Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

త్యాగం చేసిన గంపనే గెలిపిద్దాం

$
0
0

భిక్కనూరు, మార్చి 3: తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను ఈ ఉప ఎన్నికలో గెలిపిద్దామని రామా యంపేట మాజీ ఎమ్మెల్యే పద్మాదే వేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆమె భిక్కనూరు మండలం జంగంపల్లి, పొందూర్తి, శివాయిపల్లి, గ్రామాలలో నిర్వహించిన ఇంటింటా ప్రచార కార్యక్రమంలో అమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాద యాత్ర ద్వారా ప్రచారం చేశారు. కనబడిన వారందరి వద్దకు వెళ్తూ దండం పెడుతూ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని అభ్యర్థిం చారు. తెలంగాణ వాదానికి ద్రోహులకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో త్యాగ ధనుడైన గంప గోవర్ధన్ అన్నను గెలిపిస్తే తెలంగాణ సెగ ఢీల్లీకి తాకుతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కారు. గుర్తుకు ఓటు వెయ్యాలని విస్తృత ప్రచారం నిర్వహంచారు. ఆమె వెంట టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు కమలాకర్‌రావు, నాయకులు మల్లిఖా ర్జున్‌గౌడ్, మెంతుల గంగాధర్, మంగ రమేశ్‌గౌడ్, మంద సత్యం, సావుసాని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్షన్ల కోసమే ఉప ఎన్నికలు
కెసిఆర్‌పై విజి గౌడ్ ధ్వజం

భిక్కనూరు, మార్చి 3: కలెక్షన్లు వసూల్ చేసేందుకే ఈ ఉపఎన్నికలను తెచ్చాడని జిల్లా టిడిపి అధ్యక్షులు ఎమ్మెల్సీ వి. గంగాధర్‌గౌడ్ టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పై ధ్వజమెత్తారు. శనివారం ఆయన భిక్కనూరు మండలం రాజంపేటలో కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి నిట్టు వేణుగోపాల్‌రావుతో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం కోరుకున్న ఎన్నికలు కావని, రాజకీయ లబ్దికోసం జరుగుతున్న ఎన్నికలన్నారు. సంఖ్యా బలం పెంచుకోవడంతో పాటు యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ వద్ద ప్యాకేజిలు తెచ్చుకునేందుకె కెసిఆర్ ఈ నాటకాలు ఆడుతున్నారని మండి పడ్డారు. సకలజనుల సమ్మె 42 రోజులు విజయవంతంగా సాగుతున్న సమయంలో ప్రదాన మంత్రి మన్మోహన్ సింగ్ హైదరాబాద్ వచ్చి తెలంగాణ పై తెల్చే సమయంలో సకలజనుల సమ్మెను అర్ధాంతరంగా నీరుగార్చాడని విమర్శించారు. ముడుపుల కోసమే కన్న తల్లి లాంటి టిడిపిని వీడి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టిఆర్‌ఎస్‌లో చేరాడని అరోపించారు. కేంద్రంలోని ప్రణబ్ ముఖర్జికి తెలంగాణకు టిడిపి అనుకూలంగా ఉందని లేఖ అంద జేసిన విషయాన్ని మరచిపోయి టిఆర్‌ఎస్ నేతలు మళ్ళీ లేఖ ఇవ్వాలని పట్టు బట్టడంలో అర్థం లేదంన్నారు. తెలంగాణకు టిడిపి వ్యతిరేఖం కాదని, మొదటి నుంచి తెలంగాణకు అనుకూలమని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేస్తూనే ఉన్నాడన్నారు. ప్రస్తుత పరిస్థితులలో టిడిపి కాంగ్రెస్‌ల కంటే తమ పార్టీయె ఉద్యమంలో ముందుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిత్యవసరాల వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. కాంగ్రెస్, టిడిపిలను ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
మోసం చేస్తున్న ప్రభుత్వం
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్‌ఎస్‌లను తరిమికొట్టాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో దోచుకు తింటుందని విమర్శించారు. తెలంగాణ పేరుతో టిఆర్‌ఎస్ పార్టీలను మోసం చేస్తుందని ఆ పార్టీని నమ్మి ఓట్లు వేయవద్దని సూచించారు. టిఆర్‌ఎస్‌తో తెలంగాణ సాధ్యం కాదని తెలిపారు. టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదని 2009లోనే తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు సంతకం చేశాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో 700 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీ తరపున ఏ ఒక్కరికి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. ఈ ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
అసమర్థ నాయకున్ని తిప్పి కొట్టాలి
అసమర్థ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను ఈ ఎన్నికల్లో తిప్పి కొట్టాలని కామారెడ్డి టిడిపి అభ్యర్థి నిట్టు వేణుగోపాల్‌రావు పిలుపునిచ్చారు. రెండున్నర సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పని చేసి నియోజక వర్గంలో ఎటువంటి అభివృద్ది చేపట్టలేదని విమర్శించారు. తనకు అవకాశం కల్పిస్తే నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పరుస్తానని హమి ఇచ్చారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మదన్ మోహన్, మండల టిడిపి ఇన్‌చార్జి నందన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ చీల ప్రబాకర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పున్న రాజేశ్వర్, మాణిక్యరెడ్డి, టిడిపి మండ శాఖ అధ్యక్షులు పి.మహిపాల్‌రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు తక్కళ్ళ శ్యాంరెడ్డి, పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లింగంపేట యాదగౌడ్, బస్వాపూర్ విండో చైర్మెన్ నాగన్నగారి ప్రతాప్‌రెడ్డి, పెద్దమల్లారెడ్డి విండో చైర్మెన్ బండి బాలాగౌడ్, నాయకులు బత్తుల లక్ష్మీ నర్సింలు, గోండ్ల సిద్దరాములు, కెవి సుబ్బారావు, శ్రీరాం సురేశ్, కందడి బాల్‌రెడ్డి, శేర్ల లక్ష్మన్, దుడ్డె రాజయ్య, నీలం రెడ్డి, రవిందర్‌గౌడ్, సాయి రెడ్డి, పోతి రెడ్డి, లింగ రెడ్డి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>