భారత తొలి చెస్ గ్రాండ్ మాస్టర్ (జిఎం) విశ్వనాథన్ ఆనంద్. 1988లో తన 18వ ఏట అతను చివరి జిఎం నార్మ్ సాధించాడు. 1969 డిసెంబర్ 11న చెన్నైలో జన్మించిన అతను 1983లో భారత జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఆతర్వాత అతనికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ, ప్రపంచ చాంపియన్‌గా ఎదిగాడు.
ఆనంద్ క్రీడా జీవితంలో మైలురాళ్లు: 1983లో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్, 1984లో ఆసియా జూనియర్ చాంపియన్, 1984లో అంతర్జాతీయంగా మాస్టర్, 1985లో జాతీయ చదరంగం చాంపియన్, 1987లో ప్రపంచ చదరంగం జూనియర్ చాంపియన్, 1988లో ప్రపంచ చదరంగం గ్రాండ్ మాస్టర్, 1990లో ఆసియా చాంపియన్‌గా అవతరణ, 2000లో ఫిడే ప్రపంచ చాంపియన్, 2000లో ప్రపంచ బ్లిడ్జ్ చాంపియన్, 2003లో ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్, 2007 ప్రపంచ చాంపియన్ (మెక్సికో), 2008 ప్రపంచ చాంపియన్ (జర్మనీ), 2012 ప్రపంచ చాంపియన్‌షిప్ (రష్యా) అందుకున్నాడు.
భారత తొలి చెస్ గ్రాండ్ మాస్టర్ (జిఎం) విశ్వనాథన్ ఆనంద్.
english title:
ches
Date:
Sunday, August 25, 2013