డెంకాడ, జూలై 29 : పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని తిప్పలవలసలో కాంగ్రెస్ మద్దతుదారు వాకపల్లి దానయ్యమ్మ సర్పంచ్‌గా గెలుపొందడంతో గ్రామంలో విభేదాలు చెలరేగాయి. ఓటమి పాలైన వర్గానికి చెందిన గ్రామస్తులు తిట్లపురాణం అందుకోవడంతో ఒకరికొకరు కోట్ల్లాటకు దిగారు. ఈ ఘర్షణలో 25 మందికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పికెట్ ఏర్పాటు చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఎస్సీ కార్తికేయ, ఎఎస్పీ టి.మోహనరావు, ప్రాంతాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడే వరకు పికెట్ కొనసాగిస్తామని తెలిపారు. డిఎస్పీ కృష్ణప్రసన్న, సిఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై రామారావు, ఆర్డీవో రాజకుమారి, తహశీల్దార్ పద్మావతి గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఎంపి ఇంటి ముందు ఎన్జీవోల నిరసన
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 29: సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సోమవారం కోట జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎంపీ ఝాన్సీలక్ష్మి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ సమైక్యాంధ్ర కోసం ఎంపీ రాజీనామా చేయాలని ఎన్జీవోలు నినాదాలు చేశారు. దీనికి ఎంపి ఝాన్సీలక్ష్మి స్పందిస్తూ అందరి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తానొక్కరు రాజీనామా చేయడం వల్ల ఫలితం ఉండదని అన్నారు. అందరి మాటే.. తన మాట అని బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో అధ్యక్షుడు ప్రభూజీ, విఆర్వో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, రమణమూర్తి, పింఛనర్ల సంఘం అధ్యక్షుడు పెద్దింటి అప్పారావులతోపాటు పలువురు ఎన్జీవోలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు
english title:
t
Date:
Tuesday, July 30, 2013