న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు ఈసారి తనకు దక్కుతుందన్న డిస్కస్ త్రోయర్ కృష్ణ పునియా ఆశలు గల్లంతయ్యాయి. ఆమెకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఈసారికూడా రాదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఓ చానెల్ వార్తను ప్రసారం చేసింది. చానెల్ కథనం ప్రకారం, ఈసారి ఖేల్ రత్న అవార్డుకు షూటర్ రోజన్ సింగ్ సోధీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అయితే, కెరీర్‌లో తన పేరును పరిశీలించాలని పునియా కోరింది. కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసేందుకు ఆమె చేసిన తొలి ప్రయత్నం ఫలించలేదు. ఆతర్వాత ఆరు రోజుల వ్యవధిలో ఆమె రెండు పర్యాయాలు జితేంద్ర సింగ్‌ను కలిసి, తన పేరును ఖేల్ రత్న అవార్డుకు పరిశీలించాలని కోరింది. అయితే, తన వాదనను వినిపించడానికి తగినంత సమయాన్ని ఆయన కేటాయించలేదని ఆ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పునియా పేర్కొంది. హర్యానా నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు దీపీందర్ హూడా కేంద్ర మంత్రిని కలిసి పునియాకు ఖేల్ రత్న ఇవ్వాలని కోరాడు. ఈ విషయాన్ని అతను స్వయంగా ప్రకటించాడు. ఖేల్ రత్న అవార్డుకు పునియా అర్హురాలని అన్నాడు. అయితే, కేంద్ర క్రీడల మంత్రి నుంచి ఆయనకు ఎలాంటి హామీ రాలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పునియాకు ఖేల్ రత్న అవార్డు రావడం అసాధ్యంగా కనిపిస్తోంది.
సిఫార్సు చేయమని కోరింది: అంజలి
రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు తన పేరును సిఫార్సు చేయాల్సిందిగా కృష్ణ పునితా తనను కోరిందని మాజీ షూటర్, సెలక్షన్ ప్యానెల్ సభ్యురాలు అంజలి భగవత్ చెప్పింది. బుధవారం ఆమె పిటిఐతో మాట్లాడుతూ సెలక్షన్ ప్యానెల్ సమావేశానికి రెండు రోజుల ముందు తనను పునియా కలిసినట్టు చెప్పింది. ఖేల్ రత్న అవార్డుకు తన పేరును ప్రతిపాదించాలని కోరిందని, ఇది ఆమె నైతిక పతనానికి నిదర్శమని వ్యాఖ్యానించింది. సిఫార్సులతో అవార్డులు లభిస్తాయని భావించడం పునియా అవివేకమని పేర్కొంది. ఇలాంటి దుష్ట సంప్రదాయాలను తాను సమ ర్థించబోనని స్పష్టం చేసింది. పునియా కూడా ఇటువంటి మార్గాలను అనే్వషించడం మానుకుంటే మంచిదని అంజ లి హితవు చెప్పింది.
................
యుఎస్ ఓపెన్‌కు ఫిష్ దూరం
న్యూయార్క్, ఆగస్టు 21: అమెరికాకు చెందిన ప్రపంచ మాజీ ఏడో ర్యాంక్ ఆటగాడు మార్డీ ఫిష్ ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగాడు. కొంతకాలంగా అతను గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్టు అతను ప్రకటించాడు. యుఎస్ ఓపెన్‌లో అత ను అత్యుత్తమంగా 2008లో క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. హార్డ్ కోర్ట్ సెపషలిస్టుగా పేరు సంపాదించిన ఫిష్ అతి తక్కువ కాలంలోనే గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. ఒకానొక దశలో ఆండీ రోడిక్‌ను వెన క్కునెట్టి అమెరికాలో నంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్లాడు. 2011లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. తండ్రి శామ్ ఉపాధ్యాయుడుకాగా, తల్లి శాలీ గృహిణి. విద్యార్థిగా ఉన్నపుపడు, అతను రోడిక్ కుటుంబంతో కలిసి ఉండేవాడు. అతనితోపాటే టెన్ని స్‌లో పాఠాలు నేర్చుకున్నాడు. ఇద్దరూ అమెరికా గర్వించగతగ్గ స్టార్లుగా ఎదగడం విశేషం. అయతే, గుండె సంబంధమైన వ్యాధి కారణంగా ఫిష్ క్రమంగా టెన్నిస్‌కు దూరమవుతున్నాడు.