జగదేవ్‌పూర్, ఆగస్టు 18: రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ ముఖ్య నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో ఆదివారం సుదీర్ఘ మంతనాలు జరిపారు. మెదక్ జిల్లా శివారు వెంకటా పూర్‌లోని కెసిఆర్ ఫాంహౌస్‌లో సుమారు 8గంటల పాటు జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి అభిప్రాయం పరిగణలోకి తీసుకున్న కెసిఆర్ తిరుపతిలో విహెచ్‌పై సీమాంధ్రుల దాడి, జెఎసి చేపట్టే నిరసన కార్యక్రమాలకు టిఆర్‌ఎస్ మద్దతు, కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్ విలీనంపై ప్రధానంగా చర్చ జరిగింది. కాగా సీమాంధ్రుల ఆందోళనను తిప్పికొట్టే విధంగా చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించి జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పార్టీ శ్రేణులు రెచ్చిపోకుండా ఉంటూనే ఉద్యమ కార్యాచరణపై దృష్టి సారించే విధంగా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆమలు చేయాలని, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు సీమాంధ్రకు చెందిన టిడిపి, కాంగ్రెస్, వైఎస్సార్ సిపి నేతల చర్యలను గమనిస్తూ స్పందించాలని నిర్ణయించారు. టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎంపిలు మంద జగన్నాథం, వివేక్, మాజీ ఎంపి వినోద్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి , కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జోగు రామన్న, సత్యనారాయణ, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, మహ్మద్ అలి, సుధాకర్‌రెడ్డి, నేతలు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, లక్ష్మి కాంతారావు, దేశపతి శ్రీనివాస్, మెదక్, ఖమ్మం, గ్రేటర్ హైద్రాబాద్ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై టిఆర్‌ఎస్ అధినేత
english title:
trs
Date:
Monday, August 19, 2013