విజయవాడ, ఆగస్టు 18: పరిసరాల్లోని వాగులు, వంకల నుంచి శరవేగంతో చేరుతున్న వరద నీటితో పాటు రెండో రోజులుగా సాగర్ గేట్లు పైకి ఎత్తడంతో వరద నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో రోజు కూడా గేట్లు ఎత్తే ఉంచారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 50 గేట్లు మూడు అడుగులు, మిగిలిన 20 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి లక్షా 30 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మిగిలిన 12 వేల 744 క్యూసెక్కుల నీటిలో తూర్పు డెల్టాలో కాల్వలోకి 8359 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా కాల్వలో 4227 క్యూసెక్కులు, గుంటూరు చానెల్‌కు 158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పరిసరాల్లోని వాగులు, వంకల నుంచి శరవేగంతో
english title:
varada potu
Date:
Monday, August 19, 2013