నల్లకుంట, ఆగస్టు 23: లంచం తీసుకుంటూ నల్లకుంట పోలీస్టేషన్ ఎస్‌ఐ షేక్ ముస్తక్‌వల్లి అడ్డంగా దొరికి పోయాడు. ఏసిబి డిప్యూటీ ఎస్పీ టి.శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డిడి కాలనీకి చెందిన వాసుపల్లి చిరంజీవి (23) ఈ నెల 6వ తేదీన తన స్నేహితుడు హరీష్‌తో కలసి బైక్‌పై వెళుతున్న సమయంలో శంకర్‌మఠ్ వద్ద రాహుల్ అనే వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు కిందపడి పోయారు. వారిద్దరి మద్య వాగ్వివాదం జరగడంతో ఇద్దరూ కలసి నల్లకుంట పోలీసులను ఆశ్రయించారని, నల్లకుంట ఎస్సై షేక్ ముస్తక్‌వల్లి కేసు నమోదు చేసుకుని వాసుపల్లి చిరంజీవి బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిరంజీవి తన బైక్‌ను తనకు ఇవ్వమని ఎస్సైను కోరగా 10వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తాను విద్యార్థిని అని తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో డబ్బులు ఇవ్వక పోతే బైక్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడంతో చిరంజీవి ఈ విషయమై ఏసిబిని ఆశ్రయించాడు. ఏసిబి అధికారుల సూచనల మేరకు శుక్రవారం నల్లకుంట పోలీస్టేషన్‌లో ఎస్సైకి 9వేల రూపాయలు అందజేశాడు. 9వేల రూపాయల నుంచి కోర్టు చలానా నిమిత్తం 3వేల రూపాయలు జరిమానా కట్టమని అతనికి తిరిగి ఎస్సై ఇచ్చి.. మిగతా డబ్బు తన వద్దనే ఉంచుకున్నట్లు తెలిపాడు. అదే సమయంలో పథకం ప్రకారమే అక్కడ ఉన్న ఏసిబి అధికారులు అతనిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో మూడు సంవత్సరాలలో పదవీ విరమణ పొందనున్న షేక్‌ముస్తక్ వల్లి గతంలో బేగంబజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసి పదోన్నతిపై నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు 3 నెలల క్రితం పోస్టింగ్‌పై వచ్చాడు. ఎస్సైపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు.
లంచం తీసుకుంటూ నల్లకుంట పోలీస్టేషన్
english title:
acb
Date:
Saturday, August 24, 2013