హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర విభజనకు టిడిపి, బిజెపి, సిపిఐ పార్టీలే కారణమని వైద్యవిద్యా శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్ ధ్వజమెత్తారు. ఆ మూడు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుందన్నారు. గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ విభజనపై కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామని ఆయన చెప్పారు. అలాగే విభజనపై పార్టీ నిర్ణయం మార్చుకోని పక్షంలో రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలో పార్టీ తరుపున పోటీ చేయడానికి ఎవరు ధైర్యం చేయరని ఆంటోని కమిటీకి స్పష్టం చేశామని తెలిపారు. అధిష్ఠానం రాష్ట్ర విభజనపై అన్ని కోణాల్లో పరిశీలనలు జరుపుతోందన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టనున్న ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’కు సీమాంధ్ర ప్రజలు పూలతో స్వాగతం పలుకుతారో, రాళ్లతో స్వాగతం పలుకుతారో కాలమే నిర్ణయిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్ర విభజనకు టిడిపి, బిజెపి, సిపిఐ పార్టీలే కారణమని
english title:
kondru
Date:
Friday, August 23, 2013