చాంద్రాయణగుట్ట, ఆగస్టు 23: ముంబైలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై నగరం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మహిళలకు రక్షణ కల్పించే సత్తా సర్కార్‌కు వుందా లేదా అని పలువురు నగర వాసులు సూటిగా ప్రశ్నించారు.
విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తిమిల్స్ ఆవరణలో సామూహిక అత్యాచారం జరగడాన్ని నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. గత కొన్ని నెలలుగా మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను అమలు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నాయే తప్ప సరైన చర్యలు తీసుకోవడంలేదని పలువురు వాపోయారు. విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులకు, అందులో ప్రధానంగా మహిళా పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు. ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరగడం సభ్య సమాజం తల దించుకునేలా చేసిందని వారు నివ్వెర పోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేం్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిని వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.
ముంబైలో మహిళలపై జరుగుతున్న
english title:
m
Date:
Saturday, August 24, 2013