హైదరాబాద్, ఆగస్టు 22: సీమాంధ్ర ఉద్యమంతో వివిధ పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఆంధ్రాయూనివర్శిటీ, నాగార్జున వర్శిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షను వాయిదా వేసింది. సెప్టెంబర్ 1న నిర్వహించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్‌ను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలపారు. తిరిగి ఎపుడు నిర్వహించేది త్వరలో సమాచారం అందిస్తామని టెట్ కన్వీనర్ జగన్నాధరెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 1న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ నెల 25వ తేదీ నుండి హాల్‌టిక్కెట్లు జారీ చేస్తామని చెప్పిన అధికారులు చివరికి పరీక్షను వాయిదా వేశారు.
సీమాంధ్ర ఉద్యమంతో వివిధ పరీక్షలు వాయిదా
english title:
tet
Date:
Friday, August 23, 2013