Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జగన్ తరఫునే సమరదీక్ష

$
0
0

గుంటూరు, ఆగస్టు 19: పెద్దన్న పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతానికి తీరని అన్యాయం చేసే నిర్ణయాన్ని తీసుకుందని, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని కాంగ్రెస్‌కు రాష్ట్రాన్ని విభజించే అర్హత లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నిర్ణయంపై పునఃసమీక్ష చేయాలని కోరుతూ వైఎస్ విజయమ్మ సోమవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. వేదికపై ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విజయమ్మ సమైక్య ఉద్యమంలో అశువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిముషాలు వౌనం పాటించారు. అంతకుముందు విజయమ్మ దీక్ష విజయవంతం కావాలని ఆయా మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. దీక్ష ప్రారంభంలో వైఎస్ విజయమ్మ శిబిరానికి తరలివచ్చిన సమైక్యవాదులు, పార్టీ నాయకులనుద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతల ఏకపక్ష నిర్ణయాల వల్లే రాష్ట్ర విభజనకు పునాదులు ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్తును పట్టించుకోకుండా ఓట్లు, సీట్లు కోసం రాజకీయాలు చేస్తున్న ఆయా పార్టీల నాయకులకు బుద్ధి రావాలని జగన్ జైలులోనే దీక్షకు ఆమరణదీక్షకు కూర్చుంటానని చెప్పారని తెలిపారు. అయితే జైలు నిబంధనలు మరింత కఠినతరం చేస్తారని, వేరొక రాష్ట్రానికి తరలించే అవకాశం ఉందని చెబుతూ జగన్‌బాబును వారించానని తెలిపారు. జగన్ తరఫున ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమరణ దీక్షకు దిగుతున్నానని ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎన్జీవోలు పెన్‌డౌన్ చేసి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడకముందే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రాంత ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందిగా హుకుంలు జారీ చేస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగుల భద్రతకు ఎటువంటి భంగంవాటిల్లకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. విజయమ్మ దీక్షకు ఇటీవల రాజీనామాలు చేసిన ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, మద్దాల రాజేష్, బాలరాజు, ద్వారపరెడ్డి చంద్రశేఖరరెడ్డి, పేర్ని నాని, కోడాలి నాని, జోగి రమేష్, సుచరిత, పినె్నల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లక్ష్మీపార్వతి, జ్యోతుల నెహ్రూ, తలశిల రఘురామ్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, రావి వెంకటరమణ, రైతు నేత నాగిరెడ్డి, మేరుగ నాగార్జున, కావటి మనోహర్ నాయుడు, షౌకత్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విజయవాడకు చెందిన గౌతమరెడ్డి, శకుంతల, నెల్లూరుకు చెందిన పద్మనాభరెడ్డి, కాటం శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేతల దీక్షలతో తారాస్థాయికి సమైక్య ఉద్యమం
* ఎంసెట్ కౌనె్సలింగ్, గ్రీవెన్స్‌లకూ తాకిన సమైక్య సెగ
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఆగస్టు 19: నిత్యం ర్యాలీలూ, రాస్తారోకోలు, ధర్నాలతో వేడెక్కుతూ వస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలతో తారాస్థాయికి చేరింది. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎంజి బ్రదర్స్‌కు చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన వేదికపైన సమరదీక్షను ప్రారంభించగా, తెలుగుదేశం పార్టీకు చెందిన ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి శనక్కాయల అరుణలు ట్రావెలర్స్ బంగ్లా పక్కన దీక్షా శిబిరాన్ని నెలకొల్పారు. ఇరు శిబిరాలకు వేలాది సంఖ్యలో సమైక్యవాదులు, ఆయా పార్టీల అభిమానులు, కార్యకర్తలు హాజరై నేతల ఉద్వేగభరిత ప్రసంగాలతో ఉత్తేజితులయ్యారు. ఇలా ఉండగా రాష్టవ్య్రాప్తంగా ప్రారంభమైన ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌ను స్థానిక విద్యార్థి జెఎసి నేతలు అడ్డుకున్నారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల, నల్లపాడు, గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కేంద్రాలను ముట్టడించిన విద్యార్థి జెఎసి నేతలు కౌన్సిలింగ్ నిలిపివేసి, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలంటూ నినాదాలు చేశారు. ప్రతి సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే గ్రీవెన్స్ సెల్‌ను ఎపి ఎన్జీవో నేతలు అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీవెన్స్‌ను నిర్వహించేందుకు అంగీకరించబోమని, అధికారులు సైతం బయటకు వచ్చి ఉద్యమానికి మద్దతు పలకాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో డ్వామా పిడి ఢిల్లీ రావు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు బయటకు వచ్చి తామంతా సామూహిక సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పడంతో ఎపి ఎన్జీవోలు అక్కడినుండి బయలుదేరి ప్రదర్శనగా వెళ్లారు. అలాగే రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ ఉద్యోగులు, స్టాంప్ వెండర్స్ అసోసియేషన్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించగా, హిందూ కళాశాల సెంటర్‌లో అర్చకులు శత్రు హోమం, నగరంలో పలు కళాశాలల విద్యార్థులు ప్రదర్శనలు, మానవహారాలతో సమైక్య నినాదం నింగినంటింది.

సమైక్య ఉద్యమం
ఢిల్లీ పీఠాన్ని
కదిలించాలి

* టిడిపి నేతల నిరవధిక దీక్షల ప్రారంభ సభలో నేతల పిలుపు

గుంటూరు, ఆగస్టు 19: ప్రజాభీష్టం పట్టించుకోకుండా కేంద్రం తీసుకున్న విభజన నిర్ణయంపై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం రాష్ట్ర ఎల్లలు దాటి ఢిల్లీలోని యూపీఏ పీఠాన్ని కదిలించాలని, ఈ లక్ష్యసాధనకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ నగరంలోని ట్రావెలర్స్ బంగ్లా వద్ద పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తల నడుమ నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలపై సోనియాగాంధీ కక్షగట్టి రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ముల్లా జీవిస్తున్న తెలుగువారి మధ్య చిచ్చుపెట్టిందని ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని దిగ్విజయ్‌సింగ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, హైదరాబాద్ ప్రాంతమంతా అభివృద్ధి చెంది ఆదాయం అక్కడ వస్తుంటే సీమాంధ్ర ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 7 కోట్ల ప్రజానీకం ఆందోళనలో పాల్గొంటున్నప్పటికీ మన్మోహన్ సింగ్ నోరు విప్పడం లేదన్నారు. సీమాంధ్రలోని ఎంపిలు మంత్రి పదవులు, వ్యాపార లావాదేవీల కోసం యూపిఎ ప్రభుత్వం వద్ద సీమాంధ్రుల మనోభావాలను తాకట్టు పెట్టారని, ఇకనైనా వారు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనకుంటే సీమాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. మరో మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెఆర్ పుష్పరాజ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు రాష్ట్ర సమైక్యత కోసం ప్రాణత్యాగం చేస్తే స్వార్థ రాజకీయ నాయకులు స్వలాభం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు వడిగట్టారన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు సమిష్టి కృషితో అభివృద్ధి చేసుకున్న రాజధాని మాది అంటూ, సీమాంధ్రులు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని కేసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తెలంగాణ అంశానికి పునాది వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని, తెలంగాణ పర్యటనలో వైఎస్ విజయమ్మ తెలంగాణను అనుకూలమంటూ వ్యాఖ్యలు చేసి, నేడు సీమాంధ్రలో ఉద్యమాలు ఉద్ధృతమవడంతో తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జైలు పార్టీ అని, జగన్ను జైలు నుంచి విడుదల చేసేందుకే కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. దీక్షల్లో కూర్చున్న నన్నపనేని రాజకుమారి, యరపతినేని శ్రీనివాసరావు, శనక్కాయల అరుణ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు అంధకారం కాకూడదని, డెల్టా వ్యవసాయ భూములు ఎడారిగా మారకూడదనే నిరవధిక నిరాహారదీక్షలను చేపట్టినట్లు తెలిపారు. ఇలా ఉండగా దీక్షాపరులకు మద్దతుగా పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, కందుకూరి వీరయ్య, అనగాని సత్యప్రసాద్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, లాల్‌వజీర్, పి రెడ్డిలతో పాటు పలువురు రిలే దీక్షల్లో కూర్చున్నారు. సమైక్యాంధ్రకు కాంక్షిస్తూ దేశం నేతలు పూనుకున్న దీక్షకు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, కొమ్మాలపాటి శ్రీ్ధర్, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మేయర్లు పంచుమర్తి అనురాధ, చుక్కా ఏసురత్నం, డిసిసిబి చైర్మన్ ముమ్మనేని వెంకయ్య

* అధికారంలోకి వస్తే ఉద్యోగులకు భద్రత * దీక్ష ప్రారంభ సభలో విజయమ్మ
english title: 
j

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>