కామారెడ్డి, మార్చి 3: ఓటర్లు నిర్భయంగా స్వేచ్చగా ఓటు హక్కును వినయోగించుకోవాడానికి వీలుకల్పించాల్సిన బాధ్యత తమ శాఖపై ఉందని ఎస్పీ రామకృష్ణయ్య అన్నారు. శనివారం కామారెడ్డి ఉప ఎన్నికల మీడియా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నియమామవళి అమలు పర్యవేక్షణ కమిటీ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ, ఎక్కువ శాతం ఓటింగ్ నమోదుకు తమవంతు కృషి చేస్తామని అన్నారు. ఏలాంటి తప్పులకు అవకాశం కల్పించకుండా ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసంరించి పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఎవ్వరైన అల్లర్లకు పాల్పడితే వెంటనే సమాచారం అందించాలని, ఎన్నికల్లో ఏలాంటి అల్లర్లకు పాల్పడాలని చూసిన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. సిబ్బంది కాని నియమావళి పర్యవేక్షణ కమిటీ అధికారులు అందిరికి కూడా పూర్తి రక్షణ ఉంటుందన్నారు. అనంతరము జిల్లా కలెక్టర్ డి.వరప్రసాద్ మాట్లాడుతూ, ఎవ్వరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తూ, ఎవ్వరు కూడా నియమావళిని అతిక్రమిం చకుండా చూడాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆస్తుల పై ఏ విధమైన జెండాలు కాని రాతలు కాని లేకుండా చూడాలని, ప్రైవేట్ ఆస్తులపై ప్రచారం నిర్వహించే వారు తప్పని సరి యాజమాని అంగీకారం తీసుకో వాలని సూచించారు. సభలు సమావేశాలు జరిపే వాటిని నిశితంగా పరిశీలిస్తూ, వీడియో చిత్రీకరణ ద్వారా నిక్షిప్తపర్చాలని ఆదేశించారు. ప్రచారా నికి సంబంధించిన ప్రకటనలు ఇతర పేయిట్ ఆర్టికల్ న్యూస్ సంబం ధించిన వార్తల ఖర్చులను ఎప్పటికప్పుడు గుణించి, లెక్కించి రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకుని పోవాలని అన్నారు. అనంతరము ఎన్నికల ఖర్చుల పరిశీలకులు మహ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి ఎన్నికల ప్రక్రియ వెన్నముక లాంటిదని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎటువంటి భావోద్వేగాలకు లోనుకా కుండా ఉండాలని అన్నారు. వెనుక బడిన ప్రాంతాలకు చెందిన ప్రజలు, మహిళలు చైతన్య వంతులైన పెద్ద ఎత్తున ఓటింగ్‌లొ పాల్గొంటున్నారని, మనదేశంలో ప్రజాస్వామ్యం పరిడవి ల్లుతున్న విధానాన్ని చూసి ఇతర దేశాలకు ఈ దిశగా ఆలోచిస్తున్నారని అన్నారు.
ఓటరు నిస్సంకోచంగా ఓటు వేయడానికి మనం అందరం కూడా నిస్వార్థంగా పనిచేయాలని సూచిం చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హర్షవర్దన్, అదనపు జెసి శ్రీరాంరెడ్డి, అదనపు ఎస్పీ రాజకు మారి, ఆర్డీఓ వెంకటేశ్వర్లుపాల్గొన్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: కలెక్టర్ వరప్రసాద్
కామారెడ్డి, మార్చి 3: కామారెడ్డి శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీలో బూత్ లేవల్ అధికారులు(బిఎల్‌ఓలు) నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డి.వరప్రసాద్ అన్నారు. కామారెడ్డి ఉప ఎన్నికల నేపథ్యంలో బాబాగౌడ్ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన బూత్ లేవల్ అధికారుల శిక్షణ తరగతులకు హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఓటర్ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ప్రజల్లో తమ ఓటుకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించడం ద్వారా ఓటింగ్ శాతాన్ని మరింత పెంచే ఉద్ధ్యేశంతో ఇంటింటికి వెళ్లి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఓటర్ పూర్తి సమాచారంతో స్లిప్‌లను పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ స్లిప్‌ల పంపిణీ కార్యక్రమం ఎంతో బాధ్యతో నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, ప్రతి కుటుంబానికి స్లిప్‌లు అందించడమే కాకుండా అందుకు సంబంధించిన రశీదులను పొంది, పంపిణీ కాని ఓటర్ల జాబితాలను కూడా ప్రిసైడింగ్ అధికారులకు అందించాలని అన్నారు. ఈ స్లిప్‌లను 7నుండి వారం రోజుల పాటు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. పంపిణీ సమయంలో ఏ అభ్యర్థి, పార్టీపై రాగద్వేశాలు లేకుండా, ఇతర విషయాలను ప్రస్తావించకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.
ఓటర్లు నిర్భయంగా స్వేచ్చగా ఓటు హక్కును వినయోగించుకోవాడానికి వీలుకల్పించాల్సిన
english title:
s
Date:
Sunday, March 4, 2012