దుబాయ్, ఆగస్టు 21: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టి-20 ప్రపంచ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆరో స్థానంలోనే కొనసాగుతున్నాడు. బ్రెండన్ మెక్మెలం (న్యూజిలాండ్) 812 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, ఎటి హాలెల్ (ఇంగ్లాండ్), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ 730 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. సురేష్ రైనా 718 పాయింట్లు సంపాదించి ఎనిమిదో స్థానాన్ని సంపాదించాడు. బౌలింగ్ విభాగం ‘టాప్-10’ జాబితాలో భారతీయులు ఎవరూ లేకపోవడం గమనార్హం. వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ 817 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, పాకిస్తాన్ స్పిన్నర్ సరుూద్ అజ్మల్ 744 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ 685 పాయింట్లు సంపాదించి మూడో స్థానాన్ని సంపాదించాడు. ఆల్ రౌండర్స్ విభాగంలో ఆసీస్ వీరుడు వాట్సన్ 470 పాయింట్లతో నంబర్‌వన్‌గా ఉన్నాడు. పాక్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ 430, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ 349 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాలను సంపాదించుకున్నారు. భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 335 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన
english title:
icc
Date:
Thursday, August 22, 2013