Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మహిళా సంఘాలకు 15 వేల కోట్లు వడ్డీలేని రుణాలు

$
0
0

పటన్‌చెరు, ఆగష్టు 17: రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందులో సభ్యులైన మహిళలకు 15 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని ఋణాలుగా అందించిందని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి వాకిట సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మహిళా అభ్యుదయమే ధ్యేయంగా ముందుకు కదులుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సంక్షేమానికే పెద్దపీట వేసిందన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాంకుల లింకేజి ద్వార వడ్డీ లేని ఋణాలు అందించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పటన్‌చెరులోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సుమారు 31 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్ర్తి శక్తి భవనాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. అంతేకాకుండా దాదాపు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పశు వైద్యశాల భవనానికి స్థానిక ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తో కలిసి ప్రారంభోత్సవము చేసారు. ఈ సంధర్బముగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో స్ర్తిలకు 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలలో సైతం ఆడవారికే అగ్రస్థానాన్ని అందించిందని కొనియాడారు. ప్రస్తుతం విజయం సాధించిన సర్పంచులలో అధిక సంఖ్యలో అనగా సగానికిపైగా మహిళలే ఉండడం ఆదర్శనీయమన్నారు. ప్రభుత్వం ద్వార అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరింతగా రాణించాలని మంత్రి వాకిట సునీతా లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల ప్రవేశ పెట్టిన అభయహస్తం పధకం ద్వార 52 లక్షల మందిగి ఫించన్లు సరఫరా చేయడం జరుగుతోందన్నారు. ఈ పధకం క్రింద పటన్‌చెరు మండలానికి చెందిన 712 మందికి నూతనంగా ఫించన్లు అందచేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బంగారుతల్లి పధకానికి మంచి ప్రజాదరణ లబిస్తోందని అన్నారు. దీని ద్వార 11 లక్షల మంది ఆడపిల్లలకు 142 కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్ రూపంలో అందించడం జరిగిందని తెలిపారు. ఇంతేకాకుండా 30 వేల మందికి కొత్తగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. భర్త చనిపోయిన వారికి వెంటనే 30 వేల రూపాయలు జాతీయ ఫించను పధకం ద్వార అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దారిద్యరేఖకు దిగువన ఉన్న ఆడపిల్లలు చదువులకు దూరం కాకుండా వారికి అన్నిరకాలుగా అవసరమైన చేయూతను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ పటన్‌చెరు నియోజకవర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వార మొత్తం మూడు స్ర్తి శక్తి భవనాలు నిర్మించామన్నారు. ఒక్కో భవనానికి 31 లక్షల రూపాయలు నిధులు కేటాయించారన్నారు. మొదట పటన్‌చెరు మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసిన భవనాన్న మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని, వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో పధకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో మహిళా భవనాలను నిర్మించి స్వయం సహాయక సంఘాలకు చెందిన సభ్యులు తమకు అవసరమైన సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకోవడానికి సదావకాశాన్ని కల్పిస్తోందన్నారు. రాజకీయ రంగలోను ఆడవారే అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించిన ప్రభుత్వం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించదన్నారు. దీనితో మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను 11 మంది సర్పంచులు మహిళలే కావడం గర్వించదగిన అంశమన్నారు.
నిర్ణయాత్మకమైన శక్తిగా మహిళలు
మహిళలు నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగాలని జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు ఆకాంక్షించారు. స్ర్తి శక్తి భవనాలు డ్వాక్రా మహిళలు, ఆయా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు దినకర్‌బాబు సూచించారు. ప్రభుత్వం ద్వార అందుతున్న పలు పధకాలను అందిపుచ్చుకుని వారు మరింత ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని రంగాలలో స్ర్తిలదే అగ్రస్థానంగా ఉంటుందన్నారు. ఆర్థిక పరిపుష్టిని సాధించడం ద్వార సంసారమనే నావను సరైన మార్గంలో పయనించడానికి వారు అవసరమైన సహాయ సహకారాలు కుటుంబ పెద్దకు అందించాలని ఆయన కోరారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా బ్యాంకుల ద్వార ఋణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించడంలో వారికే వారే సాటి అన్నారు. లక్షల రూపాయలు ఋణాలుగా బ్యాంకుల లింకేజి ద్వార పొందుతున్న స్వయం సహాయక సంఘాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ రామచంద్రారావు, ఇంఛార్జ్ తహసీల్దారు శివప్రసాద్, మండల అభివృద్ధి అధికారి గంగయ్య, జిల్లా విధ్యాధికారి రమేష్, సర్పంచులు శివానందం, సుంకరి రవీందర్, లక్డారం సర్పంచ్ బుద్దె ప్రభు, బురిగారి విజయలక్ష్మి వెంకటరెడ్డి, ఘనాపూర్ సర్పంచ్ ముత్తంగి విఠలయ్య. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలి
* పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి,ఆగస్టు 17: పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ జి.విజయ్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించి వివిధ కేసుల నమోదు దర్యాప్తు పురోగతులపై సమీక్షించారు. దొంగతనాలు జరగకుండా ప్రతి ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహించాలని, పాత నేరస్తులపై నిఘా పెట్టాలని సూచించారు. మతపరమైన ప్రదేశాలను గుర్తించి ప్రతి రోజు పెట్రోలింగ్ నిర్వహించాలని, మత ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.

తెలంగాణను అడ్డుకోవద్దు
* అభివృద్ధిని ఆపొద్దు
* ర్యాలీలో నేతల డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి,ఆగస్టు 17: తెలంగాణకు అడ్డుకోకుండా రెండు రాష్ట్రాలుగా ఏర్పడి అభివృద్ధి దిశలో పయనించేందుకు సీమాంధ్రులు సహకరించాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వై.అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి ఐబి వరకు బైక్ ర్యాలీని నిర్వహించిన అనంతరం పాత బస్టాండ్‌లో గల అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా చేరి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. టిఆర్‌ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సమయంలో కాంగ్రెస్ నేతలు నోరు మూసుకుని ఇప్పడం గగ్గోలు పెట్టడం దారుణమైన విషయమన్నారు. 2009లో టిడిపి కూడా టిఆర్‌ఎస్‌తో పొత్తు పొట్టుకుని లబ్ధి పొందాలని చూసి ఇప్పడు నాటకాలాడుతోందని విమర్శించారు. ఇటీవలే పుట్టిన వైఎస్‌ఆర్‌సిపి కేవలం సీమాంధ్రలో ఉనికి కోసం నాటకాలాడుతోందన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యమాన్ని వెనుక ఉండి కొనసాగిస్తోందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న టిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ విడిపోవడానికి ఉద్యమాలు జరిగిన సందర్భాలు ఉన్నాయే తప్పా కలిసి ఉండడానికి ఎక్కడా కూడా ఆందోళనను చూడలేదన్నృరు. బిజిపి నేత ఏ విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఏర్పాటు చేస్తూ పార్లమెంట్‌లోవెంటనే బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత ఎం రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగులు సకాలంలో సమ్మె విరమణకు స్పందించని తరిమికొడతామని హెచ్చరించారు. వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టని పక్షంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల సమ్మె తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర నేతలు హింసను ప్రేరేపిస్తూ ప్రజలను భయభ్రాంతుకు గురి చేస్తూన్నారని పేర్కొన్నారు. ఉద్యోగులను రెచ్చగొడితే సీమాంధ్ర ఉద్యోగులను తరమికొడతామన్నారు. టిజెఏసి నేతలు అనంతయ్య, బాల్‌రెడ్డి లు మాట్లాడుతూ ఉద్యోగులు విభజనకు సహకరించాలని కోరారు. ఈ కార్యలీలో డిగ్రీ కళాశాలల విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులు పలు శాఖల ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర నేతలు రాజేందర్‌నాయక్, గౌతంరెడ్డి, నాని, జలంధర్‌రావు, దుర్గారెడ్డి, వాణి, ప్రకాష్, సురేష్, ఉపాధ్యాయనాయకులు వేణుగోపాల స్వామి, ఎం సంజీవయ్య, రాములు, నాజర్ పాటిల్, గద్దర్ నర్సింలు, సంగారెడ్డి నియోజకవర్గ నేతలు చంద్రశేఖర్, కుమ్మరి సాయిలు, బీరయ్య యాదవ్, చంద్రారెడ్డి, ఎంపిజె నేత ఎంజి అన్వర్, రాజశేఖర శర్మ, అంజద్, అనురాధా, బుచ్చిబాబు, వాసు, రవి, శ్యాంరావు, రాఘవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఎంపి వి హనుమంతరావుపై కొంత మంద వ్యక్తులు చేసిన దాడిని టిజెఏస నేతలు తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో
మెరుగైన సేవలు
* కలెక్టర్ దినకర్‌బాబు
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఆగస్టు 17: జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఏ దినకర్ బాబు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో కొలంబియా యూనివర్శిటీ ప్రతినిధులతో వైద్య ఆరోగ్యంపై కలిసి సమీక్షను నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అన్ని రకాల ఆధునీక వసతులను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే విధంగా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఆశా వర్కర్లకు, కాంట్రాక్టు సిబ్బందికి కూడా బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 12 ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు పరిస్థితిని సమీక్షించడం జరుగుతోందన్నారు. ఆసుపత్రుల్లో సిసి కెమెరాలతో పాటు 104, 108 వాహనాల్లో జిఆర్‌పిఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసి కదలికను కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రంగారెడ్డి, ఎన్‌ఆర్‌హెచ్ ఎండిపివో జగన్నాథరెడ్డి , ఇతర ప్రతనిధి మెథస్ టౌర్ పాల్గొన్నారు.

ప్రజావ్యతిరేక ప్రభుత్వం కనుమరుగు ఖాయం
- బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ -
జగదేవ్‌పూర్, ఆగస్టు 17: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ త్వరలో కనుమరుగు కావడం ఖాయమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం తీగుల్ నర్సాపూర్‌లోని శ్రీ కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో 3వ ఫ్రంట్ ఏర్పాటయ్యే ఆవకాశాలు మెరుగు పడుతుండగా, నరేంద్రమోడీ భారత ప్రధానిగా కావాలని దేశ వ్యాప్తంగా యువత కోరుకుంటోందని స్పష్టం చేశారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచి బిజెపి అధికారం చేపట్టడం ఖాయం కాగా, ప్రధానిగా మోడీ బాధ్యత చేపడుతారని జోస్యం చెప్పారు. ముఖ్యంగా యూపిఎ సర్కార్ బొగ్గు, భూకుంభకోణా లలోకూరుకుపోగా, ఓట్లు, సీట్ల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన రాహుల్‌ను ప్రధాని చేయలేరని ఎద్దేవాచేశారు. కాగా తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో ఎప్పుడు బిల్లు పెట్టినా మద్ధతు ఇవ్వడానికి బిజెపి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో నేతలు నాగేశ్వర్‌రావు, నరేష్‌బాబు, కుమారస్వామి, కప్పర ప్రసాదరావు, పేర్ల శ్రీనివాస్, ఉప్పల మధుసూదన్, బుద్దసత్యం, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల కోసం రైతుల ధర్నా
గజ్వేల్, ఆగస్టు 17: గజ్వేల్ పట్టణంలోఎరువుల కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. సాగుకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచకపోవడంతో గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, దౌల్తాబాద్, చేగుంట తదితర మండలాలకు చెందిన అన్నదాతలు ప్రతినిత్యం గజ్వేల్ చేరు కుంటున్నప్పటికి ఆరకొర మాత్రమే అందుతోంది. అయితే యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహించిన రైతులు గజ్వేల్ మార్కెట్ యార్డుతోపాటు తూప్రాన్ రోడ్డు లో ధర్నా, రాస్తారోకోకు దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం ప్రకటించి ఆందోళనకు మద్ధతు పలికారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం చెందగా, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచక పోవడంతో బ్లాక్ మార్కెట్‌ను అశ్రయించి రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని విమర్శించారు. ముఖ్యంగా ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే ఈ దుస్థితి నెలకొనగా, ఇప్పటికైనా స్పందించి వ్యవసాయ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులు, టిడిపి నేతల కు నచ్చజెప్పడంతోపాటు అధికారుల నుండి హామీ ఇప్పించడంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నేతలు మెట్టయ్య, విరాసత్ అలి, బొల్లారం ఎల్లయ్య, హన్మంతరెడ్డి, ఆర్‌కె శ్రీనివాస్, మతీన్, నయ్యర్ పఠాన్, షర్ఫొద్దిన్, సుబాష్, ప్రసాద్‌లు పాల్గొన్నారు.

ఆలోచింప చేసిన చిన్నారుల ప్రయోగాలు
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 17: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు ప్రేరణ విద్య వైజ్ఞానిక సదస్సులో ప్రస్ఫుటమైనాయి. వివిధ ఆంశాల్లో విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు ఆలోచింప చేసేలా ఉన్నాయి. చిన్నారులు ప్రదర్శించిన ఆంశాలు అందరిని అబ్బుర పరిచాయి. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య పరిష్కారానికి విద్యార్థులు సోలార్ విద్యుత్ తయారీ ఉపయోగాలను ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. విద్యుత్ సరఫరా లేని సమయంలో తుంపరసేద్యం ద్వారా పొలాలను తడిపే ప్రదర్శన ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ, వర్మికంపోస్టు, విమానం పనిచేసే తీరు విద్యార్థులను ఆకర్శించాయి. సమతుల ఆహారం వల్ల కలిగే లాభాలు, రసాయనిక ఎరువులు వాడడం వల్ల నష్టాలు, సేంద్రీయ ఎరువుల వల్ల కలిగే ఉపయోగాలు, ద్రవవర్మి కంపోస్టు తదితర ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో డివిజన్‌లోని 318 ప్రదర్శనలు, సంగారెడ్డి డివిజన్ నుంచి 52పాఠశాలల నుంచి 360 ప్రదర్శనలు వచ్చాయి. ప్రతి పాఠశాల నుంచి ఒక ప్రదర్శనతో పాటు సంబంధిత ఉపాధ్యాయుడు హాజరైనారు. విద్యార్థులకు 3రోజులు భోజన, మంచినీటి వసతి కల్పించారు. డిఇఓ రమేశ్ , డిప్యూటి ఇఓ మోహన్, ఎంఇఓలు ప్రసూనాదేవీ, రఘోత్తంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎన్‌సిసి విద్యార్థులు ప్రదర్శనకు వచ్చే విద్యార్థులను వరుసగా పంపేందుకు కృషి చేశారు.

నిరంతరాయ విద్యుత్
సరఫరా కోసం రాస్తారోకో
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 17: నిరంతరంగా వ్యవసాయ బావులకు 7గంటలు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది సబ్‌స్టేషన్ ముందు రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. సిద్దిపేట -సిరిసిల్ల రోడ్డు మీద శనివారం విద్యుత్ అధికారుల నిర్లక్షానికి నిరసనగా రైతులు ఆందోళన చేశారు. సుమారు గంట సేపు రైతులు సబ్ స్టేషన్ ముందు రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న ఇంచార్జి ఎస్‌ఐ సత్యనారాయణ, ఎఇ శ్రీనివాసులు రైతులకు నచ్చచెప్పారు. పగటిపూట 7గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.

* శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>