విజయవాడ, ఆగస్టు 18: ఇప్పటికి రెండు మాసాలు జాప్యం జరిగినా హైకోర్టు జోక్యంతో సోమవారం నుంచి ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి కౌనె్సలింగ్ ప్రక్రియను యధావిధిగా కొనసాగించాల్సిందేనంటూ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్‌జైన్ ఇతర ముఖ్య అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు పాటిటెక్నిక్ అధ్యాపకులు శనివారం నుంచి సమ్మెలో దిగుతున్నారు. అవసరమైన సిబ్బందిని ఇతర ప్రాంతాల నుంచైనా రప్పించుకోమని అధికారులు సూచిస్తున్నారు. ఇక మరోవైపు విద్యార్థి జెఎసి, పలువురు ఆందోళనకారులు మాత్రం కౌనె్సలింగ్‌ను వాయిదా వేయాలని కోరుతున్నారు. అవసరమైతే అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికే జాప్యం జరిగింది, ప్రశాంతంగా కౌనె్సలింగ్ జరిగేందుకు తోడ్పడాలని కోరుతున్నారు. డబ్బున్నవారు డీమ్డ్ వర్శిటీ కళాశాలల్లోను, ప్రైవేట్ కళాశాలల్లోను సీట్లను రిజర్వ్ చేసుకున్నారు. కొన్ని కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఆరు మాసాలకోసారి సెమిస్టర్ పరిక్ష జరుగుతుంది. కౌనె్సలింగ్ వాయిదా వల్ల సిలబస్ పూర్తి కాకుండా పరీక్ష ఎలా రాయగలమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. జిల్లాలో 37 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. జిల్లాలో 27 వేల మంది ఎంసెట్ ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 15 వేల మంది స్థానికేతరులు కాగా, 12 వేల మంది స్థానికులు. ఇక కౌనె్సలింగ్ కోసం జిల్లా మొత్తంపై ఒక్క విజయవాడలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల, ఆంధ్ర లయోలా కళాశాల మొత్తం మూడుచోట్ల హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా ఈ సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 19 నుంచి 30వ తేదీ వరకు సర్ట్ఫికెట్ల పరిశీలన, 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు, 4న సవరణ, 5న సీట్ల కేటాయింపు జాబితాల విడుదల జరుగుతుంది. దీంతో కౌనె్సలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇప్పటికి రెండు మాసాలు జాప్యం జరిగినా హైకోర్టు జోక్యంతో
english title:
counselling
Date:
Monday, August 19, 2013