న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జిడిపి అంచనాను ఆర్థిక సేవల దిగ్గజం బిఎన్‌పి పరిబాస్ బుధవారం కుదించింది. ఇంతకుముందున్న 5.7 శాతం అంచనాను 3.7 శాతానికి దించింది. అంతేగాక సంక్షోభం సమీపిస్తోంది అని హెచ్చరించింది కూడా. ‘రూపాయి విలువ పతనంతో వ్యాపార రంగంలో విశ్వాసం కుప్పకూలుతోంది. ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రతికూల ఆర్థిక పరిస్థితులు బిగుసుకుంటున్నాయి. ఆర్థిక విధానం గందరగోళంగా మారుతోంది.’ అని వ్యాఖ్యానించింది. భారత్ స్థూల ఆర్థిక సమస్యలు త్వరగా సంక్షోభాన్ని దగ్గరికి చేరుస్తున్నాయని తెలిపింది. ఈ క్రమంలోనే జిడిపి వృద్ధిరేటును ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 3.7 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 1991-1992 నుంచి గమనిస్తే ఇదే అత్యంత తక్కువ వృద్ధిరేటుగా పేర్కొంది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 5.3 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.
* దేశ వృద్ధిరేటు అంచనాను తగ్గించిన బిఎన్‌పి పరిబాస్
english title:
a
Date:
Thursday, August 29, 2013