Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉద్యమం .. ఉద్ధృతం

$
0
0

విజయనగరం, ఆగస్టు 26: సమైక్యాంధ్ర కోసం చేస్తోన్న పోరాటం ఏ మాత్రం సడలలేదు. నేటికి 26 రోజులు గడచినప్పటికీ ఇంకను ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు.. ఆమరణ దీక్షలు.. మానవహారాలు..ర్యాలీలు... దిష్టిబొమ్మల దగ్ధం.. వంటావార్పు.. సైకిల్ ర్యాలీలు.. పాదయాత్రలు ఇలా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పట్టణంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించి ఎత్తుబ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కోట, మూడులాంతర్లు, గంటస్తంభం మీదుకా కన్యకాపరమేశ్వరీ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోటాపోటీగా ఆమరణ దీక్షలు
ఎస్.కోటలో సమైక్యాంధ్ర కోసం నేతలు పలువురు ఆమరణ దీక్షలకు పూనుకున్నారు. ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో నిన్న ఆమరణ దీక్షలు ప్రారంభం కాగా, ఈ రోజు టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగఅ హైమవతికి పలువురు సంఘీభావం వ్యక్తం చేశారు.
వినూత్న నిరసనలు
విజయనగరం పట్టణంలో సప్తపది సంగీత నృత్య కళాకారులు తప్పెటగుళ్లు, పులివేషాలు, గారడీ తదితర విన్యాసాలు ప్రదర్శించారు. ఈ ర్యాలీ కోట నుంచి ప్రారంభించి మూడులాంతర్లు, గంటస్తంభం, బాలాజీ జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. అనంతరం ఎన్‌సిఎస్ గ్రూపు ఆధ్వర్యంలో వారికి మధ్యాహ్నా భోజన సదుపాయం కల్పించారు. పట్టణంలోని ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద ప్రైయివేట్, ఎయిడెడ్ స్కూళ్ల ఆధ్వర్యంలో రోడ్డుపై విద్యార్థులకు పాఠాలు బోధించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ఆవశ్యకత గురించి జెవివి ప్రతినిధి ఎంవిఆర్ కృష్ణాజీ, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ తదితరులు మాట్లాడారు. సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సీమాంధ్ర మంత్రులకు సిగ్గు లేదంటూ నినాదాలు చేశారు.
లక్ష సంతకాల సేకరణ
సమైక్యాంధ్ర కోసం లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఎల్.కోటలో చేపట్టారు. ఉపాధ్యాయ నేతలు జి.కొండలరావు, జి.శ్రీనివాసరావు, ఇ.సాయికృష్ణ నేతృత్వంలో లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు. చీపురుపల్లిలో సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు.పూసపాటిరేగలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉపాధ్యాయులు, వేద పండితులతో కలసి శివలింగానికి అభిషేకం చేశారు. వేపాడలో జెఎసి ఆధ్వర్యంలో సోంపురం, ఆనందపురం మీదుగా 15 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా సమైక్యాంధ్ర కోసం జిల్లా అంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి.

‘సీమాంధ్రలో కాంగ్రెస్
డిపాజిట్లు గల్లంతు’
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఆగస్టు 26: సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సోమవారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బోఫర్స్, బొగ్గు కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్ తదితర కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా తెలంగాణా చిచ్చుపెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 శతాబ్ధం నుంచి సీమాంధ్ర పెట్టుబడులు హైదరాబాద్‌లో పెట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రఖ్యాత సంస్థలు అన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయని, అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమై ఉందని, అలాంటపుడు హైదరాబాద్‌ను తెలంగాణాకు ఇస్తామంటే ఎలా ఊరుకుంటామని ఆయన ప్రశ్నించారు. పిసిసి నేత బొత్స సత్యనారాయణ తెలంగాణా విభజనకు కారకులయ్యారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. రాష్ట్రం చీలిపోతే ముఖ్యమంత్రికావాలన్న తపన ఒకరిది, కొడుకు ప్రధాని కావాలన్న తాపత్రయం ఒకరిది అని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తయారుచేసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్, దేముడు తదితరులు పాల్గొన్నారు.
నిరసన జ్వాలలు
విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 26: సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉంటున్న సీమాంధ్ర మంత్రులు పదవులకు వెంటనే రాజీనామా చేయాలని సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మయూరి జంక్షన్ వద్ద సీమాంధ్ర మంత్రులను హిజ్రాలుగా మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆతర్వాత మయూరిజంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయ్యొదు అంటూ అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కి సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తుంటే, ఉద్యమాన్ని ముందుండి నడిపించాల్సిన సీమాంధ్ర మంత్రులు కనీసం పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర మంత్రులు పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర జెఎసి విద్యార్థి నాయకులు పృధ్వీ, అనిల్, స్వామినాయుడు, యువజన సంఘం నాయకుడు శివరాం, సమైక్యాంధ్ర జెఎసి సభ్యులు సోంబాబు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల స్నేక్ ర్యాలీ
స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయనేతలు సమైక్యవాదమనే పాముకు బలికాక తప్పదని తెలియజేస్తూ ఇక్కడి ఒక పాఠశాల విద్యార్థులు 50 అడుగుల పొడవుగల పాము బొమ్మను తయారుచేసి సోమవారం పట్టణంలో స్నేక్‌ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర మద్దతుగా నిర్వహించిన ఈ ర్యాలీని లోక్‌సత్తా పార్టీ నాయకుడు బాబ్జీ ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ కార్యాలయం వద్ద పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రాష్టవ్రిభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలు నష్టాలను భరించక తప్పదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇరు ప్రాంతాలకు చెందిన విషయాలను అధ్యయనం చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని ప్రకటించడం తీవ్ర అభ్యంతకరమన్నారు. పాఠశాల కరస్పాండెంట్ వి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలోభాగంగా స్థానిక మయూరిజంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు.
ఆమరణ నిరాహార దీక్షలు
శృంగవరపుకోట : సమైక్యాంధ్రకు మద్దతుగా ఎస్.కోట పట్టణంలో జెఎసి ఉద్యోగుల సంఘం, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ పార్టీలకు చెందిన నాయకులు ఆమరణ నిరాహార దీక్షలో సోమవారం పాల్గొన్నారు. స్థానిక దేవీబొమ్మ వద్ద ఆదివారం సాయంత్రం నుండి ఐదుగురు ఉద్యోగ జెఎసి సిబ్బంది ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తుండగా సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శోభాహైమావతి ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి ఈమెకు పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. ఈమెతోపాటు ఒక్కరోజు నిరాహారదీక్ష కార్యక్రమంలో 15 మంది మహిళలు పాల్గొన్నారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున ఎస్‌కోట పంచాయతీ, మాజీ ఉప సర్పంచ్ షెక్ రేహన్, వీరన్న ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనగా వీరికి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గేదెల తిరుపతి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. జెఎసి ఆధ్వర్యంలో 48 గంటలపాటు చేస్తున్న బంద్‌లో భాగంగా జెఎసి ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ విజయవంతంగా నిర్వహించారు. బొడ్డవలర, ధర్మవరం శివారులో వాహనాలను నిలివేసి ట్రాఫిక్‌ను నిలిమివేశారు. జెఎసి సమైక్యవాదులు వాహనాలపై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ పట్టణంలోని దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. మధ్యాహ్నం జెఎసి ఆధ్వర్యంలో దేవీ జంక్షన్ వద్ద వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి రోడ్డుపైనే సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వసించారు. కార్యక్రమంలో పలువురు సమైక్యవాదులు పాల్గొన్నారు.
కోర్టు సిబ్బంది రిలే దీక్షలు
చీపురుపల్లి, ఆగస్టు 26 : జెఎసి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలో మీసాల శ్రీనివాసరావు, స్వామి, ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మండల ఉపాధ్యాయులు సమైక్యాంధ్రకు మద్దతగా స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ ఆవరణలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కోర్టు సిబ్బంది, కోర్టు ఆవరణలో దీక్షలు చేపట్టారు. జగన్ జైల్లో చేపట్టిన దీక్షకు మద్దతుగా స్థానిక వైకాపా నాయకులు మూడు రోడ్ల జంక్షన్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పట్టణానికి చెందిన ప్రైవేటు కళాశాలల విద్యార్ధులు ర్యాలీ నిర్వహించి గాంధీ బొమ్మ వరకు వెళ్లి గాంధి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉపాధ్యాయులు రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. మూడు రోడ్ల జంక్షన్ వద్ద ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేటు కంటి ఆసుపత్రి వైద్యులు రహదారిపై కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే మండలంలోని కర్లాం, మెట్టపల్లి,పెరిపి, గొల్లలపాలెం, తదితర గ్రామాల నుండి ఆటోలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయా గ్రామాల నుండి చీపురుపల్లి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద ఆటోలతో మానవహారం నిర్వహించారు. అనంతరం ధర్నా కార్యక్రమం చేపట్టిన నిరసన తెలిపారు.
30న సమరభేరి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం: రాజధానిలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడి చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకే టిఆర్‌ఎస్ ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ నెల 30న నిర్వహించతలపెట్టిన విజయనగరం సమరభేరి కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలన్నారు. విజయనగర భేరి డిల్లీ నేతలకు విన్పించేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్రం కోసం అందజేసిన లెటర్‌ను వెనక్కి తీసుకోవాలని కోరితే ఏ ఒక్కరు చంద్రబాబునాయుడుపై వత్తిడి తీసుకురాకపోవడం విచారకరమన్నారు. ఆత్మగౌరవ యాత్రను విరమించుకోవడం చూస్తుంటే ఆయన రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నట్టు గోచరిస్తుందన్నారు.

సమైక్యాంధ్ర కోసం చేస్తోన్న పోరాటం ఏ మాత్రం సడలలేదు.
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>