వాషింగ్టన్, ఆగస్టు 21: సూర్యుడిలో అత్యంత శక్తివంతమైన సౌర తుపాను సంభవించింది. దీని ఫలితంగా గంటకు 33 లక్షల కిలోమీటర్ల వేగంతో విపరీతమైన వేడితో కూడిన సూక్ష్మ కణాలతో ఏర్పడిన భారీ మేఘం భూమి దిశగా శరవేగంగా దూసుకు రావడం జరుగుతోందని శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు.ఈ నెల 20వ తేదీన సూర్యుడిలో భారీ విస్ఫోటం సంభవించి భూమి దిశగా కోట్లాది టన్నుల సూక్ష్మ కణాలను అంతరిక్షంలోకి పంపించే కొరోనల్ మాస్ ఎజెక్షన్ (సిఎంఇ) ఏర్పడిందని, ఈ సూక్ష్మ కణాలు ఒకటినుంచి మూడు రోజుల్లో భూమికి చేరుతాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా విభాగం నాసా తెలిపింది. ఈ సూక్ష్మకణాలు భూమిపై మనుషులకు హాని కలిగించడానికి వీలుగా వాతావరణంలో ప్రయాణించలేవని, అయితే ఉపగ్రహాల్లో, భూమిపైన ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై ప్రభావం చూపించవచ్చని ఆ సంస్థ తెలిపింది. సిఎంఇ సెకనుకు 570 మైళ్లు లేదా గంటకు 33 లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుడిని వదిలిపెట్టినట్లు నాసా సోలార్ టెర్రిస్ట్రియల్ రిలేషన్స్ అబ్జర్వేటరీ ఆధారంగా రూపొందించిన ప్రయోగాత్మక పరిశోధనా మోడల్స్‌ను బట్టి తెలుస్తోంది. సాధారణంగా సిఎంఇల వేగం ఈ మేరకు ఉంటుంది కూడా. భూమి దిశగా దూసుకు వచ్చే సిఎంఇలు జియోమాగ్నటిక్ తుపానుగా పిలవబడే అంతరిక్ష తుపానులకు కారణమవుతుందని, కొద్ది రోజుల పాటు భూమికి చెందిన అయస్కాంత క్షేత్రంలోకి పెద్ద మొత్తంలో ఇవి అతి వేగంగా శక్తిని చిమ్మినప్పుడు ఇలాంటివి ఏర్పడుతుంటాయని నాసా తెలిపింది. అయితే గతంలో ఈ సా థయ జియోమాగ్నటిక్ తుపానుల ప్ర భావం చాలా తక్కువగా ఉండిందనీ నాసా తెలిపింది. అయితే సిఎంఇల కారణంగా తలెత్తే జియోమాగ్నటిక్ తుపానుల కారణంగా కమ్యూనికేషన్స్ సిగ్నల్స్ సామర్థ్యం తగ్గిపోవచ్చని, అలాగే విద్యుత్ గ్రిడ్‌లో అనూహ్యంగా కరెంట్ ఒక్కసారిగా పెరిగిపోవడం జరగవచ్చని కూడా చెప్పింది. అలాగే ముఖ్యంగా అత్యంత వేగంగా దూసుకు వచ్చే శక్తివంతమైన సూక్ష్మకణాలు అత్యంత ఎత్తయిన వాతావరణంలో అణువులను ఢీకొన్నప్పుడు ఆకాశంలో సహజమైన కాంతి పుంజం ఏర్పడే అవకాశం ఉంటుందని నాసా శాస్తజ్ఞ్రులు అంటున్నారు.
పెద్ద నష్టం ఉండదంటున్న శాస్తజ్ఞ్రులు
english title:
b
Date:
Thursday, August 22, 2013