గజ్వేల్, ఆగస్టు 22: ఎంతో ధైర్యంతో తెలంగాణ ప్రకటించిన సోనియాను టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ అభినందించక పోవడంలో అంతర్యమేమిటని జి.విజయ రామారావు ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రావు గురువారం గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం బొంతపురుగు, కుష్టు వ్యాధి గ్రస్తులను ముద్దాడుతానని ప్రకటించిన కెసిఆర్ లక్ష్యం సిద్ధించిన అనంతరం స్పందించక పోతుండడంలో రహస్యమేమిటని నిలదీశారు. టిఆర్‌ఎస్ కుటుంబ పార్టీగా మారిపోయందని ఆరోపించారు. నేతలు, కార్యకర్తల శ్రమ దోపిడీ లక్ష్యంగా సొంత లబ్ధికోసం కెసిఆర్ పాకులాడుతున్నారని ఆయన ఆరోపించారు. 56యేళ్ల సుదీర్ఘ పోరాటం, అమరవీరుల త్యాగాలు, ఉద్యమ కారుల కృషి ఫలితంగా దిగివచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడంతోపాటు ప్రక్రియను వెంటనే ఆరంభిస్తున్నట్లు దిగ్విజయ్‌సింగ్ ద్వారా చెప్పించడం చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తున్నట్లు తెలిపారు. సీమాంధ్రుల ఆందోళనలను పట్టించుకోకుండా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం హర్షించ తగ్గదని చెప్పారు. దేశంలోని 38పార్టీలు అనుకూలమేనని తీర్మానాలు చేసి కేంద్రానికి నివేదించగా, ప్రక్రియ మరింత వేగవంతం కోసం ఆ పార్టీల నేతలను కలసి వద్దామని కేసిఆర్‌కు చెప్పినందునే తమపై కనె్నర్ర చేసినట్లు పేర్కొన్నారు.
* విజయరామారావు ధ్వజం
english title:
trs
Date:
Friday, August 23, 2013