Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వెల్లువెత్తిన సమైక్య నిరసనలు

$
0
0

కర్నూలు, ఆగస్టు 9 : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు హోరెత్తాయి. రంజాన్‌ను పురస్కరించుకుని నగరంలో నిరసనలకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. అయితే జిల్లాలోని కర్నూలు, వెలుగోడు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరులో నిరసనలు జరిగాయి. కెసిఆర్, సోనియా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఆళ్లగడ్డలో సమైక్యవాదులు ఎంపి ఎస్పీవైరెడ్డిని అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర కోసం డోన్‌లో హోమాలు నిర్వహించారు. రంజాన్ ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే రిలేనిహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలకు పలు సంఘాలతో పాటు, నాయకులు, ముస్లింలు సందర్శించి తమ సంఘీభావం ప్రకటించారు.
జై సమైక్యాంధ్ర అన్న ఎంపి ఎస్పీవై రెడ్డి
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డకు వచ్చిన నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎస్‌పివై రెడ్డిని శుక్రవారం సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ఎంపిలు రాజీనామా చేసి పార్లమెంట్‌లో పోరాడుతున్నామన్నారు. ఇప్పటికే ఉభయసభల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్రం దిగివచ్చేంత వరకు రాజీ పడమన్నారు. అనంతరం జెఎసి నాయుకులు మాట్లాడుతూ తమ పదవులు, పార్టీకి రాజీనామా చేసి రండి మిమ్మల్లి మేము గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పలుచాని బాలిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సిద్దంరెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో నిరసనల హోరు..
డోన్ : డోన్‌లో సమైక్యాంధ్ర నిరసనలు హోరెత్తాయి. పట్టణంలోని బుడగ జంగాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు పండ్లు, కూరగాయల వ్యాపారులు బంద్ చేసి మద్దతు పలికారు. అలాగే శేషావలి శర్మ, శేషు శర్మ, సుబ్రమణ శర్మ, శ్రీనివాస శర్మ, విజయ్ శర్మ, సత్యనారాయణ శర్మ, శ్రీవాత్సశర్మల ఆధ్వర్యంలో బ్రాహ్మణులు విఘ్నేశ్వరునికి, శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్‌లో రాష్ట్ర విభజనను వ్యతిరేకంగా హోమాలు చేశారు. ఈ సందర్భంగా విభజనకు కారకులైన సోనియాగాంధీ, కెసిఆర్, దిగ్విజయ్ సింగ్‌ల మనసులు మార్చాలని కోరారు. అలాగే దేశంలో, రాష్ట్రంలో శాంతి నెలకొనాలని యాగాలను చేపట్టారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు శుక్రవారానికి 9వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో పుల్లయ్య, నాగిశెట్టి, రాజు, జల్సా, బ్రూస్‌లీలు కూర్చొన్నారు. అనంతరం పండ్లు, కూరగాయల వ్యాపారులు కెసిఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి పాతబస్టాండ్‌లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి అధ్యక్షులు పామయ్య, కోశాధికారి ఆలా శ్రీ్ధర్, జ్యోతి స్టూడియో శ్రీను, కమాల్ తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరులో కొనసాగిన దీక్షలు
నందికొట్కూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం నందికొట్కూరులో రాజకీయ నేతలు, జెఎసి నాయకులు ఆందోళనలు కొసాగించారు. రంజాన్ పండుగ ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఉద్యమానికి విరామం ప్రకటించలేదు. మార్కెట్‌యార్డు చైర్మన్ మురళీమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. మిడుతూరు మండలంలో నిర్వహించిన రిలే దీక్షల్లో మురళీమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యాంగా ఉన్నప్పుడే రాయలసీమకు అన్యాయం జరిగిందని, ఇక విడదీస్తే సీమ కష్టాలు మరింత పెరుగుతాయన్నారు. సమైక్య రాష్ట్రం ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘురెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వైకాపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలను శుక్రవారం వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఎల్.నరసింహారెడ్డి, కోకిల రమణారెడ్డి, సతీష్‌రెడ్డి, జంగాల పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే జెఎసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో శ్రీనవనంది హైస్కూల్ హెచ్‌ఎం నర్సప్ప, ఉపాధ్యాయులు రాజశేఖరరెడ్డి, మధుసూదన్, వెంకటేశ్వర్లు కూర్చొన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు రాజశేఖరరెడ్డి, రాముడు, సత్యనారాయణ, ఎ.రాముడు, రవి, ఖాజాహుసేన్ తదితరులు పాల్గొన్నారు.
బేతంచెర్లలో జెఎసీ దీక్షలు
బేతంచెర్ల : రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర జెఎసి అధ్వర్యంలో చేపట్టిన రిలేనిరహారదీక్షలు శుక్రవారం మూడోరోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో వైకాపా కార్యకర్తలు శేఖర్, వెంకటేశ్, రమేష్, ప్రభాకర్, సుధాకర్‌లు కూర్చొన్నారు. వీరికి వైకాపా నాయకులు నాభూషణంరెడ్డి, బాబురెడ్డి, సురేంద్రనాథరెడ్డి, రాజేంద్రనాథరెడ్డిలు వివిధ కులసంఘాల నాయకులు సంఘీబావం తెలిపారు.
కోడుమూరులో సమైక్యాంధ్ర హోరు..
కోడుమూరు : రాజకీయాలకు అతీతంగా సాగుతున్న సమైకాంధ్ర పోరు కోడుమూరులో ఉగ్రరూపం దాల్చింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకూ ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, మోటార్ యూనియన్, ఆటో వర్కర్లు మాత్రమే సమైకాంధ్ర పోరులో పాల్గొన్నారు. అయితే ఉద్యమంలో పాల్గొనేందుకు అధికార కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు ఇంత వరకూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఉద్యమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎరువులు, పెస్టిసైడ్స్ డీలర్ల అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు తిమ్మన్న, ఆంద్రయ్య, దయాకర్, ఎరువుల డీలర్లు పరమేశ్వరరెడ్డి, సుధాకరయ్య, శివరాముడు, క్రిష్ణారెడ్డి, నాగరాజు, జె.కె వెంకటేశ్వర్లు, రామక్రిష్ణారెడ్డి, సుబ్బారావు, క్రిష్ణమూర్తి, అన్ని కంపెనీలు ఫీల్డు ఆఫీసర్లు చెన్నప్ప, వెంకటేష్, జగదీష్, శ్రీను, సుధాకర్, రవి, రాము, శేషన్న తదితరులు పాల్గొన్నారు.
వెలుగోడులో...
వెలుగోడు : సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం పట్టణంలోని ముస్లింలు పొట్టిశ్రీరాములు సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్‌గా వద్ద ప్రార్థనలు ముగించుకున్న ముస్లింలు నేరుగా పొట్టిశ్రీరాములు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర జిందాబాద్, ప్రాణాలైనా అర్పిస్తాం రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం అంటూ ముస్లింలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు అంజుమన్ నాయకులు పాల్గొన్నారు.

హైపవర్ కమిటీకి చట్టబద్ధత ఏదీ!
* నంద్యాల మాజీ ఎంపి భూమా
నంద్యాల, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసేందుకు తీర్మానించామని కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం చెప్పడం, అదే ఫైనల్‌గా కేంద్రం నిర్ణయం ఉంటుందని ప్రచారం చేయడం బాధిస్తోందని, కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం వేసిన హైఫవర్ కమిటీకి చట్టబద్ధత ఎక్కడిదని, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు కాంగ్రెస్‌పార్టీ కార్యాలయానికి వెళ్లి విభజన వద్దని మొరపెట్టుకోవాలా..? చేతగాని మంత్రులు, ముఖ్యమంత్రి వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని వైకాపానేత ఎవి సుబ్బారెడ్డి స్వగృహంలో ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రప్రభుత్వం రాష్ట్ర విభజనపై క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు శ్రీకృష్ణ కమిటీని వేసిందని, అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమ ప్రాంతాలలోని సమస్యలు శ్రీకృష్ణ కమిటీకి విన్నవించుకున్నారని, వాటిని పక్కన పెట్టి ఒంటెత్తుపోకడలతో, కాంగ్రెస్‌పార్టీ తన రాజకీయ స్వార్థంతో తెలుగుప్రజల మధ్య విభజన చిచ్టు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నామని, రాష్ట్ర విభజన మీకు తెలిసే జరిగిందా, లేదా, మీకు ముందే తెలిసింటే ఆందోళనలతో ప్రజలను మోసం చేయవద్దు, మీకు తెలియకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే వెంటనే కాంగ్రెస్‌పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంద్ర జేఏసితో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని భూమా నాగిరెడ్డి కోరారు. చనిపోయిన వ్యక్తి వైఎస్‌ఆర్ ఇక రాడని, సమాదానం చెప్పుకోలేడని నిందలు వేయడం భావ్యం కాదని, వైఎస్సారే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలమని అనాడు అని ఉంటే అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టిఆర్‌ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి వైఎస్సార్ అని ఆయన బతికున్నప్పుడు, చనిపోయిన తర్వాత కూడా ఆరోపించారని భూమా గుర్తు చేశారు. మీ చేతగాని తనాన్ని ఇతరులపై నెట్టేందుకే వైకాపాను రాజకీయంగా ఎదుర్కొలేకే వైఎస్సార్‌తో సహ కాంగ్రెస్ నాయకులు ఆరోపనలు చేస్తున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని భూమా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వానికి సిఇఓగా వ్యవహరిస్తూ తెలుగుప్రజల గుండె గాయపరిచేలా వ్యవహరిస్తున్నారని, ఆయన మాటలు తెలుగు ప్రజలందరిని బాధిస్తున్నాయన్నారు.

మహేష్‌ను తప్పించిన ముఠా సభ్యుల అరెస్టు
ఆదోనిటౌన్, ఆగస్టు 9: ఆదోని సబ్ జైలులో ఖైదీగా ఉన్న మహేష్‌ను జైలు నుంచి తప్పించిన ముఠాలో ఏడుగురు ముఠా సభ్యులను శుక్రవారం పట్టణంలోని అరున్‌జ్యోతి నగర్‌లో అరెస్టు చేసినట్లు డిఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహేష్‌ను సబ్ జైలు నుండి తప్పించడంలో కీలక పాత్ర పోషించిన అతని భావ శాంతరాజు, నకిలీ పీటి వారెంటు ఇచ్చిన నంద్యాల 3వ అదనపు కోర్టు క్లర్కు మధుసూదన్, ఎమ్మిగనూరు బాషా, నకిలీ పోలీసు సుంకిరెడ్డి, నకిలీ హోంగార్డు హనుమంతు, కారు డ్రైవర్ కృష్ణ, పోలీసు దుస్తులు సరఫరా చేసిన మాధవరం పిఎస్ కానిస్టేబుల్ రఘునాథ్ బాబులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు మహేష్ పన్నిన పథకం ప్రకారం ఆదోనిలో వుంటున్న తన శాంతరాజ్ ద్వారా ఫోన్ తీసుకొని సబ్‌జైలు నుంచి మంతనాలు నడిపాడని డిఎస్పీ వివరించారు. చివరికి అందరిని నమ్మించి వీరిని సైతం మోసం చేశాడని, అదే వారు పట్టుబడటానికి కరణమైందని ఆయన తెలిపారు. ముందుగా మహేష్ ఎమ్మిగనూరులో వున్న బాషాకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అతని ద్వారా నంద్యాల్లో వున్న కోర్టు క్లర్క్ మధుసూదన్‌కు పీటి వారెంటు ఇస్తే రూ.2లక్షలు ఇస్తామని, కర్నూలు న్యాయ వాదిగా పని చేస్తున్న సుంకిరెడ్డికి పోలీస్ వేషం వేస్తే రూ. 5లక్షలు ఇస్తానని, పందిపాడుకు చెందిన హనుమంతు హోంగార్డు వేషం వేస్తే రూ.50వేలు ఇస్తానని, పోలీసులు దుస్తులు సరఫరా చేస్తే రూ.2లక్షలు ఇస్తానని కానిస్టేబుల్ రఘునాథ్‌బాబు నమ్మించినట్లు వివరించారు. మహేష్‌ను నమ్మిన వీరందరు అతని పథకం ప్రకారం సహకరించి గత నెల 17న సబ్‌జైలు నుండి తప్పించారన్నారు. అయితే తమకు డబ్బులు ఇవ్వాలని శుక్రవారం మహేష్ బావ శాంతరాజును ఆరుగురు నిలదీసి ఘర్షణ పడడంతో విషయం వెలుగు చూసిందన్నారు. వీరిని అరెస్టు చేయడంలో టూటౌన్ సిఐ శ్రీదర్, ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది చిన్నహుసెన్, నాగరాజు, రవి, రాజశేఖర్‌లు తీవ్ర కృషి చేశారని వీరికి రివార్డు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. నిందితుడు మహేష్ కోసం గాలింపుచర్యలు ముమ్మరం చేసినట్లు డిఎస్‌పి వివరించారు.

హంద్రీనీవాకు గండ్ల ముప్పు!
* కాలువ నిండుగా నీళ్లు * ఆందోళనలో రైతులు
నందికొట్కూరు, ఆగస్టు 9 : హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయడంతో గండ్ల ముప్పు పొంచిఉంది. ఎందుకంటే కాలువ మొత్తం కంపచెట్లతో నిండిఉంది. హంద్రీనీవా మొదటి దశ నుంచి కర్నూలు, అనంతపురం జి ల్లాలకు సాగునీరు అందించేందుకు రెండు రో జుల క్రితం మల్యాల మొదటి ఎత్తిపోతల పథ కం నుంచి కలెక్టరు సుదర్శన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. కాలువ వెంట నీరు ప్రవహించడం తో కట్టలు బలహీనంగా ఉండటం వల్ల గండ్లుపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెం దుతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు మల్యాల ఎత్తిపోతల పథకం నుండి రెండు పంపులను రన్ చేసి 700 క్యూసెక్కులను విడుదల చేశారు. ఈ నీరు కాలువవెంట పరుగులు తీస్తున్నాయి. 2009లో కురిసిన వర్షాలకు కాలువ కోతకు గురై గండ్లు పడడంతో పంటపోలాలు నీటిలో మునిగాయి. కాలువ నీటి సామర్థ్యం 700 క్యూసెక్కుల నుంచి 1000 క్యూసెక్కుల వరకు పెంచితే కాలువ పరిస్థితి దారుణంగా ఉంటుందని రైతులు అంటున్నారు. మల్యాల వద్ద రెండు పంపులు రన్ చేయడం వల్ల రెండవ ఎత్తిపోతల పథకం బ్రహ్మణకొట్కూరు చేరడంతో గురువారం అక్కడ ఐదోపంపు ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. ఇక్కడినుండి ఆదివారానికి మూడవ ఎత్తిపోతల పథకానికి కృష్ణా జలాలు వెళ్లనున్నాయి. 10రోజుల్లో అనంతపురంలోని జీడిపల్లె రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు వెళ్తాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 884.5 అడుగుల నీరు చేరడంతో ప్రతిరోజూ 700క్యూసెక్కుల చోప్పున అధికారులు కాలువ నీటిని విడుదల చేస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఖరీఫ్‌లో 35వేల ఎకరాల్లో సాగునీటిని ఉపయోగించుకోవడంతో పాటు రిజర్వాయర్‌లు, కుంటలు, చెరువులను వీటితో నింపుకోవచ్చునని అధికారులు తెలిపారు. వరదనీటి ప్రవాహనికి గతంలో కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాల్సిన చేయవలసిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.

రాజోలివద్ద పొంగుతున్న కుందూ
చాగలమర్రి, ఆగస్టు 9: మండలంలోని రాజోలి ఆనకట్ట వద్ద కుందూనది పొంగి ప్రవహిస్తోంది. పైనుండి నీటి ఉద్ధృతి అధికం కావడంతో కట్టపై నీరు ప్రవహిస్తోంది. సుమారు 1500 క్యూసెక్కుల నీరువస్తున్నట్లు కెసి కాల్వ అధికారులు శుక్రవారం తెలిపారు. ఇందులో కెసి ప్రధాన కాల్వకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కుందూనదికి నీటి ఉద్దృతి పెరగడంతో కెసికాల్వకు నీటివిడుదల పెంచుతామని అధికారులు తెలిపారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ప్రజలు అక్కడి చేరుకుని దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు.
రాష్ట్రం అగ్నిగుండం కావడానికి వైఎస్సే కారణం
* టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి
కల్లూరు, ఆగస్టు 9 : సమైక్యంగా ఉన్న తెలుగు ప్రజల మధ్య చిచ్చురేపి రాష్ట్రం అగ్నిగుండం కావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమని టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. శుక్రవారం స్థానిక సోమిశెట్టి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2004 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని కేంద్రం, రాష్ట్రంలో మంత్రి పదవులు ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెపాలని డిమాండ్ చేశారు. ఇకపోతే టిడిపి పొలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాతే తమ అధినేత చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నాయకులకు ముందుగానే సంకేతాలు అందాయని ఆరోపించారు. అయితే మరోసారి రాజీనామాల డ్రామాతో మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేనందుకే విభజన వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోసం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఒకవేళ ఆయన రానిపక్షంలోప్రజలే ఢీల్లీకి వెళ్తారన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి స్పీకర్‌కు అందజేసి ఉద్యమంలో పాల్గొంటున్నారని, అదే కాంగ్రెస్ నాయకుల్లా డ్రామాలు ఆడటం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందజేసి ఉద్యమంలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు.
సమైక్య ఉద్యమంలో భాగంగా 13న జాతీయ రహదారుల దిగ్బంధం, వంటావార్పు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలోటిడిపి నాయకులు హనుమంతరాయచౌదరి, తిరుపాల్ బాబు, జేమ్స్‌లు పాల్గొన్నారు.

రాజకీయ లబ్ధికోసమే విభజన
* వైకాపా నేత భూమా నాగిరెడ్డి
ఆళ్లగడ్డ, ఆగస్టు 9 : రాజకీయ లబ్ధి కోసమే యుపిఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర గవర్నింగ్ సభ్యులు, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

* ఆళ్లగడ్డలో ఎంపిని అడ్డుకున్న సమైక్యవాదులు * డోన్‌లో హోమాలు * ముస్లింల ర్యాలీలు
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>