హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో కరుడుగట్టిన సమైక్యవాదులుగా పేరొందిన తాజా, మాజీ ముఖ్యమంత్రులు గురువారం భేటీ అయ్యారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి రోశయ్య నివాసంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపు భేటీ అయ్యారు. వ్యక్తిగత భేటీ అంటున్నప్పటికీ తాజా రాజకీయాలు, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 2009లో తొలిసారి తెలంగాణపై అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్యే ఉన్నారు. ఆ తరువాత జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా రోశయ్య రాజీనామా చేశారు. అప్పటి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా కిరణ్ తెలంగాణ సెగను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోశయ్య, కిరణ్ కలవడం, తాజా పరిణామాలపై చర్చించుకోవడం ఆసక్తి కలిగించింది.
* రోశయ్యను కలిసిన కిరణ్
english title:
kiran
Date:
Friday, August 23, 2013