హైదరాబాద్, ఆగస్టు 20: రెండో రోజూ ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. మంగళవారం నాడు కోస్తాంధ్ర ప్రాంతంలోని అనేక కౌనె్సలింగ్ కేంద్రాలు మూత పడ్డాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా సిబ్బంది విధులను బహిష్కరించడంతో సీమాంధ్ర ప్రాంతంలోని అనేక జిల్లాల్లో రెండో రోజు కూడా ఎమ్సెట్ కౌనె్సలింగ్ కేంద్రాలు మూతపడి కౌనె్సలింగ్ నిలిచిపోయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సిబ్బంది విధులను బహిష్కరించడంతో విజయనగరంలో కౌనె్సలింగ్‌ను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఎన్జీవోలు ఆందోళనకు దిగారు. రాయలసీమ వర్శిటీలో కూడా కౌనె్సలింగ్‌ను నిలిపివేశారు. అనంతపురం పాలిటెక్నిక్ కాలేజీ, ఎస్కే వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కౌనె్సలింగ్ నిలిచిపోయింది. కౌనె్సలింగ్‌కు హాజరుకావడానికి విద్యార్ధులు నానా తిప్పలు పడ్డారు. ఒక వైపు కౌనె్సలింగ్ హాజరుకావాలనే భయంతో తల్లిదండ్రులు సైతం నరకం చవిచూశారు. కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే సజావుగా సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతోంది.
కాని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం కౌనె్సలింగ్ సాగడం లేదు. కొన్ని కేంద్రాలు పనిచేస్తున్నా ఉద్యమకారులు వచ్చినపుడు వాటిని మూసి వేసి, వారు వెళ్లిన తర్వాత తిరిగి తెరుస్తున్నారు. దాంతో ఎపుడు కౌనె్సలింగ్ అవుతుందో, అసలు కౌనె్సలింగ్ జరుగుతుందో లేదో తెలియని అనిశ్చితిలో విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో సజావుగా జరుగుతోంది కనుక విద్యార్ధులు కోస్తాంధ్ర నుండి తెలంగాణకు వచ్చి తమ సర్ట్ఫికేట్లను పరిశీలన చేయించుకోవచ్చని అధికారులు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కొన్ని వర్శిటీల్లో చిన్న వివాదానికే పరీక్షలు సహా అన్నీ వాయిదా వేసే ప్రభుత్వం హైకోర్టు పేరు చెప్పి కౌనె్సలింగ్‌ను బలవంతంగా నడపాలని చూస్తోంది. ఇంత పెద్దఎత్తున వివాదాలు లేకపోయినా గత ఏడాది కూడా ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ ఆగస్టు చివరి వారంలోనే జరిగిందని సాంకేతిక విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న 56 కౌనె్సలింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎయు ఏరియాలో 21 కేంద్రాలు, ఎస్వీయు ఏరియాలో 13 కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే వీటిలో 14 కేంద్రాలు మాత్రమే పనిచేశాయి. 20 కేంద్రాలు మూతపడ్డాయి. మంగళవారం నాడు కేవలం 5268 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలనకు రిజిస్టర్ చేసుకున్నారు. రెండు రోజులు కలిపి 8527 మంది సర్ట్ఫికేట్ల పరిశీలన జరిగింది. హెల్ప్‌లైన్ సెంటర్లలో ఈ నెల 30వ తేదీ వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలనకు అనుమతిస్తారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందిన విద్యార్ధులైనా ఈ నెల 30వ తేదీలోగా ఏ కేంద్రంలోనైనా హాజరై సర్ట్ఫికేట్ల పరిశీలన చేయించుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశ్ రావు మంగళవారం నాడు చెప్పారు.ఏ ఒక్క విద్యార్ధికీ అన్యాయం జరగదని, ఎక్కడైనా 30లోపు సర్ట్ఫికేట్ల పరిశీలనకు అవకాశం ఇస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ చెప్పారు.
సర్ట్ఫికేట్ల పరిశీలన పూర్తయ్యే వరకూ సీట్లను కేటాయించేది లేదని కౌనె్సలింగ్ క్యాంప్ అధికారి డాక్టర్ కె. రఘునాధ్ అన్నారు. హాజరుకాలేకపోయిన విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. 30వ తేదీ వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 22 నుండి వచ్చే నెల 3 వరకూ అభ్యర్ధులు తమ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు వీలుకల్పించారు. సెప్టెంబర్ 10న తరగతులు ప్రారంభించాలని ముందుగా అధికారులు భావించారు. గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజీ, మహిళాపాలిటెక్నిక్ కాలేజీ, ఎఎన్‌యు, ప్రొద్దుటూరు వైవీయు ఇంజనీరింగ్ కాలేజీ, కడప పాలిటెక్నిక్ కాలేజీలలో కూడా కౌనె్సలింగ్ నిలిచిపోగా, వైవీ యూనివర్శిటీలో రెండో రోజు కౌనె్సలింగ్ ప్రారంభమైంది.
ఆన్‌లైన్‌లోనే యాజమాన్య కోటా
ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను మెరిట్ ప్రాతిపదికనే, ఆన్‌లైన్‌లోనే జరగాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది. అవసరమైతే సర్ట్ఫికేట్లు ఇతర ధృవపత్రాల పరిశీలన అధికారం యాజమాన్యాలకు సైతం ఉంటుందని, ఇతర వ్యవహారాలను ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌లో ఆటంకం పలు కేంద్రాలు మూసివేత కౌనె్సలింగ్ అయ్యాకనే సీట్ల కేటాయింపు
english title:
r
Date:
Wednesday, August 21, 2013