చాంద్రాయణగుట్ట, ఆగస్టు 23: విద్యార్థులు బాగా చదువుకుని దేశ అభివృద్ధిని, గౌరవాన్ని పెంపొందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేయడమేకాక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోటుపుస్తకాలను పంచినందుకు టిఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ హుసేన్ ముజీబ్‌ను, కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. దీంతో పిల్లల భవిష్యత్తుకు సమాజానికి గొప్ప మేలుచేసినవారు అవుతారని, పిల్లలు బాగా చదువుకుని దాతల పేరు నిలబెట్టాలన్నారు. సమావేశంలో పాల్గొన్న టిఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల అవసరానికి నోటుబుక్కులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. పేద పిల్లల అవసరాలు తీర్చే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై వున్నదని, టిఎన్జీవోల తరఫున తమ వంతు సహాయం భవిష్యత్తులో కూడా చేస్తామన్నారు. ఉపాధ్యాయులు పిల్లలను గర్వంగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలంటూ ముజీబ్‌ను అభినందించారు. ముజీబ్ మాట్లాడుతూ, తన వంతు బాధ్యతగా నోటుపుస్తకాలు పంపిణీ చేసానని, తమ సమయాన్ని వెచ్చించినందుకు కలెక్టర్‌కు తెలిపారు. డిఇఓ సుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఎం.ఎ.ఖాదర్‌ఖాన్, టిఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, రేచల్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు బాగా చదువుకుని దేశ అభివృద్ధిని,
english title:
v
Date:
Saturday, August 24, 2013