Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రాష్ట్ర విభజన సోనియా రాజకీయ రాక్షస క్రీడ

$
0
0

విజయవాడ , ఆగస్టు 18: రాష్ట్రాన్ని విభజించడం సోనియాగాంధీ రాజకీయ రాక్షస క్రీడ అని, సోనియాకి రాజకీయ అవగాహన లేదన్న విషయం ఈ విభజన వల్ల తేటతెల్లమవుతోందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సోనియా ముక్కలు చేస్తోందని, సమైక్యత కోల్పోయిన రోజున ప్రతి రాష్ట్రం టెర్రరిస్టులు, తీవ్రవాదుల వశమవుతుందని అన్నారు. విభజన జరిగితే తెలుగుజాతి ఒక్కటే అని ఎలుగెత్తి తెలుగువారి గొప్పదనాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ ఆశయానికి భగ్నం కలిగినట్లేనని అన్నారు. విభజనతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని అన్నారు. భవిష్యత్‌లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అధికారంలోకి రాలేరని అన్నారు. రాష్ట్ర విభజనకు జరిగిన తెలంగాణ ఉద్యమానికి చంద్రబాబు ఆజ్యం పోశాడని అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ జాతీయ నాయకులు వేరే రాష్ట్రాల వారేనని, వారు తెలుగు మాట్లాడే ఈ రాష్ట్ర సంక్షేమాన్ని ఎలా కాంక్షిస్తారని అన్నారు. ఈ విభజన ప్రక్రియను రాష్ట్రంలోని వారే గాదు దేశం, యావత్ ప్రపంచంలోని తెలుగువారంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఏదేమైనా అసెంబ్లీలో తీర్మానం జరగాలని, కానీ అది వీగిపోతుందని అన్నారు. ఐదున్నర దశాబ్దాల క్రితం జరిగిన జరిగిన పోరాటం వేరు, ఇప్పటిది వేరు అన్నారు. బూటకపు, నాటకీయ రాజకీయాలతో విభజన జరిగితే సీమాంధ్ర శ్మశానం అవుతుందని, రక్తం ధారపోసి అభివృద్ధిపరచిన మనం సీమాంధ్ర అభివృద్ధికి ఎన్ని సంవత్సరాలు కృషి చేయాలని, ఎందరు రక్తాన్ని చిందించాలని ప్రశ్నించారు. ఈ విభజన ప్రక్రియ ఆపగలిగే ఎన్టీఆర్ వంటి ఒక్క మగాడు ఈ రాష్ట్రంలో లేడా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర రాష్ట్ర సమతిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జలీల్‌ఖాన్, జిల్లా అధ్యక్షుడు పి.విజయకుమార్, కోశాధికారి రాచమడుగు బన్సీ పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని విభజించడం సోనియాగాంధీ
english title: 
rakshasa kreeda

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>