పోసాని కృష్ణమురళి, శిల్పి శుక్లా, సురేష్, తా.రమేష్ ప్రధానపాత్రధారులుగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘అందరూ అందరేనా’ (రొమాంటిక్ హర్రర్). కాసుల రామకృష్ణ (శ్రీ్ధర్) దర్శకత్వంలో శివసాయి శ్రీకర్‌గుప్తా కె. నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా టైటిల్ లోగోను హైదరాబాద్‌లో దర్శకులు దేవీప్రసాద్, వీరశంకర్, నిర్మాత సాయివెంకట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెన్సార్ వారికి పంపగా ఏ సర్ట్ఫికెట్ లభించిందని, రొమాంటిక్, కామెడీ, హర్రర్ థ్రిల్లర్‌గా నిర్మించిన ఈ చిత్రం కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయని, చూసిన ప్రతివారికీ సినిమా నచ్చుతుందని తెలిపారు. సెప్టెంబర్ 1,2 తేదీల్లో ఆడియో విడుదల చేసి, అదే నెల రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నిర్మాత, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
త్వరలో
‘బ్రేకప్’
రణధీర్, స్వాతి దీక్షిత్ ప్రధానపాత్రలో ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘బ్రేకప్’. స్వీయ దర్శకత్వంలో కామేపల్లి అమర్ రూపొందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు అమర్ కామేపల్లి మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో కథను రూపొందించిన చిత్రమిదని, అనేక మందికి ఈ కథను వినిపించగా వారికెవరికీ నచ్చలేదని, దాంతో తానే ఎందుకు ఈ చిత్రం నిర్మించకూడదన్న ఆలోచనతో, మిత్రుల సహకారంతో నిర్మించానని తెలిపారు. ప్రేమ అనేది ఓ అందమైన కల అయితే, బ్రేకప్ పీడ కలలాంటిదని, అటువంటి పీడ కలనే మధురస్వప్నంలా మార్చుకోవాలనుకున్న ఓ యువకుడి కథే ఈ చిత్రమని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్లను లక్ష మంది చూశారని, ఆడియోకి కూడా మంచి స్పందన లభిస్తోందని, వచ్చేనెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. వాలంటైన్స్‌డే గిఫ్ట్‌లా ఈ చిత్రం ప్రేమికులకు అందిస్తున్నామని రణధీర్ తెలిపారు. రీరికార్డింగ్ కూడా ఛాలెంజింగ్‌గా చేశామని, ఇండస్ ఘరానా తెలిపారు. కార్యక్రమంలో స్వాతిదీక్షిత్, ప్రశాంత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. సురేష్, జోగినాయుడు, అల్లరి సుభాషిణి, హరీష్, నీల్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, రచయితలు: ప్రశాంత్, సుమలత, కథ: రామచంద్రారెడ్డి, ఎడిటింగ్: లోకీచెన్న, సంగీతం: ఇండస్ ఘరానా, నిర్మాత, దర్శకత్వం: అమర్ కామేపల్లి.