‘చిలక పచ్చ చీరకట్టి చేమంతి పూలుపెట్టి సోకు చేసుకొచ్చానురో, ఓరయ్యో చుక్కలాంటి చిన్నదాన్నిరో’ (‘మా ఇద్దరి కథ’ సినిమాలోని పాట). తెలుగు సాంప్రదాయానికి ‘చీర’ ఎంత విలువైన వస్తమ్రో నాటి హీరోయిన్స్ అయిన సావిత్రి, జమున, మంజుల, వాణిశ్రీ, శారదలకు తెలుసు.
‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదీ...’అని అక్కినేని స్టెప్స్ వేస్తుంటే కుర్రకారు ఈలల్తో హాలంతా మార్మోగి పోయేది. కానీ నేడు కనీసం హీరోయిన్ తల్లి పాత్రలో కూడా ‘చీర’ జాడ కనిపించటం లేదంటే అతిశయోక్తికాదేమో! అలనాటి అందాల తారలంతా చీర కట్టుతోనే ఎన్నో సినిమాలకు జీవంపోసి ప్రేక్షకులను అలరించారు. అందమైన కథానాయికలే కాకుండా పలురకాల సహాయ నటీమణులు అందరూ తప్పక చీరలో కనిపించాల్సిందే!!
‘మా ఇద్దరి కథ’ చిత్రంలో చిలకపచ్చ చీరకట్టి పాటలో నృత్యం చేసిన మంజులను నేటికీ ఎవరూ మరచిపోలేరు. ఆ తర్వాత తరం వారు విషయానికి వస్తే... విజయశాంతి, భానుప్రియ, సౌందర్యలు తమ చిత్రాల్లో అసభ్యకర మోడ్రన్ డ్రస్సులు, బికినీలు వేయక చీరకట్టు (ఎక్కువ శాతం)కు విలువనిస్తూ అనేక బంపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. అప్పటి ప్రేక్షకులు కూడా హీరోయిన్‌ను చీరకట్టులో చూసుకోడానికి ఉవ్విళ్లూరేవారు. తెలుగుతనం ఉట్టిపడే విధంగా వెరైటీ డిజైన్ల చీరలతో ఎన్నో చిత్రాలు ఆణిముత్యాలుగా మిగిలిపోయి నేటికీ ఆ చిత్రాలు ప్రేక్షకులకు అలరిస్తున్నాయి. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో విజయనిర్మల ‘వస్తాడు నారాజు ఈరోజు’ అనే పాట నేటికీ అందరి మదిలో మెదులుతోంది. ఇకపోతే నేటి దుస్తుల్లో కూడా ‘చీర’పై మోజు తగ్గని దర్శకుడు ఒకే ఒక్కడు వున్నారు. ఆయనే ‘వంశీ’. వంశీ అంటే ‘కాటన్ చీర’, కట్టూబొట్టూ- గోదారి ఒడ్డు అనిపించుకుంటూ ‘తెలుగు చీర’ విలువను ఇంకా మర్చిపోకుండా కాపాడుకుంటూ రావడంవల్ల ఆయనను మెచ్చుకోక తప్పదు. మరి ‘కళాతపస్వి’ చిత్రాలన్నీ ‘చీర’తో ముడిపడినవే అనటం సబబు. కానీ ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతల్ని తీసుకోవటం లేదు కదా?
నేటి సినిమాలలో వలువలకు విలువలుతగ్గి వనిత చీర సిగ్గుతో పారిపోతూ చడ్డీకీ, మిడ్డీకీ లేదా బికినికి ఆ ఛాన్స్ ఇచ్చేసిందనిపిస్తోంది. హీరోయిన్ కావాలంటే ప్రధాన అర్హత తెలుగువారై ఉండకూడదు. తెలుగు మాట్లాడటం సరిగారాకూడదు. (అదంతా డబ్బింగ్ ఆర్టిస్టులు చూసుకుంటారు) కానీ! బికినీ లేదా చడ్డీలు జీన్స్, మోడ్రన్ డ్రస్సులతో మోడలింగ్ అనుభవం ఉంటే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లే. ప్రేక్షకులకు ‘అందాల ఆరబోత’ ఉండాలి. ఈమధ్య బిజీఅయిన వెంకటేష్‌కు జోడీగా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో నటించిన అందాల తార అంజలి కాస్త ‘చీర’కు విలువ ఇస్తోంది. సౌందర్యలోనే చీర మాయమైపోయిందా? అనుకున్న తెలుగు ప్రేక్షకులకు ‘అంజలి’ ఊరట కల్గించింది.
నేటి చిత్రాల్లో ‘పొదుపు’గా వస్తధ్రారణ వుంటే యువత థియేటర్లలో కిక్కిరిసి వస్తారనే ఆలోచనల్లో నిర్మాతలు, డైరెక్టర్లు ఆలోచిస్తున్నారు. హీరోయినే్స చిన్నచిన్న బట్టలేసుకొని డాన్సులుచేస్తుంటే అటువంటి పాటల్ని పిల్లల పక్కన కూర్చొని తల్లితండ్రులు చూడగలరా? మీరే ఆలోచించి చెప్పాలి. బహుశా...అందుకే థియేటర్లలో కుటుంబాలు కనపడట్లేదు. సాంప్రదాయపరమైన చిత్రాలకు కాస్త పీట అయినా వేస్తూ... సంవత్సరానికో కనీసం ఐదు చిత్రాలైనా నిర్మించి తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలకు ‘చీర’ప్రాధాన్యత అవసరమని గుర్తిస్తారని ఆశిస్తూ...
‘చిలక పచ్చ చీరకట్టి చేమంతి పూలుపెట్టి సోకు చేసుకొచ్చానురో,
english title:
cheera
Date:
Sunday, August 25, 2013