవీ భూములను పరిశీలించారు. పెద్దగెడ్డ జలాశయం నిర్మాణంతో ఈ ప్రాంత అటవీ భూములు ఎంతమేరకు ముంపునకు గురయ్యాయి? భవిష్యత్‌లో ఏమైన అటవీ భూములకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయా? అని పెద్దగెడ్డ డిఇ రాజారావును సిసిఎఫ్ అధికారి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గల అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ముఖ్యంగా నర్సరీల పెంపకంలో ఈ ప్రాంత భూములకు అనుకూలమైన మొక్కలు పెంచే ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈయనతోపాటు డిఎఫ్‌ఒ ఐకెవి రాజు, సామాజిక అటవీ శాఖ డిఎఫ్‌ఒ సిహెచ్ సూర్యనారాయణ, సాలూరు రేంజర్ గాంధీ పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రస్ఫుటించేలా ఉండాలని జిల్లా కలెక్టర్
english title:
s
Date:
Tuesday, July 30, 2013