వికారాబాద్, ఆగస్టు 8: పాక్ ప్రభుత్వం భారతీయుల సహనాన్ని పరీక్షిస్తోందని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలిస్తూ తెలంగాణ కూడలి వద్ద పాకిస్తాన్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతసైన్యాన్ని పాక్‌దళాలు ఉగ్రవాదులతో కలిసి కాల్చి చంపిన ఘటన భారతదేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. పిరికిపంద చర్యలను పాక్ ప్రభుత్వం మానుకోవాలని లేని ఎడల భారతప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశసమగ్రతను కాపాడుతూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని, కాల్పుల్లో మరణించిన అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్‌గౌడ్, పర్వేజ్, శ్రీకాంత్, జంగయ్య, కిరణ్, బాలవర్ధన్‌రెడ్డి, మణికంఠ, శంకర్, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
పాక్ ప్రభుత్వం భారతీయుల సహనాన్ని పరీక్షిస్తోందని
english title:
rr
Date:
Friday, August 9, 2013