హైదరాబాద్, ఆగస్టు 22: ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ తంతు రాష్ట్ర సమైక్య ఉద్యమాల అడ్డంకుల మధ్య గురువారం నాడు జరిగింది. నాలుగో రోజు కూడా అనేక అడ్డంకుల మధ్య 20 కౌన్సెలింగ్ కేంద్రాలు మూతపడ్డాయి. కేవలం 17 మాత్రమే పనిచేశాయి. సీమాంధ్రలో 4791 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలన చేయించుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో 4702 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 9493 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు ముందుకు వచ్చారు. వైజాగ్‌లో విఎస్ కృష్ణా కాలేజీలో 23వ తేదీ నుండి కొత్తగా కౌనె్సలింగ్ కేంద్రం పనిచేస్తుందని అడ్మిషన్ల కో కన్వీనర్ డాక్టర్ కె. రఘునాధ్ చెప్పారు. బుధవారం నాడు సీమాంధ్ర ప్రాంతంలోని 37 కౌన్సెలింగ్ కేంద్రాల్లో కేవలం 17 కేంద్రాలు మాత్రమే పనిచేశాయి. 20 కేంద్రాల్లో కౌన్సెలింగ్ రద్దయింది. అక్కడ 4216 మంది అభ్యర్ధులు సర్ట్ఫికేట్ల పరిశీలనకు రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో 22 కేంద్రాల్లో 5216 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం మీద 9432 మంది మాత్రమే తమ సర్ట్ఫికేట్లను పరిశీలన చేయించుకున్నారు. తొలి రోజు రాష్టవ్య్రాప్తంగా ఉన్న 56 కౌన్సెలింగ్ కేంద్రాల్లో 15వేల మంది విద్యార్ధులను సర్ట్ఫికేట్ల పరిశీలనకు ఆహ్వానించగా, రాత్రి 7 గంటల సమయానికి కేవలం 5742 మంది విద్యార్ధులు మాత్రమే హాజరయ్యారు. మంగళవారం నాడు కేవలం 5268 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలనకు రిజిస్టర్ చేసుకున్నారు. రెండు రోజులు కలిపి 8527 మంది సర్ట్ఫికేట్ల పరిశీలన జరిగింది. హెల్ప్‌లైన్ సెంటర్లలో ఈ నెల 30వ తేదీ వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలనకు అనుమతిస్తారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందిన విద్యార్ధులైనా ఈ నెల 30వ తేదీలోగా ఏ కేంద్రంలోనైనా హాజరై సర్ట్ఫికేట్ల పరిశీలన చేయించుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశ్ రావు బుధవారం నాడు మరో మారు చెప్పారు.
20 కేంద్రాలు మూసివేత
english title:
counselling
Date:
Friday, August 23, 2013