Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విభజన మంటల్లో చలి కాచుకుంటారా?

$
0
0

హైదరాబాద్, ఆగస్టు 23: రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితికి, రాష్ట్ర విభజనకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణం అంటూ టిడిపి ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు 17 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు టిడిపి ఎమ్మెల్యేలు ఆమెకు బహిరంగ లేఖ రాశారు. సీమాంధ్రలో, తెలంగాణలో భావోద్రేకాలను రెచ్చగొట్టి ఆందోళన చిచ్చు రగిల్చారని విమర్శించారు. విభజన మంటల్లో చలి కాచుకునే నీచానికి దిగజారారని మండిపడ్డారు. విభజనపై టిడిపి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని వైకాపా కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అధికారం ముసుగులో లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడి జగన్ జైలు పాలయ్యాడని ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలను జైళ్లకు పంపి రాష్ట్రంలో పని చేయాలన్నా, పరిశ్రమ పెట్టాలన్నా భయపడే పరిస్థితి కల్పించారని విమర్శించారు. టిడిపి ఎమ్మెల్యేలు ధూళిపాళ్ళ నరేంద్ర, ఎం. లింగారెడ్డి, టివి రామారావు, జి. రామానాయుడు విజయమ్మకు లేఖ రాశారు. వైకాపా తెలంగాణలో జెండా పీకేయడంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో చొరబడి ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని మండిపడ్డారు. ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానాలు ఉన్నాయా? అంటూ 17 ప్రశ్నలు విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లక్ష కోట్ల రూపాయల అక్రమాస్తులపై సిబిఐ విచారణ ఎందుకు మందగించిందని ప్రశ్నించారు.
జగన్ ఆస్తులు 200 కోట్లు, గాలి జనార్దన్‌రెడ్డి ఆస్తులు 700 కోట్ల రూపాయల ఆస్తుల జప్తునకు ఈడీ ప్రస్తుతం ఎందుకు వౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. జూలై 3 సిడబ్ల్యుసి భేటీకి ముందే వైకాపా, టిఆర్‌ఎస్‌లతో కాంగ్రెస్ హై కమాండ్ మాట్లాడుకున్నారు, ఆ తరువాతే తెలంగాణపై నిర్ణయం ప్రకటించారని, విలీనంపై మూడు పార్టీల మధ్య అంతర్గత చర్చ నిజం కాదా? అని ప్రశ్నించారు. వైకాపా ఎంపి మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేసి సభకు వెళ్లకుండా ఏం చేస్తున్నారు? రాష్ట్ర మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ముందే మాట్లాడుకుని రాజీనామా చేసిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హైకమాండ్‌తో రాజీ కుదర్చమని అమెరికా రాయబారితో బ్రదర్ అనిల్ కుమార్ ప్రాధేయపడింది నిజం కాదా? ఢిల్లీ వెళ్లి విజయసాయిరెడ్డి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు ఆహ్మద్ పటేల్‌ను సంప్రదించలేదా? అని ప్రశ్నించారు. బెంగళూరు మీదుగా అత్తాకోడళ్లు రహస్యంగా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసింది నిజం కాదా? అని అడిగారు. చంచల్‌గూడ జైలులో జగన్ విచ్చలవిడి ములాఖత్‌లకు ముఖ్యమంత్రి కిరణ్ అండ ఉందని, జైల్లో జగన్ ఇంటర్‌నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం కుట్ర అని ఏడ్చి ఓట్లు పొందిన వారు తరువాత ఆ విషయం మరిచిపోయారని, అసలు దోషి సోనియాగాంధీని పల్లెత్తు మాట ఎందుకనడం లేదని ప్రశ్నించారు. జగన్ డిఎన్‌ఏ మాదేనని దిగ్విజయ్ చేసిన ప్రకటనను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. సాగునీరు, ఉద్యోగాలు, రాజధాని, హైదరాబాద్ తదితర అంశాలపై స్పష్టత లేకుండా ఇడుపుల పాయ ప్లీనరీలో తీర్మానం ఎందుకు చేశారని ప్రశ్నించారు. పరకాల ప్రచారంలో వైకాపా తెలంగాణకు అనుకూలం అని షర్మిల ప్రకటించలేదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో లక్ష కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.

అది అదనపు భూమే!

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 23: కొల్లేరులో వివాదాస్పదంగా ఉన్న 7,500 ఎకరాల భూమి అదనపు భూమిగానే అధికారులు గుర్తించారు. గతంలో సర్వేలు సక్రమంగా లేకపోవడం వల్లనే ఈ భూమి వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదని వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ భూమిని కూడా నోటిఫైడ్ భూమిగానే గుర్తించాల్సి ఉంటుందని, దీనిపై అక్కడి రైతులకు పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెబుతున్నారు. మొత్తానికి అదనపు భూమిపై నెలకొన్న వివాదానికి మాత్రం తెరపడినట్టయింది. దీనిని త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కొల్లేరులో వాస్తవ గణాంకాల మేరకు 77,138 ఎకరాల భూమి ఐదో కాంటూరులో ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే మరో 7,500 ఎకరాలు కొల్లేరు ప్రాంతంలో ఉందని, దానిని అక్కడి రైతులకు పంపిణీ చేయాలని పలు సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆందోళనలు కూడా నిర్వహించారు. చివరకు ఎంపి పదవికి రాజీనామా చేసి దీక్షకు దిగుతానని కూడా అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చి వాస్తవాలు వెలికి తీసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటుచేసింది. ఈ కమిటీ రెండుసార్లు భేటీ అయి అధికారులతో చర్చించింది. అసలు అదనపు భూమి ఉందా! లేదా? అన్న కోణంలో విచారించగా రికార్డుల్లో లేకుండా 7,500 ఎకరాల భూమి అదనంగా ఉన్నట్లు గుర్తించారు. రికార్డులు తయారు చేసే సమయంలో కొంత భూమి వివరాలు నమోదుకాకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందే తప్ప వాస్తవంగా 7,500 ఎకరాల భూమి కూడా కొల్లేరు పరిధిలో ఉన్నదేనని అధికారులు నిగ్గుతేల్చారు. అందుకే గతంలో ఉన్న 77వేల ఎకరాలతోపాటు, కొత్తగా గుర్తించిన 7,500 ఎకరాల భూమి కూడా కొల్లేరు పరిధిలోకే వస్తుందని వారు అంటున్నారు. దీంతో కొల్లేరు పరిధిలో ఉన్న మొత్తం భూమి ఇప్పుడు 84 వేలకు చేరుకోనుంది.
ఇలా ఉండగా, ఈ భూమి వివరాలు ఇప్పటివరకు రికార్డుల్లో లేకపోయినప్పటికీ నిబంధనల మేరకు కొత్తగా గుర్తించిన భూమి కూడా నోటిఫైడ్ భూమి పరధిలోకే చేరుతుందని అధికారులు అంటున్నారు. అందుకే ఈ భూమిపై అక్కడి వారికి పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఒక కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ప్రజల డిమాండ్ నేపథ్యంలో పట్టాలు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఆదేశించాల్సి ఉంటుందని సీనియర్ అధికారి వెల్లడించారు.

‘కొల్లేరు’లో కొలిక్కివస్తున్న లెక్కలు
7,500 ఎకరాలు అదనపు భూమిగానే గుర్తింపు
గతంలో లెక్కలు తప్పడం వల్లే ఈ సమస్యలు
పట్టాలివ్వాలంటే సుప్రీం జోక్యం తప్పనిసరి

మళ్లీ అప్రమత్తం!

తెలంగాణపై వెనకడుగు లేకుండా చర్యలు
జానా ఆధ్వర్యంలో టి.మంత్రుల భేటీ
ఉద్రిక్తతలకు తావీయరాదని నిర్ణయం
నేడు మరోసారి విస్తృత భేటీకి నిర్ణయం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 23: అధిష్టానం ప్రకటించిన ప్రత్యేక తెలంగాణ మళ్లీ వెనక్కిపోకుండా చూసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని వారు భావిస్తున్నారు. సీనియర్ మంత్రి జానారెడ్డి అధ్వర్యంలో ఇతర తెలంగాణ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, శ్రీ్ధర్‌బాబు, బస్వరాజు సారయ్య శుక్రవారం సచివాలయంలో భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చించారు. గత నెలాఖరులో ప్రత్యేక తెలంగాణపై అధిష్టానం కీలక ప్రకటన చేసినప్పటినుంచి సీమాంధ్రలో ఉద్యమాలు తీవ్రస్థాయికి చేరుకున్న అంశంపై కూడా వారు సమీక్షించుకున్నారు. వరుసగా సీమాంధ్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లడం, పార్లమెంట్ సభ్యులు రాజీనామాలకు సిద్ధమని ప్రకటించడం, పదకొండు మంది సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులను లోక్‌సభలో సస్పెండ్ చేయడం వంటి పరిణామాలపై చర్చించుకున్న టి.మంత్రులు.. భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై కూడా చర్చించారు. సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణపై అధిష్టానం వెనుకడుగు వేయకుండా చూసేలా కార్యాచరణ ఉండాలని వారు నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టకుండా చూస్తూ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కొనసాగింపునకు ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నారు.
తెలంగాణ సాధనకు కృషిచేసే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని వారు నిర్ణయించారు. తమ ప్రయత్నాలు సీమాంధ్రలో ఉద్యమాలను పెంచేవిగా కాకుండా చూసుకోవడంతోపాటు, అధిష్టానం వెనకడుగు వేయకుండా జాగ్రత్తలు తీసుకునేలా కూడా ఉండాలని భావిస్తున్నట్లు టి.మంత్రి ఒకరు వెల్లడించారు. ఇవే అంశాలపై శనివారం మరోసారి విస్తృత సమావేశాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి పొన్నాల లక్ష్మయ్య విలేఖరులతో మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అధిష్టానంపై ఒత్తిడి కొనసాగించడం ద్వారా త్వరలోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నట్లు వివరించారు.

విజయమ్మా! ఈ దుస్థితికి మీ భర్తే కారణం 17 ప్రశ్నలు సంధించిన టిడిపి ఎమ్మెల్యేలు
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>