Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిండుకుండలా సూరంపాలెం జలాశయం

$
0
0

రాజమండ్రి, ఆగస్టు 19: తూర్పు ఏజన్సీలోని సూరంపాలెం మధ్యతరహా సాగునీటి జలాశయం నిండు కుండలా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఏజన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సూరంపాలెం రిజర్వాయరు ప్రాజెక్టులోని నీరు వచ్చి చేరటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయికి నీటిమట్టం చేరుకుంటోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 105మీటర్లయితే, సోమవారం సాయంత్రానికి 104.9మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. దాంతో మంగళవారం ఉదయం నుండి ప్రాజెక్టు స్పిల్‌వేకు ఉన్న 4గేట్లలో ఒక గేటును 10సెంటీమీటర్లు పైకి ఎత్తి మిగులు నీటిని దిగువకు విడుదలచేయాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం గ్రామానికి, చుట్టుపక్కల ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. మిగులు నీటిని విడుదలచేసే అవకాశం ఉందన్న విషయాన్ని ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందించినట్టు సూరంపాలెం ప్రాజెక్టు అధికారులు చెప్పారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే, అందుకు అనువుగా ప్రాజెక్టు జలాశయాన్ని సిద్ధంచేయాలని, అందువల్ల ఉన్న నీటిలో కొంత నీటిని దిగువకు విడుదలచేయక తప్పదని ప్రాజెక్టు అధికారులు చెప్పారు.
రెట్టించిన ఉత్సాహం!
*ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యోగ, ప్రజా సంఘాలు*ఎంసెట్ కౌనె్సలింగ్‌ను అడ్డుకున్న సమైక్యవాదులు*కాకినాడలో విశాలాంధ్ర మహాసభ ఆందోళన* టిడిపి రిలే దీక్షలు
కాంగ్రెస్ అన్నదానం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 19: సమైక్యాంధ్ర ఉద్యమం సోమవారం ఉవ్వెత్తున ఎగసిపడింది... సుమారు 12 ఉద్యోగ సంఘాలు, పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు జిల్లా కేంద్రంలో సమైక్య గళాన్ని ఎలుగెత్తి చాటాయి... మరోవైపు విశాలాంధ్ర మహాసభ సమైక్య యాత్ర ప్రజలను చైతన్యవంతులను చేసింది... సోమవారం నుండి ప్రారంభం కావల్సిన ఎంసెట్-13 కౌనె్సలింగ్‌ను ఉద్యోగ జెఎసి అడ్డుకుంది. జిల్లా కేంద్రం అడుగడుగునా నిరసన ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలతో అట్టుడికింది. సమైక్య ఉద్యమానికి మద్దతుగా విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సమైక్య యాత్ర నిర్వహించారు. యాత్రకు సారథ్యం వహిస్తోన్న పరకాల ప్రభాకర్ కాకినాడ నగరానికి రానప్పటికీ మహాసభకు చెందిన ప్రతినిధులు జిల్లా కేంద్రం కాకినాడలో పర్యటించారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన మహాసభ ప్రతినిధి నల్లమోతు చక్రవర్తి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. తాను తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడనైనా సమైక్యాంధ్ర కోసమే ఉద్యమిస్తున్నానని, కెసిఆర్, సోనియాగాంధీలు తెలుగు ప్రజలకు ప్రథాన శత్రువులుగా మారారని ఆరోపించారు. విభజించు, పాలించు అనే సిద్ధాంతాన్ని బ్రిటీషు వారు అమలుచేసేవారని, ప్రస్తుతం సోనియాగాంధీ సైతం అదే సిద్ధాంతంతో సాగుతున్నారని ఎద్దేవా చేశారు. హైకోర్టు న్యాయవాది, విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి రవితేజ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల చేతకాని తనం వల్లే నేడు రాష్ట్ర విభజన వాదం వచ్చిందన్నారు. 2009లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చినపుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నేతలు దీక్షలు చేస్తున్నారని, చేతనైతే వారి రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు దీక్షలు చేపట్టాలని హితవు పలికారు. విశాలాంధ్ర మహా సభ ప్రతినిధి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆంటోనీ కమిటీ రాజ్యాంగేతర కమిటీ మాత్రమేనని, ఈ కమిటీని బహిష్కరించాల్సిందిగా సీమాంధ్రులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం కాకినాడలో జరుగుతున్న జెఎసి దీక్షలకు, జెఎన్‌టియు విద్యార్థి జెఎసి దీక్షలకు మద్దతు ప్రకటించారు. కాకినాడలోని ఎన్‌టియులోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం ఉదయం 9 గంటల నుండి ఎంసెట్-2013 కౌనె్సలింగ్ ప్రక్రియను వర్సిటీ అధికార్లు ప్రారంభించారు. కాగా సుమారు 10 గంటల ప్రాంతంలో ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో సమైక్యవాదులు కౌనె్సలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ కౌనె్సలింగ్ ప్రక్రియను అడ్డుకున్నారు. వర్సిటీ అధికారుల తీరుపై సమైక్యవాదులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వర్సిటీ బయట రిలే దీక్షలు నిర్వహిస్తున్న విద్యార్థి జెఎసి సైతం కౌనె్సలింగ్ నిర్వహణ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కౌనె్సలింగ్ ప్రక్రియను అడ్డుకున్న రెవెన్యూ తదితర శాఖలకు చెందిన 16 ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమైక్యవాదుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వమే ఎంసెట్ కౌనె్సలింగ్‌ను నిలిపివేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జివిఆర్ ప్రసాదరాజు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియజేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు కౌనె్సలింగ్ నిర్వహించి నిలిపివేశామన్నారు. మళ్ళీ ఎప్పుడు నిర్వహించేదీ ప్రభుత్వమే ప్రకటించాల్సి ఉందని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్ కాలేజీ, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో సైతం కౌనె్సలింగ్ నిర్వహించాల్సి ఉండగా సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడంతో ఈ రెండు చోట్ల సైతం కౌనె్సలింగ్ నిలిచిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్ వద్ద నిరసన దీక్ష, వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జెఎసి దీక్షకు ప్రగతి విద్యార్థులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులు, నర్సింగ్ విద్యార్థినులు, న్యాయశాఖ ఉద్యోగులు, పశుసంవర్ధక శాఖ, గోపాలమిత్ర సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి మద్దతు తెలియజేసి, భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భానుగుడి జంక్షన్‌లో అన్నదానం చేశారు.
నిరవధిక సమ్మెలోకి న్యాయశాఖ ఉద్యోగులు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్టు 19: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయశాఖ ఉద్యోగులు సోమవారం నుండి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లోని న్యాయస్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉదయం కోర్టు కార్యాలయాల వద్దకు చేరుకుని, కార్యాలయాలకు తాళాలు వేసి సంబంధిత న్యాయాధికారులకు అప్పగించిన అనంతరం నిరవధిక సమ్మె శిబిరాలకు చేరుకున్నారు. అనంతరం సమైక్యాంధ్ర వర్ధిల్లాలంటూ నినాదాలు చేసారు. ఇప్పటికే గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్‌జిఓలు, మున్సిపల్ ఉద్యోగులు కోర్టుల వద్దకు వెళ్లి న్యాయశాఖ ఉద్యోగులతో కలిసి జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేసారు. రాజమండ్రిలో ఆర్టీసీ అద్దె బస్సులతో బస్సుల యజమానులు, ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా గోకవరం బస్టాండు సెంటరుకు చేరుకుని న్యాయశాఖ ఉద్యోగులు, ఎన్‌జిఓలు, మున్సిపల్ ఉద్యోగులను బస్సుల్లో ఎక్కించుకుని నగరమంతా ప్రదర్శన నిర్వహించారు. కాకినాడలో కూడా ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే కాకినాడ జెఎన్‌టియులో జరుగుతున్న ఎమ్సెట్ కౌన్సిలింగ్‌ను అడ్డుకున్న ఉద్యోగుల నాయకులను పోలీసులు అరెస్ట్ చేయటంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అరెస్ట్ చేసిన ఉద్యోగులను విడుదలచేయటంతో ఉద్యోగులు వెనక్కు తగ్గారు. కోరుకొండ మండలం నుండి కొంత మంది రెవెన్యూ ఉద్యోగులు పాదయాత్రగా రాజమండ్రి వచ్చి, నిరసన ప్రదర్శనలు చేసారు.
రాజమండ్రిలో సలాది సత్తిబాబు అనే ఉద్యమకారుడు నల్ల దస్తులు ధరించి నాగదేవి థియేటర్ సెంటరులోని గాంధీ మహాత్ముడి విగ్రహం చుట్టూ ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు సమైక్యాంధ్రను కోరుతూ వౌనంగా ప్రదక్షిణలు చేసారు. బాపూ! ఇటాలియన్ గాంధీ నుండి తెలుగు వారిని, సమైక్యాంధ్రను రక్షించాలంటూ ప్లే కార్డును భుజాన వేసుకుని మంచినీళ్లు కూడా తాగకుండా చేసిన ఈ ప్రదక్షిణలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అమలాపురంలో కొబ్బరి వర్తకులు, నూనె మిల్లుల యజమానులు రిలేదీక్షలు చేసారు. కోనసీమలో ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో సమైక్యాంధ్రను కోరుతూ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు జరిగాయి. రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం కోటగుమ్మం సెంటరులోని రిలే దీక్షలు చేపడితే, మరోవర్గ ప్రత్యేకంగా 50వార్డుల్లోను దీక్షా శిబిరాలను ఏర్పాటుచేసింది.
ఉద్యోగుల సమ్మెట
* కొత్త రేషన్ కార్డులు లేవు
* పొదుపు సంఘాల బకాయిలు వసూలు కావు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్టు 19: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన ఎన్‌జిఓలు, రెవెన్యూ ఉద్యోగులు, పురపాలకసంఘాల ఉద్యోగులు మాత్రమే నిరవధిక సమ్మెలో పాల్గొంటుంటే, సోమవారం నుండి న్యాయశాఖ ఉద్యోగులు కూడా చేరిపోయారు. 21వ అర్ధరాత్రి నుండి ఉపాధ్యాయులు కూడా సమ్మెలోకి రానుండటంతో ఇప్పటికే సీమాంధ్రలో స్తంభించిన పాలన మరింత ఇబ్బందుల్లోకి వెళ్లబోతోంది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల నిరవధిక సమ్మెతో ప్రయాణం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇతర శాఖల ఉద్యోగుల సమ్మె ప్రభావం ఎలా ఉన్నాగానీ, రెవెన్యూ ఉద్యోగుల సమ్మె కారణంగా పేద వర్గాలకు చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరుచేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించటంతో చాలా మంది పేద వర్గాలకు చెందిన ప్రజలు కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి సమైక్యాంధ్ర ఉద్యోగుల సమ్మె తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. మూడేళ్ల క్రితం అవగాహన లేని విద్యార్ధులతో చేయించిన మల్టీపర్పస్ హౌసోల్డ్ సర్వేలో అర్హులైన వారికి సంబంధించిన చాలా వరకు తెల్ల కార్డులు రద్దయ్యాయి. అప్పటి నుండి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రద్దయిన తెల్లకార్డు పునరుద్ధరణ కాలేదు. అసలే ఉన్న కుటుంబాల కన్నా తెల్ల కార్డులే ఎక్కువ ఉన్నాయన్న సాకుతో అర్హులైన వారికి రాష్ట్రప్రభుత్వం కొత్త కార్డులు జారీచేయటం లేదు. అలాగని అనర్హుల చేతుల్లో ఉన్న తెల్ల కార్డులను రద్దు చేయటం లేదు. దాంతో ఏళ్ల తరబడి అక్రమార్కులు తెల్ల కార్డులతో ప్రయోజనం పొందుతుంటే, నిజంగా అర్హులైన వారు మాత్రం ఎలాంటి ప్రయోజనం పొందలేకపోతున్నారు. పంచాయతీ ఎన్నికలైన తరువాత కొత్త తెల్ల కార్డులను అర్హులైన వారికి మంజూరుచేస్తామని, దానికోసం ముందుగానే దరఖాస్తు చేయించాలని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించటంతో జనం కొత్త కార్డుల కోసం దరఖాస్తులతో ఎదురుచూస్తున్నారు. తీరా చూస్తే తహశీల్దార్ నుండి అటెండరు వరకు రెవెన్యూ శాఖలోని ఉద్యోగులంతా సమ్మె చేస్తున్నారు. మరోపక్క వచ్చే నెలలో తెల్ల కార్డులపై సరుకులు ఇవ్వటం కూడా కష్టమేనని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు.
ఆందోళనల కారణంగా బ్యాంకులు కూడా సరిగా పనిచేయకపోవటంతో మహిళా పొదుపు సంఘాల నుండి వసూలుకావాల్సిన రుణ బకాయిలు కూడా వసూలు కావటం లేదు. జిల్లాలో రోజుకు రూ.1కోటి నుండి రూ.1కోటి 50లక్షల వరకు మహిళా పొదుపు సంఘాలు తాము తీసుకున్న రుణాలను చెల్లిస్తుంటాయి. కానీ సమైక్య ఆందోళనల కారణంగా ఈ వసూళ్లు కూడా తగ్గుతున్నట్టు తెలుస్తోంది.

కాల్ సెంటర్ ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం
కలెక్టర్ నీతూప్రసాద్
కాకినాడ సిటీ, ఆగస్టు 19: ఇ-పరిష్కారం క్రింద కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ప్రజల నుండి అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. ఇ-పరిష్కారం కాల్ సెంటర్‌లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న విధంగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు కలెక్టరేట్ నుండి డయల్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి 28 మంది డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వారంలోని అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేసే ఈ కాల్ సెంటర్‌ను కేవలం ఫిర్యాదుల స్వీకరణ వాటి పరిష్కారానికే కాక వివిధ ప్రభుత్వ శాఖల పధకాల సమాచారం అందించేందుకు దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తాను స్వయంగా ఫోన్ కాల్స్‌కు సమాధానాన్ని ఇచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలియజేశారు. కాకినాడ నగరానికి చెందిన శ్రీవల్లి అనే మహిళ వంట గ్యాస్ సబ్సిడీ రాలేదని ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడి సబ్సిడీ అందేటట్లు చర్యలు తీసుకోకనున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ ఆమెకు హామీ ఇచ్చారు. వివిధ సబ్సిడీ ఆధారిత పధకాలకు లబ్ధిదారుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ కార్యక్రమం అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆమె మాట్లాడారు. సెప్టెంబర్ నెలలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పధకాలకు లబ్ధిదారుల ఎంపికను ప్రత్యేక క్యాంపుల ద్వారా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి డి మార్కండేయులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బాపూ! ఇటాలియన్ గాంధీ నుండి సమైక్యాంధ్రను రక్షించు
* మహాత్ముడి విగ్రహం చుట్టూ నిరసన ప్రదక్షిణలు * ఉదయం నుండి సాయంత్రం వరకు వినూత్న నిరాహార దీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్టు 19: 3బాపూ! ఇటాలియన్ గాంధీ నుండి తెలుగు వారిని, సమైక్యాంధ్రను రక్షించు2 అంటూ సమైక్యాంధ్ర ఉద్యమకారుడొకరు సోమవారం రాజమండ్రి నాగదేవి థియేటర్ సెంటరులో వినూత్నంచేసిన నిరసన ప్రదక్షిణలకు విశేష స్పందన లభించింది. సలాది సత్తిబాబు అనే ఉద్యమకారుడు తలపై నుండి కాళ్ల వరకు నల్ల దుస్తులు ధరించి మహాత్మాగాంధీ విగ్రహం చుట్టూ వౌనంగా ప్రదక్షిణలు చేస్తూ ఈ నిరసన ప్రదర్శన చేసారు. చేతులకు నల్లని చేతి తొడుగులు, కాళ్లకు నల్లని మేజోళ్లు ధరించి తన నిరసనను తెలిపారు. బాపూ! ఇటాలియన్ గాంధీ నుండి తెలుగు వారిని, సమైక్యాంధ్రను రక్షించు అంటూ రాసి ఉన్న ప్లేకార్డును భుజాన వేసుకుని ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు అలాగే కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా వౌనంగా మహాత్ముడి విగ్రహం చుట్టూ సత్తిబాబు ప్రదక్షిణలు చేసారు. ప్రదక్షిణలు ప్రారంభించటానికి ముందే సత్తిబాబు సమైక్యాంధ్రను రక్షించాలని మహాత్ముడ్ని వేడుకుంటూ ఒక వినతిపత్రాన్ని మహాత్ముడి విగ్రహం పాదాల ముందుంచారు. తెల్లవారు జామునే వచ్చి విగ్రహాన్ని శుభ్రం చేసి, మహాత్ముడి పాదాల వద్ద పూలు ఉంచి పూజ చేసిన తరువాత సత్తిబాబు ఈ నిరసన ప్రదక్షిణలు చేపట్టారు. వినూత్నంగా చేస్తున్న నిరసన ప్రదక్షిణలు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని సమైక్యవాదులకు తెలియటంతో పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు పలికారు. ఆర్టీసీ అద్దె బస్సులో ప్రదర్శనగా వెళుతున్న ఎన్‌జిఓలు, న్యాయశాఖ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు సత్తిబాబు నిరసన ప్రదక్షిణలను చూసి, బస్సుల్లోంచి దిగి వచ్చి మద్దతు పలికారు. సాయంత్రం 4గంటలకు ఎన్‌జిఓ అధ్యక్షుడు జి హరిబాబు, ఉద్యోగ సంఘాల నాయకులొచ్చి నిమ్మరసం ఇచ్చి నిరసన ప్రదక్షిణలను విరమింపచేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కరగాని వేణు, కర్రి శ్రీను, కోటంశెట్టి శివకుమార్, వెల్లాల నాగార్జున, కర్రి బాబి, నందం రాథాకృష్ణ, చలపతి తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో విశాలాంధ్ర మహాసభ సమైక్య యాత్ర
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఆగస్టు 19: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలో సమైక్య యాత్ర నిర్వహించారు. యాత్రకు సారథ్యం వహిస్తోన్న పరకాల ప్రభాకర్ జిల్లాకు రానప్పటికీ మహాసభకు చెందిన ప్రతినిధులు జిల్లా కేంద్రం కాకినాడలో పర్యటించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మహాసభ ప్రతినిధి నల్లమోతు చక్రవర్తి జన చైతన్యయాత్రలో పాల్గొని, సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రచారం చేయడం విశేషం! రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో విభజించరాదన్న డిమాండ్‌తో విశాలాంధ్ర మహాసభ జన చైతన్య యాత్రలను రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా చక్రవర్తి తెలియజేశారు. తాను తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడనైనా సమైక్యాంధ్ర కోసమే ఉద్యమిస్తున్నానని, కెసిఆర్, సోనియాగాంధీలు తెలుగు ప్రజలకు ప్రథాన శత్రువులుగా మారారని ఆరోపించారు. విభజించు, పాలించు అనే సిద్ధాంతాన్ని బ్రిటీషు వారు అమలుచేసేవారని, ప్రస్తుతం సోనియాగాంధీ సైతం అదే సిద్ధాంతంతో సాగుతున్నారని ఎద్దేవా చేశారు. 1969లో తెలంగాణా ఉద్యమం, 1972లో జై ఆంధ్రా ఉద్యమాలు జరగ్గా ఆయా ఉద్యమాల్లో వేలాది మంది చనిపోయారన్నారు. కేవలం 13 నుండి 21 ఏళ్ళ లోపు యువకులే ఆయా ఉద్యమాలలో అసువులు బాసారన్నారు. ప్రస్తుతం సమైక్య రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం శాంతియుతంగానే సాగుతోందని, ఉద్యమం హింసాత్మకమైతే రెండు, మూడు వారాలకు మించి సాగలేదన్నారు. కెసిఆర్ తదితర నేతలు నేడు రాజకీయ నిరుద్యోగులుగా మారి, వారి అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు ఆయా ప్రాంతాల వార్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి వారిని నేతలుగా ఎన్నుకుంటే తెలంగాణలో మళ్ళీ బానిస పాలన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహా సభ ప్రతినిధి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆంటోనీ కమిటీ రాజ్యాంగేతర కమిటీ మాత్రమేనని, ఈ కమిటీని బహిష్కరించాల్సిందిగా సీమాంధ్రులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం కాకినాడలో జరుగుతున్న జెఎసి దీక్షలకు, జెఎన్‌టియు విద్యార్థి జెఎసి దీక్షలకు మద్దతు ప్రకటించారు.

జాతీయ రహదారిపై గోడ నిర్మాణం
గొల్లప్రోలు, ఆగస్టు 19: రాష్ట్ర విభజనను నిరసిస్తూ గొల్లప్రోలులో సోమవారం జాతీయ రహదారిపై భవన నిర్మాణ కార్మికులు గోడ నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా 216 జాతీయ రహదారిపై గోడ నిర్మించి సుమారు గంట సేపు కార్మికులు ఆందోళన చేపట్టారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మొగలి వరప్రసాద్, ఉపాధ్యక్షుడు సి సత్తిబాబు, ఎన్ బాబ్జి, ఎం వీరబాబు తదితరులు రిలే నిరహార దీక్ష చేశారు. దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు సందర్శించారు.
అయ్యప్పకు స్వర్ణకిరీటం బహూకరణ
మండపేట, ఆగస్టు 19: స్థానిక ఆలమూరు రోడ్డులో వేంచేసియున్న శ్రీఅయ్యప్పస్వామికి ఆలయ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే వివిఎస్‌ఎస్ చౌదరి, సత్యవతి దంపతులు సోమవారం స్వర్ణకిరీటం బహూకరించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వర్ణకిరీటం బహూకరణ అనంతరం భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
విమాన టిక్కెట్లకు పెరిగిన డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఆగస్టు 19: సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా విమానాల్లో టిక్కెట్లకు డిమాండ్ పెరిగింది. రాజమండ్రి నుండి హైదరాబాద్‌కు ప్రతి రోజు ప్రయాణించే రెండు విమానాల్లో సమైక్యాంధ్ర ఆందోళనలకు ముందు 50శాతం నుండి 60శాతం మాత్రమే టిక్కెట్లు అమ్ముడయ్యేవి. కానీ సమైక్యాంధ్ర ఆందోళనలు మొదలయిన తరువాత రైళ్లలో టిక్కెట్లు దొరక్క, ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనటంతో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రోడ్డెక్కకపోవటం తదితర కారణాలతో రెండు విమానాల్లో వంద శాతం టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.

వినాయకగుడిలో చలువ పందిళ్ల రాట ప్రతిష్ఠ
అయినవిల్లి ఆగస్టు 19: వచ్చే నెలలోజరగబోవు వినాయకచవితి ఉత్సవాలకు సంబంధించి ప్రసిద్దిచెందిన అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామి వారి ఆలయం ప్రాంగణంలో చలువ పందిళ్ళు రాట ముహూర్తం సోమవారం ఉదయం 8-46 నిమిషాలకు జరిగింది. ఈసందర్భంగా ఆయల ఇఓ ముదునూరి సత్యనారాయణరాజు, ముఖ్య అతిధిగా సర్పంచ్ కొపనాతి శ్రీరామచంద్రమూర్తి పాల్గొని, మాట్లాడుతూ త్వరలో జరగబోవు స్వామివారి ఉత్సవాలను ఈసంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకులు సూర్యనారాయణ, అర్చకులు ఆలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరూ మొక్కలు పెంచాలి
-కలెక్టర్ నీతూప్రసాద్
కాకినాడ, ఆగస్టు 19: ప్రతీ ఒక్కరు మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జగన్నాధపురం ఎంఎస్‌ఎన్ ఛార్టీస్ ఉన్నత పాఠశాలలో 64వ వన మహోత్సవం కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని మొక్కలు పెంచడం జీవితంలో ఒక భాగంగా మారాలన్నారు. ప్రకృతిలో సమత్యులత లోపించడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయన్నారు. అటవీ శాఖ అధికారి సివి సత్యనారాయణ మాట్లాడుతూ వనమహోత్సవం సందర్భంగా జిల్లాలో 2070 మొక్కలు నాటామని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి కెవి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మొక్కలు పెంచటం వల్ల గ్లోబల్ వార్మింగ్‌ను ఆరికడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపవిద్యాశాఖాధికారి జె మంగతాయారమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేసరి శ్రీనివాసరావు, ఎంఎస్‌ఎన్ ఛార్టీస్ పర్యవేక్షకులు పి విజయకుమార్, ఫారెస్ట్ రేంజర్ సీతారామారావు, వివిధ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
వివరాలు ఇవ్వకుంటే వంట గ్యాస్ బుకింగ్ నిలిపివేత :జెసి
కాకినాడ సిటీ, ఆగస్టు 19: వంట గ్యాస్ వినియోగదారులందరూ ఈ నెల 31 లోపు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని లేని పక్షంలో సెప్టెంబర్ 1వ తేదీ అనంతరం వంట గ్యాస్ బుకింగ్‌ను నిలిపివేస్తామని జెసి ముత్యాలరాజు హెచ్చరించారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి వంట గ్యాస్ సబ్సిడీ రాదని వారందరూ సిలెండర్‌కు 935 రూపాయలు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎల్‌పిజి వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు కేవలం 10 రోజుల మాత్రమే గడువు ఉందన్నారు. వినియోగదారులందరూ ఈ విషయాన్ని గుర్తించి తక్షణం ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జెసి ముత్యాలరాజ పిలుపునిచ్చారు.

వెయ్యి క్యూసెక్కులు విడుదలచేసే అవకాశం * దిగువ గ్రామాలు అప్రమత్తం
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>