హైదరాబాద్, ఆగస్టు 23: ఏ పని చేపట్టినా తొలుత ఆర్భాటం..హల్‌చల్, ఆ తర్వాత అంతా నిర్లక్ష్యం..అలసత్వం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పదేళ్ల క్రితం చేపట్టిన చార్మినార్ పాదచారుల క్షేత్రం పనులు నేటికీ పూర్తి కాలేదంటే అధికారులు ఎంత చిత్తశుద్ధితో, ఎంత సమర్థవంతమైన పర్యవేక్షణతో పనులు చేపడుతున్నారో అంచనా వేసుకోవచ్చు. అలాగే పాతబస్తీలోని ఖిల్వత్ మల్టీపర్పస్ పార్కింగ్ కాంప్లెక్సు నిర్మాణానికి కూడా పదిహేనేళ్ల క్రితం ప్రతిపాదనలు రూపొందించినా, నేటికీ కనీసం టెండర్లను కూడా ఖరారు చేయలేని దుస్థితి. ఇవేగాక, ఇప్పటివరకు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎన్నో పనులు స్థల సేకరణలో జరుగుతున్న జాప్యం కారణంగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
* ఏ పని చేపట్టినా ఏళ్లు గడవాల్సిందే! * బల్దియా విభాగాల మధ్య సమన్వయ లోపం * ఎక్కడికక్కడే ఆగిపోయిన పనులు * స్థల సేకరణలో తీవ్ర జాప్యం * పనులొదిలేసి వెళ్తున్న కాంట్రాక్టర్లు
english title:
k
Date:
Saturday, August 24, 2013