అంతర్జాతీయ అథ్లెటిక్స్ రంగంలో మెరిన భారత సూపర్ అథ్లెట్ మిల్కా సింగ్‌ను మనం ఏనాడో మరచిపోయాం. దేశ విభజన సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన మిల్కా అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో పెరిగాడు. అథ్లెటిక్స్‌లో అతనికి కనీస శిక్షణ కూడా లేదు. కానీ, 1952లో ఆర్మీలో ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరిన తర్వాత మిల్కా సింగ్ దశ తిరిగింది. కోచ్ హవల్దార్ గురుదేశ్ సింగ్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకున్నాడు. ఇందుకోసం రోజుకు కనీసం ఆరు గంటలు శ్రమించేవాడు. 1956 జాతీయ క్రీడల్లో పాల్గొని పతకం సాధించడంతో మిల్కా సింగ్ పేరు అందరికీ తెలిసింది. 1958 కటక్ జాతీయ క్రీడల్లో అతను 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకోవడంతోపాటు కొత్త రికార్డులు నమోదు చేశాడు. 1960 రోమ్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన అతను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నాలుగో స్థానానికి పరిమితం అయ్యాడు. మిగతా పోటీదారులు ఎంత దూరంలో ఉన్నారన్న కుతూహలంతో పదేపదే వెనక్కు తిరుగుతూ చూడడం అతనిని పతకం నుంచి దూరం చేసింది. ఫొటో ఫినిష్‌లో 0.1 సెకను ఆలస్యంగా లక్ష్యాన్ని చేరిన మిల్కాకు నాలుగో స్థానం దక్కినట్టు నిర్వాహకులు ప్రకటించారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికీ అతనికి పతకం దక్కలేదు. 1958 ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్ 200, 400 మీటర్ల విభాగాల్లో, తిరిగి 1962 ఆసియా క్రీడల్లో 200 మీటర్ల విభాగంలో టైటిళ్లు సాధించిన మిల్కా కెరీర్‌లో 1962 రేస్ కలకాలం గుర్తుండిపోతుంది. టోక్యో ఆసియా క్రీడల్లో 100 మీటర్ల స్ప్రింట్ విజేత అబ్దుల్ ఖలీక్‌ను మిల్కా సింగ్ చిత్తుచేశాడు. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అతని వేగాన్ని చూసి తెగ ముచ్చటపడ్డాడట. ‘్ఫ్లయింగ్ సిఖ్’ అంటూ మిల్కా సింగ్‌ను అయూబ్ ఖాన్ మెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మిల్కాకు ‘్ఫ్లయింగ్ సిఖ్’ అన్న పేరు స్థిరపడింది. 1958లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం అతనిని సత్కరించింది. మిల్కా తన కెరీర్‌లో సాధించిన పతకాలు, అందుకున్న అవార్డులను జాతికి అంకితం ఇచ్చాడు. వాటిని కేంద్ర ప్రభుత్వానికి కానుకగా అందచేసి దేశ భక్తిని చాటుకున్నాడు. ఇప్పటికీ ఎంతో ఉత్సాహంతో కనిపించే మిల్కా సేవలను భారత క్రీడా సమాఖ్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఒక గొప్ప అథ్లెట్‌ను మరచిపోయ ఎప్పటి మాదిరిగానే గాఢ నిద్రలోకి జారుకోవడం విచారకరం.
అంతర్జాతీయ అథ్లెటిక్స్ రంగంలో మెరిన భారత సూపర్ అథ్లెట్ మిల్కా
english title:
m
Date:
Sunday, August 25, 2013