Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వాట్సన్ సూపర్ సెంచరీ

$
0
0

ది ఓవల్ (లండన్), ఆగస్టు 21: ఇంగ్లాండ్‌తో బుధవారం ప్రారంభమైన యాషెస్ సిరీస్ చివరి దైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ అద్భుత సెంచరీతో రాణించాడు. ప్రతి ష్టాత్మక యాషెస్ సిరీస్‌లో అతనికి ఇది మొదటి సెంచరీ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 11 పరుగుల వద్ద తొలి వికెట్‌ను డేవిడ్ వార్నర్ (6) రూపంలో కోల్పోయంది. ఈ దశ లో ఓపెనర్ క్రిస్ రోజర్స్‌తో జత కలిసిన వాట్సన్ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను సునాయాసంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 107 పరుగుల భాగ స్వామ్యాన్ని అందించారు. రోజర్స్ 23 పరుగులు చేసి అవుట్‌కాగా, ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (7)ను జేమ్స్ ఆండర్సన్ అవుట్ చేసి, ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వార్నర్ వికెట్ సాధించిన వెంటనే అతను మొత్తం 325 వికెట్లతో, ఈ జాబితాలో బాబ్ విల్లీస్ రికార్డును సమం చేశాడు. ఆతర్వాత క్లార్క్ వికెట్‌ను కూడా సాధించడంతో, విల్లీస్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరాడు. ఇయాన్ బోథం 383 వికెట్లతో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇలా వుంటే, 144 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ చేజార్చుకోగా, స్టీవెన్ స్మిత్ జాగ్రత్తగా ఆ డుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వాట్సన్ సెంచరీ పూర్తిచేయగా, స్మిత్ అర్ధ శతకాన్ని నమోదు చేశారు. 247 బంతులు ఎదుర్కొని 176 పరుగులు చేసిన తర్వాత స్టు వర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో కెవిన్ పీటర్సన్ క్యాచ్ పట్టగా వాట్సన్ వెనుదిరిగాడు. అతను స్మిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 44.2 ఓవర్లలో 145 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 307 పరుగులు సాధించింది. పీటర్ సిడిల్ 18, స్మిత్ 66 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకొని, యాషెస్ ట్రో ఫీని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. దీనితో ఎలాంటి ప్రయోజనం లేని చివరి టెస్టులో ఇం గ్లాండ్ జట్టు పేసర్ క్రిస్ వోగ్స్, స్పిన్నర్ సైమన్ కెరిగాన్‌లకు అవకాశం ఇచ్చింది. వీరిద్దరికీ కెరీర్‌లో ఇదే తొలి టెస్టు.

ఆస్ట్రేలియా 4/307 శఇంగ్లాండ్‌తో ‘యాషెస్’ సిరీస్ చివరి టెస్టు
english title: 
w

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>