Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తిఠుపతికి వెళ్లాలంటే..వీసా కావాలా?

$
0
0

కరీంనగర్, ఆగస్టు 17: తిరుమల వెంకటేశుని దర్శనం కోసం తిరుపతికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావుపై సీమాంధ్ర ఉద్యమకారులు దాడి చేయడం గర్హనీయమని, తిరుపతి యావత్ దేశానికి సంబంధించిన పుణ్య క్షేత్రమని, అక్కడికి వెళ్లాలంటే వీసా తీసుకుని వెళ్లాలా అని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శనివారం సాయంత్రం కరీంనగర్ పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలిసి ఉండాలనుకునే వారు ఉద్యమం ముసుగులో ఇలా దాడులు చేయడం ఏ సంస్కృతికి నిదర్శనమని, వి. హన్మంతరావు కేవలం ఎంపి మాత్రమే కాకుండా ఏఐసిసి కార్యదర్శి కూడా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామికవాదులంతా ఈ దాడిని ఖండించాలన్నారు. ఆయనపై జరిగిన దాడిని యావత్ తెలంగాణ ప్రజానీకంపై దాడిగానే పరిగణిస్తున్నామని చెప్పారు. జూలై 30న తెలంగాణపై నిర్ణయం తీసుకుంది మొదలు సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మక ఘటనలకు పూర్తిగా పోలీసులదే బాధ్యత అని, అక్కడ పోలీసు యంత్రాంగం ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నదని అన్నా రు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగినప్పుడు ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించిన సీమాంధ్ర డిజిపికి అక్కడ జరుగుతున్న హింసను అరికట్టాలన్న ఇంగితం లేకపోవడం శోచనీయమన్నారు. ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందిన వాడు కావడంతోనే పక్షపాత బుద్దితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన తండ్రి విగ్రహానికి మాత్రం రక్షణ కల్పించుకుని జాతీయ నాయకులైన విగ్రహాలను పట్టించుకోని విషయాన్ని అధిష్ఠానం కూడా గమనిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లగానే డిజిపి, సిఎంల వ్యవహారశైలీపై కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసి, డిజిపిని భర్తరఫ్ చేయాలని ఒత్తిడి తేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం, పార్టీ అధిష్ఠానం తమను సంయమనం పాటించమని కోరడం వల్లనే సహనంతో ఉన్నామని, కానీ సీమాంధ్ర నాయకులు, ఉద్యమ ముసుగులో ఉన్న కొంతమంతి దుర్మార్గులు ఫెస్‌బుక్‌లు, ట్విట్టర్‌లలో నీచాతినీచమైన వ్యాఖ్యలు చేస్తూ తమ దిక్కుమాలిన సంస్కృతిని చాటుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపిలపై కూడా దాడి చేసి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సీమాంధ్ర నేతలు తమ ప్రయోజనాలకు భంగం కలిగితే ఎంతటి దారుణాలకైన పాల్పడతామని పరోక్షంగా తమ నైజాన్ని బయటపెట్టుకుంటున్నారన్నారు. కానీ సీమాంధ్రుల కవ్వింపులకు సంయమనం కోల్పోకుండా సహనంతో గాంధేయ మార్గంలో తిప్పికొడదామని పిలుపునిచ్చారు. సిరిసిల్ల పవర్‌లూం పరిశ్రమను ఆదుకునేందుకు త్వరలోనే ఓ ఫ్యాకేజీని అమలు చేసేలా స్కీమ్‌ను రూపొందిస్తున్నట్లు, ఇందుకు సంబంధించి సంబంధిత కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కూడా సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా వెల్లడించారు.

చెరువుకు బుంగ..రైతన్న బెంగ..
గంభీరావుపేట, ఆగస్టు 17: భారిగా వస్తున్న వరద నీటి ఉధృతికి గంభీరావుపేట మండల కేంద్రంలోని వేంకటాద్రి చెరువుకు శనివారం సాయత్రం బుంగ పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు ప్రాజెక్టు కాల్వ ద్వారా నీరు చెరువులోకి వస్తుండడం చెరువుకట్టకు బుంగ పడడం అన్నధాతలు బెంగపడుతున్నారు. చెరవు కింద దాదాపు 223 ఎకరాల ఆయకట్టుండి బుంగ పడి నీరు వృధాగా పొతుంది. బుంగ పడిన విషయం తెలుసుకొని రైతులు బుంగ పడిన ప్రాంతంలో తాత్కలిక మరమ్మత్తు పనులు చేపట్టారు. అధికారులు తక్షణం బుంగ పడిన ప్రాంతంలో శాశ్వత మరమ్మత్తు చేపట్టవల్సిందిగా రైతులు కొరుతున్నారు. అధేవిదంగా నమాజ్ చెరువులోకి భారిగా పాల్వంచ వాగు ద్వారా వరదనీరు చెరువులోకి వచ్చి చేరుతుండడం కట్ట సైతం అక్కడక్కడ కొతకు గరయింది. మాజి జడ్పిటిసి మల్లుగారి నర్సాగౌడ్, పంచాయతీ వార్డు సభ్యులు కలిసి వేళ్లి చెరువు కట్టను పరిశీలించారు. నీటి నష్టం జరుగకముందే అధికారులు తక్షణం స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టవల్సిందిగా కొరుతున్నారు.

చట్టబద్ధత లేని
కమిటీలు ఎందుకు
రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం అధ్యయనం చేయండి
హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడి
గోదావరిఖని, ఆగస్టు 17: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటించిన అనంతరం ఇంకా చట్టబద్దతలేని ఆంటోని కమిటీలాంటి వాటిని నియమించి కాలయాపన చేయాల్సిన అవసరం లేదని సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం స్థానిక భాస్కర్ రావు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపి ఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించిందని, ఇంకా దాని కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసి జాప్యం చేయడం సరైంది కాదన్నారు. 60 ఏళ్లుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి సాధించకున్న తెలంగాణ ఫలితాలను ఈ ప్రాంత వారే అనుభవించాలని, ఇందుకోసం సామాజిక మార్పు కోసం ఏర్పాటవుతున్న తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతాలు అభివృద్ధి జరిగే విధంగా విశాల వేదికను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సీమాంధ్ర ప్రాంతంలోని పలు జిల్లాల వెనుక బాటు విధానంతోపాటు రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి జరిపించే విధంగా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కొత్తగా ఏర్పాటయే రెండు రాష్ట్రాల్లో అభివృద్ధిని కాంక్షించే విధంగా కృషి చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌పై ఉందన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా ఏర్పాటు చేస్తూ దేశ రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రాంతీయ విభేదాలు చెలరేగుతుంటే వాటిని అరికట్టేందుకు ప్రయత్నించకుండా కమిటీలను నియమిస్తూ సమయం వృథా చేస్తున్నారన్నారు. ఇదేవిధంగా కొనసాగితే రాష్ట్రంలో రాష్టప్రతి పాలన ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సిపి ఐ పార్టీ ఇప్పటి వరకు కూడా స్పష్టంగా తమ వైఖరిని వెల్లడించిందన్నారు. తెలంగాణ కోసం కట్టుబడి ఉంటామని ప్రకటించిన వివిధ పార్టీలు ప్రకటనకు కట్టుబడక సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు జరుపుతున్నాయని, తాము మాత్రం సీమాంధ్రలోని ఏ జిల్లాలో కూడా ఆందోళనలు జరుపడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తక్షణమే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టి కొత్తగా ఏర్పాటయ్యే రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎ ఐటియుసి రాష్ట్ర నాయకులు సీతారామయ్య, గట్టయ్య, మిర్యాల రంగయ్య, కలవేని శంకర్, వేల్పుల నారాయణ, ఎం.నారాయణ, నర్సయ్యలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీ ముంపు గ్రామం కుందనపల్లిలో..
హక్కుల సంఘం విచారణ
రామగుండం, ఆగస్టు 17: రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామమైన కుందనపల్లి గ్రామాన్ని శనివారం రోజున మానవ హక్కుల వేదిక బృందం సందర్శించింది. ఎన్టీపీసీ యాష్ పాండ్ (బూడిద చెరువు)తో ప్రాణాలకు ప్రమాదం పొంచుందని గ్రామానికి చెందిన డేగల తిరుపతితోపాటు గ్రామస్తులు మానవ హక్కుల వేదికకు ఫిర్యాదు చేయడంతో బృందం గ్రామంలో పర్యటించి గ్రామస్తుల నుండి సమస్యలను తెలుసుకోవడంతోపాటు వివిరాలను సేకరించారు. ఎన్టీపీసీ యాష్ పాండ్ మూలంగా గాలి, నీరు కలుషితమయి రోగాల భారీన పడుతున్నామని, ఇప్పటి వరకు సుమారు 80 మందికి పైగా రోగాలతో మృత్యువాత పడ్డారని బృందం ముందు గ్రామస్తులు గోడు వెల్లబుచ్చుకున్నారు. ఈదుర గాలులు వీచినప్పుడల్లా ఎన్టీపీసీ బూడిద చెరువు నుండి విషబూడిద గ్రామాన్ని కప్పెస్తుందని, ఈ విషయంపై ఎన్టీపీసీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అనేక సార్లు ఆందోళనలు, ధర్నాలు చేయడంతోపాటు యాష్ పాండ్ పనులను అడ్డుకున్నా ఎన్టీపీసీ కంటితుడుపు చర్యలతో సరిపుచ్చుతుందన్నారు. ప్రజాప్రతినిధులకు ఇక్కడి సమస్యలను విన్నవిస్తున్న పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మీకు మొర పెట్టుకోవాల్సిన దౌర్బాగ్యం తలెత్తిందని కొందరూ మహిళలు రోదిస్తూ వివరించారు. ముంపు గ్రామాల సంక్షేమాన్ని పట్టించుకుంటున్నామని చెబుతున్న యాజమాన్యం మా ప్రాణాలకు కనీస భద్రతా చూపలేక పోతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎన్టీపీసీలోని ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగాలని, అదేవిధంగా తాగునీటి సరఫరా కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు తెలిపిన సమస్యలన్నింటిని ప్రతీ ఇళ్లు తిరుగుతూ సేకరించిన వివరాలన్నింటిని నివేదికగా మలిచి ప్రభుత్వానికి పంపిస్తామని, ఆ తరువాత నియంత్రణ కోసం ప్రణాళిక సిద్దం చేస్తామని బృందం సభ్యులు చెప్పారు. అనంతరం యాష్ పాండ్‌ను సందర్శించారు.

తెలంగాణ ప్రకటన..
దేశచరిత్రలోనే సంచలనం
బిజెపి సీనియర్ నేత విద్యాసాగర్‌రావు
జగిత్యాల, ఆగస్టు 17: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని రాజ్యాంగం ద్వారా పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణను ప్రకటించడం చారిత్రాత్మకమని బిజెపి సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం జగిత్యాలలోని ఎస్సారెస్పీ క్యాంప్‌లో గల కాడా గెస్టుహౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార ,ప్రతిపక్షాలు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై చేసిన ఆమోదం తీర్మాణాలకు తిరుగులేదన్నారు. పార్లమెంట్ ప్రకటనను వ్యతిరేకించడం పార్లమెంట్‌పై దాడి వంటిదని, తెలంగాణ ప్రకటన ఉపసంహరించుకోవాలని సీమాంధ్రులు వ్యతికించడం అనైతికమన్నారు. ఎన్నో యేళ్లుగా ఎందరో ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల వల్ల సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంద్రులు అడ్డుకోవడం అవివేకమన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటు తీర్మాణంను అడ్డుకుంటామని పేర్కొనడం అప్రజాస్వామికమని తెలంగాణ ఏర్పడితే ప్రత్యేకత సంతరించుకుంటుందని వెల్లడించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి స్వాగతిస్తుందని పార్టీలు వేరైనా కాంగ్రెస్‌ను అభినందిస్తున్నట్లు దిగ్విజయసింగ్ చెప్పిన ప్రతిసారి రెండో ఎస్సారెస్సీ లేదని తెలంగాణ ఏర్పాటే తరువాయి అని మాట మార్చకుండా ఘంటపథంగా వెల్లడిస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో చిన్నా చితక పార్టీలు సైతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏకీభవించాయని, ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్ధతును ఇస్తుందని, మిగతా పార్టీలు తెలంగాణకు మద్ధతు ఇవ్వాలన్నారు. అధికార, ప్రతి పక్ష పార్టీలు నిగ్రహం, సంయమనం పాటించాలన్నారు. 2006లో 3రాష్ట్రాల ఏర్పాటును చేస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో తీర్మాణించడం జరిగిందని, ఇందులో భాగంగానే 3రాష్ట్రాలు ఏర్పాటు చేశామన్నారు. చేసిన తీర్మాణాలను క్రమ పద్ధతిలో ఆమోదించడంలో తెలంగాణపై మాట్లాడలేదని,అటు తరువాత పార్టీ సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటు ఏజెండాను కాకినాడలో తీర్మాణం చేశామని వివరించారు. ఇదే విషయాన్ని బిజెపి ప్రభుత్వ హయాంలో కేంద్రహోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎల్‌కె అద్వాని ద్వారా పార్లమెంట్‌లో ప్రకటన చేయించామని గుర్తు చేశారు. ఆర్టికల్ 377ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉందని, ఇదే విషయాన్ని బిజెపి సీనియర్ నాయకులురాలు సుష్మాస్వరాజ్ వెల్లడించారన్నారు. ఏది ఏమైనా అన్ని ప్రాంతాల ప్రజలు, మేధావులు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం సహకరించాలని విద్యాసాగర్‌రావు కోరారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌కుమార్, బిజెపి నాయకులు బైర్నేని అజిత్‌రావు, జ్ఞానేశ్వర్, బొడ్డు పెద్దగంగారాం, రాగిల్ల సత్యనారాయణ, మోరపల్లి సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

కాలువలో కొట్టుకుపోయి..
చిన్నారి మృతి

ధర్మపురి, ఆగస్టు 17: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ఉప్పొంగిన సైడు కాలువ ఒక మూడేళ్ళ చిన్నారి జీవితాన్ని బలి తీసుకున్న హృదయ విదారక ఘటన ధర్మపురి మండలం రాజారం గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. అప్పటి వరకూ కొత్త గొడుగుతో ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి ఆయువు తీరడంతో రాజారంలో విషాద ఛాయలు అలుముకున్నాయ. రాజారంకు చెందిన నాటుకట్ల సత్తయ్య, కొమురమ్మకు గణేశ్ (12), అస్విత (3)అనే సంతానం ఉండగా, సత్తయ్య బ్రతుకు తెరువు కోసం ఏడాది క్రితం దుబాయి వెళ్ళాడు. కొమురమ్మ బీడీలు, కూలీ పనులు చేస్తూ భర్తకు సాయపడుతున్నది. శనివారం ఉదయం అమ్మ కొని తెచ్చిన కొత్త గొడుగుతో ఆడుతూ, పాడుతూ బయటకు వచ్చి, కొద్ది రూరంలో ఉండే తన పెద్దమ్మ కాంపెల్లి పోచమ్మ ఇంటికి బయలు దేరింది. డ్రైనేజి కాలువ దాటి వెళ్ళే క్రమంలో ఉదయంనుండి కురుస్తున్న వర్షంతో సైడు కాలువ ఉప్పొంగి పారగా, లోతు తెలియని చిన్నారి, దాటే ప్రయత్నంలో అకస్మాత్తుగా కొట్టుకు పోయింది. కొంత సమయమైనాక తమ కూతురు లేని విషయం గ్రహించిన కొమురమ్మ బయటకు వచ్చి చూసి, కాలువ పక్కన గొడుగు పడి ఉండడాన్ని గమనించి, కీడు శంకించి, బరువెక్కిన హృదయంతో గ్రామస్తుల సాయంతో వెతుకుతుండగా, అర కిలోమీటర్ కింది భాగాన నీటిగుండా వెళుతున్న జమీలా అనే మహిళ కాళ్ళకు మెత్తగా తాకగా, ఆమె ఇచ్చిన సమాచారంతో వెళ్ళి బయటకు వెదకగా, చిన్నారి మృతదేహం బయట పడింది. ధర్మపురి ఎస్‌ఐ జగన్‌మోహన్ కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించి, జగిత్యాలకు పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు,

తెలంగాణ ప్రక్రియ ఆగదు
నాలుగుకోట్ల ప్రజల సుందర స్వప్నం నెరవేరుతుంది
విడిపోయి కలసిమెలసి ఉండటం ఉత్తమం: ఎంపి పొన్నం
వేములవాడ, ఆగస్టు 17: సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రక్రియ ఆగదని,్భరతావనిలో సువర్ణ తెలంగాణ ఆవిష్కృతమైతదని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.శనివారం ఆలయ అతిథిగృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

హన్మంతరావుపై దాడి గర్హనీయం సీమాంధ్రలో పోలీసులు హింసను ప్రేరేపిస్తున్నారు విలేఖరుల సమావేశంలో ఎంపి పొన్నం ప్రభాకర్
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles