న్యూఢిల్లీ/ బెల్గాం, ఆగస్టు 21: ఒక బాలికపై మానభంగానికి పాల్పడి, తరువాత ఆమెను కిరాతకంగా హత్యచేసిన కేసులో కర్నాటకకు చెందిన ఇద్దరు ఖైదీలకు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. గురువారం విధించాల్సిన వీరి ఉరిశిక్ష అమలును నిలిపివేస్తూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 2001 నాటి ఈ కేసులో తమ క్షమాభిక్ష దరఖాస్తును రాష్టప్రతి తిరస్కరించడంతో ముద్దాయిలు శివు మునిశెట్టి, జడేస్వామి రంగశెట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరి పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉరిశిక్షల అమలును నిలిపివేస్తూ తాను ఆదేశాలు జారీ చేసిన ఇతర కేసులకు ఈ కేసును కోర్టు జతచేసింది. అంతకుముందు ముద్దాయి శివు బెల్గాంలోని హిండాల్గ జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. శివు తన మర్మావయవాలను, ఒక చేతిని బ్లేడ్‌తో కోసుకున్నాడని జైలు అధికారులు తెలిపారు. గాయపడిన శివుకు తొలుత జైలు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నామని, జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించనున్నామని ఆయన చెప్పారు.
అమలుపై సుప్రీంకోర్టు స్టే
english title:
d
Date:
Thursday, August 22, 2013